బెట్టింగ్‌ను అరికడుదాం..

Wed,May 15, 2019 01:08 AM

బెట్టింగ్ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రలో సంక్రాంతి పండుగ వేళలో ఆంధ్రప్రదేశ్‌లో ఆడే కోడిపందేలు. కాలక్రమేణా ఎన్నోమార్పులు జరిగాయి. తర్వాత పట్టణాల్లో వివిధ ఆటల్లో పందెం కట్టేవారు. ఈ బెట్టింగ్‌లు నేడు కుగ్రామానికి కూడా చేరుకొని సాధారణ మానవునికి చరవాణి రూపంలో అరచేతిలోకి వచ్చాయి. స్థానిక ఎలక్షన్లు మొదలుకొని పార్లమెంటు ఎన్నికల వరకు బెట్టింగులు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో టీ-20 ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయు ళ్లకు పండుగలా మారాయి. ఇప్పుడు ఐపీఎల్ ముగియ డంతో.. దేశ ప్రధాని ఎవరు? ఏ సెగ్మెంట్‌లో ఎవరు గెలుస్తారు ? ఎవరి ఎత్తులు పైఎత్తులేంటి? అన్న అంశాల మీద విశ్లేషణలు జరుగుతూ జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నా యి. ఈ నెల 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దేశవ్యా ప్తంగా ఒకెత్తయితే, ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్లది మరొ క ఎత్తు, అంతటితో ముగిసేదిలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాబో యే ముఖ్యమంత్రి ఎవరు? జగన్‌కు ఎన్ని సీట్లు వస్తాయి? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఇలా ప్రతి చిన్నదానికి బెట్టింగ్‌లు జరుగుతూనే ఉంటా యి. ఒకటిపోతే మరొక్కటి, బెట్టింగ్‌రాయుళ్లు విరామం లేకుండా గడుపుతున్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు.

బెట్టింగ్ అంటే చట్టరీత్యా నేరమన్నది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో జరిగే ఈ తంతు కాస్తా పల్లెల్లోకి వచ్చిపడింది. చిన్నచిన్న నగరాల్లో ఏజెంట్లుగా నిలిచి లక్షలు, కోట్లలో బెట్టింగ్స్ జరుపుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులకు సైతం అడ్డాలు దొరుక డం లేదంటే ఆశ్చర్యం కాదు. ఈ మధ్య జరిగిన వివిధ ఎన్నికల్లో, క్రికెట్ క్రీడలో చాలా బెట్టింగ్‌లు జరిగాయి. కానీ ఒకరి మొహం ఒకరికి తెలియదు, అంతా ఫోన్ సం భాషణల్లో, బ్యాంక్ అకౌంట్లతో జరిగాయి. బెట్టింగ్ రాయుళ్లు ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడకూడదు. క్షణాల్లో డబ్బు సంపాదించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ దానివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందులో లాభం పొందినవారు సంబురాల్లో మునిగితేలుతుంటే, నష్టపోయినవారి కుటుంబాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బెట్టిం గ్‌ను అరికట్టేందుకు తమవంతుగా కృషిచేద్దాం.
- డాక్టర్ పోలం సైదులు

164
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles