చర్యలు అత్యవసరం

Fri,May 17, 2019 01:06 AM

ఎండ తీవ్రతకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వడదెబ్బతో మరణాలు సంభవించాయి. దినసరి వ్యాపకాలు, పనుల నిమిత్తం ఇంటినుంచి బయలుదేరిన సామాన్యులు ఎక్కువగా వడదెబ్బకు బలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బ నుంచి సంరక్షించుకునేందుకు బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, నగరాల్లో కూడళ్లలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు ఓఆర్‌ఎస్ పాకెట్లను ఉచితం గా ప్రజలకు సరఫరా చేయాలి. వడదెబ్బ నుంచి రక్షణ పొందే చర్యలను విరివిగా ప్రచార సాధనాల్లో ప్రచారం చేయాలి. సులభ ఉపశమన మార్గాలను సూచించా లి. అట్లాగే ప్రజలు అవసరమైతే తప్పా ఎండకు తిరుగకుంటే మేలు. ఒకవేళ వెళ్లా ల్సి వస్తే తగిన సూచనలు పాటించాలి.
- ఏడు కొండలు, రామగిరి, నల్లగొండ

అక్రమార్కులకు కళ్లెం

ధర్మగంటకార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొనసాగిన అవినీతి పుట్ట పగిలింది. పలుకుబడి ఉన్నవారు తన ఆర్థిక బలంతో అధికారులను నయాన, బయాన లొంగదీసుకొని విలువైన భూములను వివాదాల్లోకి నెట్టి తమ పబ్బం గడుపుకున్నారు. వీరి అధికార, ధన బలం ముందు సామాన్యులది అరణ్యరోదనే అయ్యింది. కోర్టులు, వివాదాల్లో పేదలు అక్రమార్కులతో నెగ్గలేక భూములు కోల్పోయిన సందర్భాలు అనేకం వెలుగు చూస్తున్న తీరు రెవెన్యూ మాయాజాలానికి ప్రతీకగా నిలుస్తున్నది. సమస్త రంగాల్లో పారదర్శకతను పాదుకొల్పేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేస్తు న్న కృషి అభినందనీయం. పేదలకు అండగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలతోనే ప్రజాసంక్షేమ పాలనపై విశ్వాసం ఏర్పడుతుంది. ఇలాగే మరిన్ని పాలనావ్యవస్థలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్న ది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉన్నది. అవినీతిరహిత ప్రజా పాలనను ఆచరణలో నిజం చేయాల్సిన అత్యవసరం అందరిది. ఆ దిశగా మనందరం అడుగులు వేస్తే త్వరలోనే మన రాష్ట్రం అవినీతిరహిత తెలం గాణగా రూపుదిద్దుకోవడం ఖాయం.
- బత్తిని లక్ష్మయ్య, హాలియా, మిర్యాలగూడ

345
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles