జంక్‌ఫుడ్‌తో పిల్లలకు అనారోగ్యం

Thu,May 16, 2019 01:19 AM

ఇటీవల ఆలుగడ్డలు పండించే రైతులపై కేసులు పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీం తో కేసులను ఉపసంహరించుకుంటామని లేస్ చిప్స్ తయారీదారులైన పెప్సికో కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంక్‌పుడ్‌పై చర్చలు జరుగుతున్నాయి. 1990వ దశకంలో మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత బహుళజాతి కంపెనీలు ప్రవేశించి ప్రజల ఆహారపుటలవాట్లతో పాటు జీవనవిధానాన్ని కూడా మార్చివేశాయి. పట్టణ ప్రజలు, యువత ఫాస్ట్‌ఫుడ్‌కు అల వాటు పడ్డారు. క్రమంగా ఈ సంస్కృతి పల్లెటూర్లకు కూడా వ్యాపించింది. ఇందులో ప్రధానంగా జంక్‌ఫుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఈ ఆహారంలో ఎక్కువ శాతం కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోష క పదార్థాలుండవు. మనకు కావాలసిన పీచు పదార్థాలు లభించవు. చిప్స్, కుర్‌కురే లాంటివాటిని పిల్లలు ఎక్కువ గా తీసుకోవడం వల్ల ఒబేసిటీ సమస్య తలెత్తుతుంది. స్థూలకాయం వల్ల పిల్లలో చిన్నతనంలోనే గుండె జబ్బు లు వస్తున్నాయి. 2008లో స్క్రిప్స్ పరిశోధన సంస్థ చేసి న అధ్యయనం ప్రకారం కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఎంత ప్రమాదమో, దాదాపు అంతే స్థాయిలో జంక్‌ఫుడ్ కూడా చూపిస్తుందని తెలిపింది.

పిజ్జాలు, బర్గర్‌లు, సమోసాలు, నూడుల్స్ వంటివాటిని ఎక్కువగా తీసుకున్నవారు త్వరగా అలిసిపోతారని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. జీర్ణవ్యవస్థ కూడా సకమ్రంగా పనిచేయక, హార్మోన్ల వ్యవస్థ దెబ్బతిని, డిప్రెషన్‌కు గురవుతారని తెలియజేస్తున్నారు. ఒకసారి పిల్లలు జంక్‌ఫుడ్‌కు అలవాటైతే త్వరగా మానలేరు. మేరీ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం పిల్లల మానసిక ఆరోగ్యానికి ఒమేగా 3ఎస్ చాలా కీలకమని, ఈ జంక్‌ఫుడ్ తీసుకుంటే ఇది లోపిస్తుందని, తద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలను చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. జామ, సపోటా, పుచ్చ వంటి పండ్లను పిల్లలకు ఆహారంగా అం దించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆహారపుటలవాట్లు మార్చుకుంటే పిల్లలు కూడా జంక్‌ఫుడ్‌కు దూరం గా ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలి.
- యం.రాంప్రదీప్

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles