కాలజ్ఞాన కర్త

Mon,May 13, 2019 11:38 PM

brahamam
భారతజాతి గర్వించదగ్గర సంఘ సంస్కర్త వీరబ్ర హ్మేంద్ర స్వామి. ఆయన కథ తెలియకపోయినా బ్రహ్మం గారి పేరు వినగానే కాలజ్ఞాన తత్త్వాలు గుర్తుకొస్తాయి. రాగ ల కాలంలో కాగల విషయాలు ఆ తత్వాలలో గోచరిస్తా యి. చాలామందికి ఆయన కాలజ్ఞానం తెలుసు. నేడు ఎక్కడేం వింత జరిగినా బ్రహ్మంగారు నాడే చెప్పారని ఆయన కాలజ్ఞానాన్ని మనం మననం చేసుకుం టాం. 17వ శతాబ్దంలోనే కాలజ్ఞానం ద్వారా నేటి భవిష్యత్తును నిర్ణయించి చెప్పారు. భారతదేశంలో నవ చైతన్యానికి మూల పురుషుడై, తమన మాటలు చేతల చేత తన జీవితకాలంలోనే స్వయంగా అనేక సామాజిక సంస్కరణోద్యమాలు చేపట్టా రు.

మహ్మదీయుడగు సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించి కన్నబిడ్డల కంటే ఆప్యాయంగా చూశారు. పం చముడగు కక్కయ్యకు, రెడ్డికుల స్త్రీ అయిన అచ్చ మ్మకు, బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు జ్ఞానోపదేశం చేశారు. విద్యా విహీనులైన సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో కాళి కాంబ హంస కాళికాంబ కాళికాంబ, వీర కాళికాం బ మొదలైన మకుటాలతో రాసిన శత కాలు, తత్త్వ గీతాలు సిద్ధ బోధ, కాళీమకుట కందాలు ఆయనను గొప్ప కవిగా కూడా మనకు పరిచయం చేస్తాయి. ఆయన కులాలకు, మతాలకు అతీతమైన సర్వ సమానత్వాన్ని సాధించే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయబూనారు. కుల కక్షల తో కుళ్లిన సంఘాన్ని కూకటివేళ్లతో పెకిలించడం మతాల మాలిన్యాన్ని ప్రక్షాళన చేయబడం బ్రహ్మం ప్రధాన లక్ష్యం. ఈ సామాన్య ప్రవస్తక అనేక తరాలను ప్రభావి తుల్ని చేసిన మానవతావాది.

ఏ జాషువో పలికినట్లు బ్రహ్మంగారు కాలజ్ఞాన తత్వా ల్లో చెప్పిన భవిష్యత్ కథనం అందరినీ అద్భుతపరి చేదే. బ్రహ్మంగారి పద్యాల్లోనే తేలిక శైలిని బట్టి ఆయన విద్వత్తును అంచనా వేయలేం. వేద వేదాంగ పురాణ కావ్యాలను లోతుగా అధ్య యనం చేసిన సకల విద్యా మర్మజ్ఞుడత డు. కడప మండలంలోని కందిమల్లయ్య పల్లిలో రాజయోగిగా స్థిరపడి లోకోద్ధరణ దీక్షతో, తత్త్వ ప్రబోధం చేసి, కాలజ్ఞాన ప్రవ క్తగా ప్రసిద్ధుడై చివరికి 1693లో జీవ సమాధి నిష్ఠుడయ్యారు. ఆయన 326వ ఆరాధన మహో త్సవం నేడు జరుపుకోవడం సంతోషకరమైన విషయం. విశ్వజనీనమైనది. మద్విరాట్ పోతలూరి వీరబ్ర హ్మేంద్ర స్వామి వారి వేదాంత తత్త్వ ప్రబోధం, దీనిని బహు ముఖ్యులుగా బహుళ ప్రచారం చేయాలి.
- కట్టా సత్యనారాయణచారి ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ స్వర్ణకార సంఘం

173
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles