సెలవుతో సహకరించాలి

Sat,May 18, 2019 12:54 AM

పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. ఈ నెలలో ముస్లింలు పేదలకు, అనాథలకు, యాచకులకు బట్టలు దానం చేస్తారు. ఇది నాటినుంచి వస్తున్న ఆచారం. రంజాన్ మాసంలో ఒకటి, రెండు సెలవులు సాధార ణంగా వచ్చేవి. కానీ ఈసారి రంజాన్ మాసంలో ఒక్కరోజు కూడా సెలవు రాలే దు. బట్టలు, వగైరా కొనాలంటే సెలవు దినం అవసరం. కాబట్టి ప్రభుత్వం ఈ నెలలో ముస్లింలకు రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలి. తెలంగాణ ప్రభు త్వం ఇప్పటికే పేద ముస్లింలకు రంజాన్ మాసంలో బట్టలు పంపిణీ చేస్తూ ముస్లిం ల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నది. దీనికి ముస్లింలు రుణపడి ఉంటారు. సెల వు కూడా ప్రకటించి సహకరించాలని ముస్లింలు కోరుతున్నారు.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్, జోగులాంబ

కొరవడిన ఐక్యత

మానవ సంస్కృతికి కట్టుబొట్టే కీలకం. మనిషికి వస్ర్తాలందించే నేతన్నలు చేతిలో పనిలేక పస్తులుండి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసు కున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేతన్నల ఆత్మహత్యలను నివారించి వారికి ఉపాధి కల్పించే మార్గాన్ని చూపించి ఆకలి చావుల నుంచి రక్షించిం ది. బతుకమ్మ చీరల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇంతేకా కుండా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టిస్తు న్న ది. దీంతోపాటు వారానికి ఒక్కసారి నేతన్న నేసిన బట్టలను తొడుగాలని ప్రభుత్వం ప్రచారం చేసింది. కేటీఆర్ ఇప్పటికీ వారానికి ఒక్కరోజు నేసిన బట్టలనే ధరిస్తున్నారు. దీంతో నేత పనివారికి చేతినిండా పని కల్పించబ డుతున్నది. దీంతో గతంలో మాదిరిగా గాక, రాష్ట్రంలో ఇప్పుడు నేతన్న లు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ పద్మశాలీల్లో ఐకత్య కొరవడింది. దీం తో పద్మశాలీల అభివృద్ధికి ఆటంకాలు కలిగే అవకాశాలున్నాయి. ప్రభు త్వ ప్రోత్సాహకాలు అర్హులైన పేద పద్మశాలి కులస్తులు, నేతపనిలో ఉన్న వారు పొందేలా చర్యలు తీసుకోవాలి. కుల పెద్దలు, నాయకులు ఐకత్యతో ముందుకుపోవాలి. కుల సమస్యలను తీర్చేందుకు కలిసిపోరాడాలి. అప్పు డే నేతన్న సమస్యలకు పరిష్కారం చూపినవారమవుతాం. చేనేత పనివా రంతా కలిసికట్టుగా ఉండి ఐక్యతతో అభివృద్ధిబాటలోనడువాలి.
- బైరి జనార్దన్ పద్మశాలి, ప్రగతినగర్, హైదరాబాద్

159
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles