సత్యం వధ, ధర్మం చెర

Sat,May 11, 2019 12:42 AM

మోదీజీ హయాంలో పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జైషే మహ్మద్ (మసూద్ అజహర్) మతోన్మాద టెర్రరిస్టులు భయంకరమైన దాడి జరిపారు. పఠాన్‌కోట్‌లో దాడి జరిగిన స్థలం పరిశీలనకు అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్ అంగీకరించలేదు. ఏ దేశభక్తుడు అంగీకరించడు.మోదీజీ అంగీకరించారు. పాక్ ఐఎస్‌ఐ అధికారులున్న బృందం పఠాన్‌కోట్ వచ్చి పరిశీలిం చి వెళ్ళింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణకు అవసరమైన, అనివార్యమైన ఏపీ విభజన సక్రమంగా జరుగలేదని మోదీజీ అనడం, చంద్రబాబుకు ఉల్లాసం కలిగించడం సత్యం వధ, ధర్మం చెర!. తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి ఉద్బోధించింది సత్యం వద, ధర్మం చర. సత్యం పలికి, ధర్మమార్గంలో నడువాలన్నది ఈ ఉద్బోధ తాత్పర్యం.

Prabhakar-Rao
యాదగిరి తండ్రి రంగయ్య అచ్చమైన తెలంగాణ పల్లెటూరి మనిషి. ఆయన కీసలో (జేబులో) ఎప్పుడూ ఒక బీడిక ట్ట ఉంటది. 1969 ఉద్యమం రోజుల్లో ఓ సభలో మర్రి చెన్నారెడ్డి ఆంధ్ర రైతులు చుట్టలు తాగుతారు, ఆంధ్రపత్రిక చదువుతారు అని అన్నారు. ఇప్పటికీ రంగయ్య దగ్గర ఉర్దూ జంత్రి ఒకటి ఉంటది. రంగయ్య తెలుగు సామెతల గల్లా. గిల్లితే చాలు ఆయన గల్లా నించి లెక్కలేనన్ని సామెతలు గొల్లుమంటాయి. రంగయ్య సామెతలు కొన్నిటిని విన్నప్పుడు ఒళ్లు జలదరిస్తది. పూర్వపు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన తెలుగు సామెతలు పుస్తకంలో రంగ య్య సామెతలు చాలా చేరినయ్. సామెతలు లేకుండా రంగయ్య మాట్లాడడు. జాతీయ రాజకీయాల, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల తూతూ మైమై ధోరణి గురించి మాట్లాడుతున్నప్పుడు రంగయ్య గొంగళిలో తింటూ ఎంట్రుకలు ఏరినట్లున్నది అని అన్నాడు. ఇప్పటి జాతీ య రాజకీయ పరిస్థితికి లేక దుస్థితికి అతికినట్లున్నది రంగయ్య సామెత. ఎన్నికల రాజకీయ ప్రసంగాల్లో దుమ్మెత్తి పోత మరీ ఘోరంగా ఉంటున్నది. బలి, వలి, దుర్యోధన, దుశ్శాసన, శ్రీకృష్ణ పాత్రల ప్రస్తావన కూడా వస్తున్నది. నేతలు పరస్పరం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడంలో, ఇంకా సూటిగా చెప్పాలంటే తిట్టుకోవడంలో ఒలింపిక్ స్థాయిలో పోటీ పడుతున్నారు. నాయకులు తమ పార్టీల విధానాలను, కార్యక్రమాలను, ఎన్నికల ప్రణాళికలను, ఇంతవరకు ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో తాము సాధించిన విజయాలను సాధించవలసిన విజయాల ను, వైఫల్యాలను ప్రజలముందు వివరించడానికి బదులు తిట్లతో, ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో వ్యాఖ్య లు, విమర్శల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పి అందరికీ ఆదర్శప్రా యుడు కావలసిన ప్రధాని మోదీజీ అన్నివైపుల నుంచి దాడులకు గురవుతున్నాడు.

మోదీజీ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో, వ్యాఖ్యల్లో మోడ ల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను యథేచ్ఛగా, పుంఖానుపుంఖంగా ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఏది వద్దంటున్నదో మోదీజీ అదే మాట్లాడుతున్నారు. మత ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడ కూడదని ఎన్నికల కోడ్ ఒక ఆంక్ష పెట్టింది; ఒక లక్ష్మణ రేఖ గీసింది; మోదీజీ, ఆయన అనుచరులు, సహచరులు (నిజానికి సహచరులు ఎవ రూ లేరు, అందరు అయ్యా అంటూ తల వంచి వెనుకనడిచే అనుచరులే !), పాలకపక్షం ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర నేతలు అం దరూ విశృంఖలంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆంక్షలను, లక్ష్మణ రేఖను ఎంతమాత్రం ఖాతరు చేయకుండా ఉల్లంఘిస్తున్నారు; ఉల్లంఘించడం లేదని ఈసీ ఎంతో జాప్యం చేసి హడావుడిగా (2019 మే 6 లోపు ఏదో నిర్ణయం చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించడంతో) ఒక తీర్పు ఇచ్చింది. అత్యంత విధేయతతో ఒక ఈసీ కమిషనర్ విభేదించి భిన్నాభిప్రాయం ప్రకటించినప్పటికి. విచిత్రమేమంటే సుప్రీంకోర్టు ఈ హడావుడి తీర్పునకు ఆమోదముద్ర వేసింది. పాపం సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తి గ్రహచారం బాగలేకనో ఏమో గాని చిక్కుల్లో ఉన్నారు. భారత సైనికుల విజయాలను తమ విజయాలుగా మోదీజీ, ఆయన అనుచరులు ప్రచారం చేయరాదన్నది ఈసీ పెట్టిన మరో ఆంక్ష. మోదీజీ, ఆయన అనుచరులు ఈ ఆంక్షను పదేపదే తుంగలో తొక్కుతున్నారు. అంతేకాదు భారత సైన్యం మోదీ సైన్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి పెద్దలు అంటున్నారు. మోదీజీ మాటలేవీ సీఈసీకి అభ్యంతరకరంగా కన్పించడం లేదు. యుద్ధం గెలువడానికి ఏ ఆయుధమైనా పనికి వస్తుందన్నది బహుశా మోదీజీ రణతంత్రమై ఉంటుంది. దాదాపుగా అందరూ మరిచిపోతున్న నాటి యువ ప్రధాని రాజీవ్‌గాంధీ హఠాత్తుగా మూడు గంటల నిద్రలో (చూడుడు, చదువుడు మోదీజీతో ఇటీవల హిందీ సినీ నటుడు అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూ) మోదీజీకి జ్ఞాపకం వచ్చాడు.

తనను మాటిమాటికి, ఊరూరా, ప్రతి సభలో చౌకీదార్ చోర్‌హై అని ఎత్తిపొడుస్తున్న రాహుల్ గాంధీకి జవాబుగా, ప్రతి అస్త్రంగా మీ తండ్రి రాజీవ్‌గాంధీ భ్రష్టాచారి నంబర్‌వన్ అని మోదీజీ అన్నాడు. ఇవాళ్టి ఈ రచ్చలోకి, రొచ్చులోకి అప్పటి యువ నేత రాజీవ్‌గాంధీని ఈడ్చినందుకు సభ్యతగలవారు కొందరు బాధపడ్డారు. 28 ఏండ్ల కిం దట, భగవద్రామానుజుల స్వస్థలం శ్రీ పెరుంబుదూర్‌లో, ఒక మహిళా సూసైడ్ బాంబర్ థానును ప్రయోగించి రాజీవ్‌గాంధీని హతమార్చడం తన పొరపాటని తమిళ్ ఈలమ్ టైగర్స్ అధినేత ప్రభాకరన్ తర్వాత తీరికగా బాధపడ్డాడని అంటారు. ఈరోజు తాను, తన మందీ మార్బలం తరచుగా, విరివిగా ప్రయోగిస్తున్న ట్విట్టర్ తదితర ఐ.టీ. కమ్యూనికేషన్ సాధనాలన్నిటికీ ఈ దేశంలో పితామహుడు రాజీవ్‌గాంధీ అన్న సంగతి బహుశా ప్రధాని మోదీజీకి తెలియదు. నేపాల్, భూటాన్ ఒకటి కాదని, జాతిపిత గాంధీజీ పేరు మోహన్‌దాస్ అని మోదీజీకి తెలియదు. బోఫో ర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ నిర్దోషి అని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి, ఆ తీర్పుపై తమ బీజేపీ (వాజపేయి) ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయని సంగతి బహుశా మోదీజీకి తెలియదేమో! ప్రధానిగా తాను విదేశీ పర్యటనలు చేసిన తర్వాతనే విదేశాల్లో భారతదేశం సంగతి తెలిసిందని మోదీజీ అంటారు. 35 ఏండ్ల కిందట యువనేతగా, అత్యం త క్లిష్ట పరిస్థితిలో ప్రధాని పదవి బాధ్యతను స్వీకరించిన రాజీవ్‌గాంధీ అమెరికా వెళ్లినప్పుడు అమెరికా నేషనల్ ప్రెస్‌క్లబ్ రాజీవ్‌తో గోష్టి జరిపింది.

ఆ గోష్టిలో రాజీవ్‌గాంధీ ఏ మాత్రం తొణకకుండా ఇచ్చిన సమాధానాలు ప్రపంచానికి ఆశ్చర్యం కల్గించాయి. వందేండ్ల కిందట షికాగో నగరంలో వివేకానందుని అద్భుత, మహత్తర ప్రసంగం తర్వాత అమెరికా హృదయాన్ని సంచలనపరచిన, స్పందన పుట్టించిన సంఘటన రాజీవ్ పత్రికా గోష్టి. రాజీవ్ తర్వాత మోదీ సహా ఇంకే భారత ప్రధాని కి అమెరికా నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడే అవకాశం లభించలేదు. బోఫో ర్స్ గన్ కొనుగోలు వ్యవహారంలో ఏదో కుంభకోణం జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తపరిచింది అప్పటి ప్రతిపక్షాలు కాదు. రాజీవ్ మంత్రివర్గంలో ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన విశ్వనాథ ప్రతాప్‌సింగ్. ఆయన తన ఉన్నత పదవికి రాజీనామా ఇచ్చి రాజీవ్‌మంత్రివర్గం నుంచి బయటికివచ్చారు. తర్వాత ప్రధాని అయి, ప్రధాని పదవి కి తాను అర్హుణ్ణి కాదని వి.పి.సింగ్ ప్రకటించారు. మోదీజీ హయాంలో పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జైషే మహ్మద్ (మసూద్ అజహర్) మతోన్మాద టెర్రరిస్టులు భయంకరమైన దాడి జరిపారు. పఠాన్‌కోట్‌లో దాడి జరిగిన స్థలం పరిశీలనకు అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారిక ర్ అంగీకరించలేదు. ఏ దేశభక్తుడు అంగీకరించడు. మోదీజీ అంగీకరించారు. పాక్ ఐఎస్‌ఐ అధికారులున్న బృందం పఠాన్‌కోట్ వచ్చి పరిశీలిం చి వెళ్ళింది. నెహ్రూ పరిపాలనలో భారీ ముంద్రా కుంభకోణాన్ని బట్టబయలు చేసింది కాంగ్రెస్ ప్రముఖ నేత, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాం ధీ. కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుం ది. 1962లో చైనా దురాక్రమణ అనంతరం రక్షణమంత్రి వి.కె.కృష్ణమీనన్‌కు, తర్వాత చమురు మంత్రి, అభ్యుదయవాది, వామపక్షభావ ప్రముఖుడు కె.డి.మాలవీయకు, ఉక్కు మంత్రి బిజయానంద పట్నాయక్‌కు (ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి) ఉద్వాసన జరిపించింది, నీలం సంజీవరెడ్డిని ఓడించింది అంతర్గత కాంగ్రెస్ ప్రతిపక్షమే. ఈ ఛిద్రా లు కాంగ్రెస్ పార్టీలో తిలక్-గోఖలే కాలం నుంచి ఉన్నవే.

మోదీజీ ఉపయోగిస్తున్న చివరి అస్త్రంలో ఏపీ విభజన కూడా చేరడం విచిత్రం. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో, ఎన్నికల సభల్లో మాట్లాడుతున్నప్పుడు మోదీజీ ఏపీ విభజన గురించి ప్రస్తావించలేదు. ఎన్నికల చివరి దశలో, ఎక్కడో బీహార్ మారుమూల ఎన్నికల సభలో ప్రసంగిస్తూ మోదీ జీ ఏపీ విభజన సరిగ్గా జరుగలేదని చెప్పి మాజీ మిత్రుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవించి ఆయనకు సం తోషం కలిగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణను వ్యతిరేకించే వారందరూ చంద్రబాబుకు ఇష్టులే, మిత్రులే. ఏపీ విభజనలో హైదరాబాద్ నగరం తమకు దక్కకుండా, తెలంగాణ రాష్ర్టానికి లభించి తమకు అన్యా యం జరిగిందంటారు చంద్రబాబు. తెలంగాణ ప్రాంతంలో భాగమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రజల అమూల్య ఆస్తి హైదరాబాద్ తమకు దక్కాలన్న చంద్రబాబు ఆలోచన దురాలోచన. రంగయ్య మాట ల్లో చెప్పాలంటే చింత చచ్చినా పులుపు చావదు. అరువై ఏండ్ల పోరా టం తర్వాత, విశేషించి కేసీఆర్ ఎంతకైనా తెగించి తెచ్చుడో చచ్చుడో అన్న గాంధేయ నినాదంతో పద్నాలుగేండ్లు మహత్తర ఉద్యమం నిర్వహించిన పిదప తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అవసరమైన, అనివార్యమైన ఏపీ విభజన సక్రమంగా జరుగలేదని మోదీజీ అనడం, చంద్రబాబుకు ఉల్లాసం కలిగించడం సత్యం వధ, ధర్మం చెర!. తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి ఉద్బోధించింది సత్యం వద, ధర్మం చర. సత్యం పలికి, ధర్మమార్గంలో నడువాలన్నది ఈ ఉద్బో ధ తాత్పర్యం.

సత్యం పలుకడానికి బదులు సత్యాన్ని వధిస్తున్నారు, ధర్మమార్గంలో నడువకుండా ధర్మాన్ని చెరసాల పాలు చేస్తున్నారు. జాతిపిత గాంధీజీ మహాత్ముడు కాకముందే, బాల్యంనుంచే, లండన్‌లో ఉన్న త విద్యార్జనకు వెళ్లినప్పుడు సత్యం కోసం ఆరాటపడ్డారు. సత్యంతో ఆయన జరిపిన ప్రయోగాల గాథ ఆయన దాదాపు నూరేండ్ల కిందట నవజీవన్ పత్రికలో, గుజరాతీలో రాసిన ఆత్మకథ. ఆయన అన్నారు-I simply want to tell the story of my numerous exper -iments with truth... But they are spiritual or rat her moral, for the essence of religion is morality.. జాతీయ ఎన్నికల రాజకీయాల్లో ప్రస్తుతం దేశ ప్రజలకు కన్పిస్తున్నది అబద్ధాలతో అఖండ ప్రయోగం!

197
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles