ప్రాణాలు తీస్తున్న యాంటీ బయోటిక్స్

Tue,May 21, 2019 01:34 AM

బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి వైద్యులు యాంటిబయోటిక్స్‌ను రోగికి సూచిస్తారు. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను చంపడం ద్వారా లేదా క్షీణింపజేయడం ద్వారా ఆయా బ్యాక్టీరియా కారక రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి. ఈ యాంటీ బయోటిక్స్ సాధారణంగా ఇంజిక్షన్ల రూపంలో, టాబ్లెట్ రూపంలో ఉంటాయి. వైద్యులు చిన్నపిల్లలకు సిరప్ రూపంలో యాంటీబయోటిక్స్‌ను అందజేస్తారు. కొన్ని ట్యాబ్లెట్ రూపంలో ఉండే యాంటీబయోటిక్స్‌లలో సల్ఫర్ ఉం టుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు రోగిని పరీక్షించి యాంటీబయోటిక్స్‌కు రియాక్షన్ కలుగకుండా మందులు ఇస్తారు. మనకేదైనా అనారోగ్య సమస్య వస్తే రోగ తీవ్రతను బట్టి వెంటనే మూత్ర, రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఈ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ సులభం అవుతుంది. అందుకనుగుణంగా వైద్యుడు మందులిస్తాడు. కొంతమం ది రోగులు వైద్యుడిని సంప్రదించకుండానే అందుబాటు లో ఉన్న మందుల షాపుల్లో టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకుంటారు. ఇవి మరింత అనారోగ్య పరిస్థితికి దారితీస్తాయి.

యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలుచేసే బ్యాక్టీరియాలు కూడా చనిపోవచ్చు. ఇంకొందరు రోగులు డాక్టర్ ఇచ్చిన మందులను సక్రమం గా వాడరు. మందులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచరు. కొన్ని సందర్భాల్లో కాలపరిమితి దాటిన మందులను వేసుకుంటారు. కాలపరిమితి దాటిన మందులను వాడితే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. యాంటిబయోటిక్స్ వల్ల డయేరియా కూడా రావచ్చు. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొనడం తో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్స్ వినియోగంలోకి వచ్చాయి. వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు యాంటిబయోటి క్స్ పనిచేయవు. సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గతేడాది 328 రకాల పెయిన్‌కిల్లర్స్ యాంటీబయోటిక్స్ మిశ్రమాలపై నిషేధం విధించింది నిషేధిత మం దులపై అవగాహన పెంచుకోవాలి. దీనితో పాటు ప్రభుత్వా లు జనరిక్ మందులను వాడేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడే యాంటీబయోటిక్స్ అవసరం పెద్దగా ఉండదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- యం.రాంప్రదీప్

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles