ఎన్నికల సమీక్ష

Thu,May 16, 2019 01:22 AM

సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో చివరి విడుత పోలింగ్‌కు ప్రచారఘట్టం రేపటితో ముగియనున్న ది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నిర్ణీత వ్యవధిలో ఎన్నికలను సజావుగా నిర్వహించుకోవ డం గర్వపడవలసిన విషయమే. కానీ ప్రజలు అత్యుత్సాహంగా పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియ ను నిర్వహిస్తున్న తీరును విధానకర్తలు, ఎన్నికల కమిషన్ ఒకసారి సమీక్షించుకోవడం అవస రం. ఇంత సుదీర్ఘ ప్రక్రియ మూలంగా ప్రజలకు క్రమంగా ఆసక్తి సన్నగిల్లదా? గత నెల 11వ తేదీన తీర్పునిచ్చిన ఓటర్లు ఫలితాల కోసం ఈ నెల 23వ తేదీ వరకు ఎదురుచూడాలా? ఏడు విడుతల పోలింగ్ గల యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల ఓటర్లది మరింత బాధ. కనీసం నెలరోజుల ముందునుంచి ప్రచార హోరును భరించాలె. బీహార్‌లో నలభై స్థానాలకు ఒక్కో విడుతలో నాలుగు, ఐదు, ఎనిమిదేసి స్థానాల వంతున పోలింగ్ జరుపుతూ పోతే దాదాపు రెం డు నెలలకు పైగా ప్రచార హోరుతో ప్రజలపై ఎంత ఒత్తిడి ఉంటుంది? దేశమంతా లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సుదీర్ఘ ప్రక్రియ మూలంగా ప్రజలకు ఫలితాల పట్ల ఉత్కంఠ, అనురక్తి నశించిపోతున్నది. ఎన్నికల విధానమే అపహాస్యమైపోతున్నది. దీనికితోడు ఎన్నికల నియమావళి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగని రాష్ర్టాల్లో కూడా ఏ విధాన నిర్ణయమూ తీసుకోలేని దుస్థితి. అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించడం వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ నాయకత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేని నైతిక సందిగ్ధతను ఎదుర్కొంటున్నది. ఆర్థికాభివృద్ధి క్షీణించిందని వార్తలు వస్తున్నా, పాలకులు పట్టించుకోలేకపోతున్నారు.

రాజకీయపక్షాలు ఒకప్పుడు తమ విధానాలు ప్రజలకు వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చేవి. కానీ ఇటీవలికాలంలో సూక్ష్మస్థాయిలో సామాజికవర్గాలను కూడగట్టడమనే కొత్త పోకడ మొదలైంది. భారీ ఎత్తున ధనాన్ని కుమ్మరించి ఆయా ప్రాంతాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తున్నారు. ఇట్లా నాలుగైదు స్థానాల లెక్కన పోలింగ్ జరిగినప్పుడు అంగబలం, అర్ధబలం ఉన్న రాజకీయపక్షానిది పైచేయిగా ఉంటుంది. రాజకీయపక్షాల ప్రచారం ఒకప్పటి మాదిరిగా సంస్కారవంతంగా ఉండటం లేదు.


ఇంత పెద్ద దేశంలో వివిధ స్థాయిల్లో పాలనావ్యవస్థను ఇంత సుదీర్ఘకాలం స్తంభింపజేయడం సబబు కాదు. రాజకీయపక్షాలు ఒకప్పుడు తమ విధానాలు ప్రజలకు వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చేవి. కానీ ఇటీవలికాలంలో సూక్ష్మస్థాయిలో సామాజికవర్గాలను కూడగట్టడమనే కొత్త పోకడ మొదలైంది. భారీ ఎత్తున ధనాన్ని కుమ్మరించి ఆయా ప్రాంతాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తున్నారు. ఇట్లా నాలుగైదు స్థానాల లెక్కన పోలిం గ్ జరిగినప్పుడు అంగబలం, అర్ధబలం ఉన్న రాజకీయపక్షానిది పైచేయిగా ఉంటుంది. రాజ కీయపక్షాల ప్రచారం ఒకప్పటి మాదిరిగా సం స్కారవంతంగా ఉండటం లేదు. రాజకీయ సం స్కృతిలో వచ్చిన మార్పు ఇందుకు కొంత కారణమైతే, ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటం మరో కారణం. తమ విధానాలను ప్రజలకు చెప్పడం, కార్యకర్తలను ఉత్సాహపరుచడం ఎంతకాలమని సాగించాలె? అందుకే యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో బీజేపీ, ప్రతిపక్ష నేతలకు మధ్య వేడి రగులుతూ దిగజారిపోయి తిట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ గూండాలే అనేది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన తాజా విమర్శ! కార్యకర్తల మధ్య గొడవలతో ఊళ్ళు రణరంగాలను తలపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల పశ్చిమబెంగాల్‌లో ప్రచా ర కార్యక్రమాన్ని ఒకరోజు తగ్గించవలసి వచ్చింది. కనీసం ఉన్నత స్థానాలలో ఉన్నవారు కూడా నిబ్బరం పాటించడం లేదు. దేశ ప్రధాని, అధికార పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానా ల్లో ఉన్నవారు కూడా సంయమనం పాటించకపోతే ఇక కార్యకర్తలను తప్పు పట్టేదేమున్నది! ఒకప్పుడు రాజకీయ ప్రచారం ఎంత హుందాగా సాగేది! ప్రతిపక్షాల నుంచి అత్యంత ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని ఇందిరాగాంధీ.

ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా హద్దు దాటకపోయేవి. ఇందిరాగాంధీ ఏనాడూ ఏ ప్రతిపక్ష నేతను పేరు పెట్టి విమర్శించలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా బజారుకీడుస్తున్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఎంతవరకు ఈ దిగజారుడు సంస్కృతిని కాపాడగలుగుతాయి? రాజకీయపక్షాల నుంచే మార్పు ప్రారంభం కావాలె. ఇందుకు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారిదే బాధ్యత. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించడం కూడా ప్రధానాంశమే. ఈ సారి రాజకీయపక్షాలకు పారిశ్రామిక సంస్థలు నిధులు ఇచ్చే విషయం చర్చకు వచ్చింది. మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను, ప్రజా ప్రాతినిథ్యం మొదలైన చట్టాలను మార్చి ఎన్నికల నిధులు ఇవ్వడంలో పారదర్శకత లేకుం డా చేయడం తీవ్ర అభ్యంతరాలకు దారితీసింది. ఏ పార్టీకి ఏ వ్యాపారసంస్థ ఎంత మొత్తం నిధులు ఇస్తున్నదో ప్రజలకు తెలువకపోవడం ఆక్షేపణీయం. పైగా నష్టాలతో నడుస్తున్న వ్యాపార సంస్థలు కూడా రాజకీయపక్షాలకు నిధులు ఇచ్చేవిధంగా చట్టాలను మార్చడం ఆశ్చర్యకరం. ఇప్పటికే రాజకీయాల్లో ధనం పాత్ర పెరిగిపోయి, నైతికత తగ్గిపోయింది. కొత్త నిధుల విధానం వల్ల రాజకీయాలు మరింత పతనమవుతాయనడంలో సందేహం లేదు. ఏ పార్టీ ఏ సంస్థ నుంచి ఎంత సొమ్ము తీసుకున్నదో సీల్డ్ కవర్‌లో పెట్టి సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాబో యే రోజుల్లో ఈ అంశంపై మరింత చర్చ జరిపి పారదర్శకత నెలకొల్పడం అవసరం. ఎన్నికల పట్ల తద్వారా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చేయడమే అందరి బాధ్యత. ఇందుకోసం రాజకీయపక్షాలు తమ బాధ్యతను విస్మరించకూడదు.

104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles