ఎన్నికల వేళ ఏమిటీ ‘యతి’

Fri,May 10, 2019 01:06 AM

yeti
యతి ఉన్నదా? ఉంటే అది వానరమా?(హనుమంతుడు) ఎలుగా? (జాంబవంతుడా).ఈ కాల్పనిక జీవి యెతఏందో..! ఇంకో వెయ్యి ఏండ్లకు కూడా తెగని ముచ్చటే. కానీ..! దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ మంచు కొండల్లోంచి యతి ముంచుకు రావటం ఉత్తరాది రాష్ర్టాల్లో ఓట్లను మూటగట్టుకునే బలమైన హిందుత్వ ఎజెండా దాగుంది. మత ప్రమేయంలోని లౌకిక దేశంలోకి తాజాగా కాల్పనిక జీవిని వదిలి ఓట్లు మూట గట్టుకునేందుకు మతతత్వపార్టీలు వదంతులు వదులుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ గుట్టు విప్పి జనం ముందుంచాలి. దేశంలో, రాష్ర్టాల్లో సాధారణ ఎన్నికలొచ్చినా ..ప్రజల్లో సానుభూతి పవనాలు తగ్గినట్లు అనిపించినా..! ప్రధాని నరేంద్ర మోదీపై హత్యాయత్నం కుట్రలలో... హిందుత్వవాదానికి బలాన్నిచ్చే వింత వింత సంఘటన లో బయటికి వస్తూనే ఉంటాయి. రాజ్యంలోని వేగులు, బలగాలు కష్టపడి ఇటువంటివి పసిగట్టి అత్యవసరంగా బయటపెడుతూనే ఉంటా యి. రాజ్యాధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ప్రజలను ఏమా ర్చి, మభ్యపెట్టే కపట రచనలెన్నో జరుగుతూనే ఉంటాయి. యతి అడగు జాడలు కూడా ఇందులో భాగమే. పుల్వామా దాడి ఘటనతో దక్షిణాది రాష్ర్టాల్లో పోలింగ్‌ను నెట్టుకొచ్చిన మోదీ అండ్ టీం, ఉత్తరాది రాష్ర్టాల్లో తన పొలిటికల్ గ్రాఫ్‌ను సుస్థిరం చేసుకోవటానికి వేల ఏండ్లుగా హిందుత్వ భావజాలంతో ముడిపడి ఉన్న ఓ అమూర్త అంశాన్ని తెరమీదికు తెచ్చింది. యతి ఉన్నదా? లేదా అనే మీమాంస 1వ శతాబ్దం నుంచే సా...గుతున్నది. ఇంకో వెయ్యి ఏండ్లు అయినా అది ఒడువదు. అయినా తాజాగా మళ్లీ ఆ యతిపైనే చర్చ మొదలైంది. హిమాలయాల్లో ఒక వింత జీవి అడుగుల వంటి గుర్తుల ఫొటోలను సైన్యం ట్వీట్ చేసింది. వాటిని శాస్త్రీయ పరిశోధన కోసం పంపించామని వెల్లడించింది. ఒక్కో అడుగు మూడడగుల పొడవు, అడుగున్నర వెడల్పు ఉన్నట్టు తెలిపింది. పాదాలు 32/15 అంగుళాలున్నాయి అని చెప్పింది.

పుల్వామా దాడి ఘటనతో దక్షిణాది రాష్ర్టాల్లో పోలింగ్‌ను నెట్టుకొచ్చిన మోదీ అండ్ టీం, ఉత్తరాది రాష్ర్టాల్లో తన పొలిటికల్ గ్రాఫ్‌ను సుస్థిరం చేసుకోవటానికి వేల ఏండ్లుగా హిందుత్వ భావజాలంతో ముడిపడి ఉన్న ఓ అమూర్త అంశాన్ని తెరమీదికు తెచ్చింది.


హిందూ పురాణాల్లో యతి ప్రస్తావన ఉన్నది. యతీంద్రులు అంటే చిరంజీవులు. చావును జయించిన వాళ్లు. హనుమంతుడు, కపాచార్యు డు, అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, పరుశురాముడు, వేదవ్యాసుడు.. మార్కండేయుడు, జాంబవంతుడు, సప్తర్షులుగా చెబుతారు. ఇప్పటికీ హనుమంతుడు హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నారని హైందవుల విశ్వాసం. రామ నామ జపంతో వానర అవతారం హిమసానువుల్లో సంచరిస్తోందని, ఎలుగొడ్డు రూపంలో యతి సంచరిస్తున్నాడని, ఆయనే జాంబవంతుడని అనే ప్రచారం ఇప్పటికీ సజీవమే. కానీ ఎవరూ ఆ యతిని కలిసింది లేదు. ఇదంతా భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశం. అది నిజం అని నమ్మించాలంటే పాదముద్రలే గత్యంతరం. యతి రూపంలో హనుమంతుడు ఇంకా హిమాలయాల్లో శంబ లా అనే ప్రాంతంలో ఉన్నాడని ఇప్పటికీ హిందువులు విశ్వసిస్తున్నారు. తాజాగా 32/15 అంగుళాల పాదముద్రలు ఫొటోలు విడుదల చేయ డం వల్ల ఇటువంటి విశ్వాసానికి బలం చేకూర్చే ప్రయత్నం జరిగింది. ఈ మత విశ్వాసమే ఓట్ల రూపంలోకి మారి గంపగుత్తగా సీట్లు తెచ్చిపెడుతాయి. దేశంలో ఎన్నికలు నడుస్తున్న వేళల సరిగ్గా ఇదే పాచికతో మోదీ బలవంతంగా యతి మాయ ముద్రలను సమాజంలోకి చొప్పించారనే వాదన బలపడుతున్నది. యతి అడుగులను ఫొటో తీశామని, అదో కాదో తేల్చేందుకు సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ కోసం నిపుణుల దగ్గరకు పంపామని ఆర్మీ చెబుతున్నది. ఇక్కడో ముఖ్యవిషయాన్ని గమనించాలి. మనకు తెలిసిన హనుమంతు ని వర్ణం సింధూరం. హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా సింధూరపు రంగులోనే ఉంటాయి. కొన్నిచోట్ల పచ్చగా కానీ ఎరుపు వర్ణంలో కానీ ఉంటాయి.. పచ్చ రంగు అతని సహజ వర్ణమైతే హనుమంతుడు సింధూర వర్ణంలోకి తనను తాను మార్చుకున్నాడు అని చెప్తారు. ఇప్పు డు ఆ వర్ణమే హిందువుల విశ్వాసం అయింది.

ఇప్పటి వరకు జరిగిన శాస్త్రీయ పరిశోధనలు అన్నీ కూడా మనం హనుమంతుడి రూపంగా భావిస్తున్న వానర రూపం కానీ, సింధూరం, పచ్చ ఎరుపు వర్ణాలు కానీ ఏవీ కన్పించలేదని తేల్చారు. సమాజానికి తెలియని ధృవపు ఎలుగుబంట్ల సంచారం హిమాలయాల్లో ఉన్నదని తెలుస్తున్నందున ఇప్పుడు తెరమీదికి వచ్చిన యతి అడగుజాడలు హనుమంతునివా? జాంబవంతునివా తేల్చిచెపితే బాగుండేది.


అయితే రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ రచించిన నేచురల్ హిస్టరీ ఇన్ ది ఫస్ట్ సెంచరీ ఏడీ అనే పుస్తకంలో యతిని వనజీవిగా పేర్కొన్నారు. ఆ జీవి కొన్నిసార్లు నాలుగు కాళ్లపై, మరికొన్ని సార్లు మనిషిలా రెండుకాళ్లపై నడుస్తున్నట్లు చెప్పారు. ఒళ్లంతా నల్లని జుట్టుతో, నీలం రంగు కళ్లు కలిగి, కుక్కలకు ఉండే పళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. 1882లోఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లిన టెక్కర్ బీహెచ్ హోడ్గ్సన్ ప్రకారం.. పొడవాటి నల్లటి జుట్టు కలిగిన ఓ పెద్ద జంతువు వారికి కనిపించిందని చెప్పారు. గ్లేసియర్ ప్రాంతంలో ఓ పెద్ద జంతువును చూసినట్టు 1925లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ సభ్యుడు ఎన్‌ఏ తొంబాజీ చెప్పారు. జస్ట్ 200 నుంచి 300 గజాల దూరం నుంచే దాన్ని ఓ నిమిషం పాటు చూశానని చెప్పుకొచ్చారు. ఉత్తర సిక్కింలో జెమూ గ్లేసియర్ వద్ద యతి అడుగులను చూసినట్టు 1948లో పీటర్‌బెర్న్ అనే పర్వతారోహకుడు చెప్పాడు. 1959లో దాని మలాన్ని సేకరించినట్టు చెప్పాడు. ఆ మలం లో ఇప్పటి వరకూ చూడని ఓ సూక్ష్మజీవిని గుర్తించినట్లు చెప్పాడు. 1960లో సర్ ఎడ్మండ్ హిల్లరీ అనే సైంటిస్ట్ ఖుంజంగ్‌లోని మొనాస్టరీలో దాచిన యతి వెంట్రుకలను సేకరించి సైంటిఫిక్ పరిశోధనలు చేశారు. అవి ఎలుగొడ్డు వెంట్రుకలని తేల్చారు. యతివిగా భావించిన వెంట్రుకల శాంపిళ్లను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ బ్రియాన్ సైకెస్, తన బృందంతో కలిసి పరీక్షించారు. ఆ వెంట్రుకల డీఎన్‌ఏను, ఇతర జంతువుల జన్యువులతో పోల్చి చూశారు. ఆ శాంపిళ్లలో ఒకటి భారత్లోని లడఖ్ నుంచి, మరొకటి భూటాన్ నుంచి సేకరించారు. వాటిలోని జన్యువులు 40,000 ఏండ్ల కిందట ఉనికిలో ఉన్న ధృవపు ఎలుగుబంట్ల జన్యువులను పోలి ఉన్నాయని వారి పరీక్షల్లో వెల్లడైంది.
Solipeta-Ramalingareddy
ఇప్పటివరకు జరిగిన శాస్త్రీయ పరిశోధనలు అన్నీ కూడా మనం హనుమంతుడి రూపంగా భావిస్తున్న వానర రూపం కానీ, సింధూరం, పచ్చ ఎరుపు వర్ణాలు కానీ ఏవీ కన్పించలేదని తేల్చారు. సమాజానికి తెలియని ధృవపు ఎలుగుబంట్ల సంచారం హిమాలయాల్లో ఉన్నదని తెలుస్తున్నందున ఇప్పుడు తెరమీదికి వచ్చిన యతి అడగుజాడలు హనుమంతునివా? జాంబవంతునివా తేల్చిచెపితే బాగుండేది.
(వ్యాసకర్త:సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు )

221
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles