బతుకుదాం.. బతుకనిద్దాం

Fri,May 10, 2019 01:05 AM

నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం దేశంలోని 37 రాజకీయపార్టీల తో సంప్రదింపులు జరిపి రాతపూర్వక మద్దతు కూడగట్టడంలోనైన, చంద్రబాబు పుణ్యమాని వచ్చిన తీవ్రమైన విద్యుత్ కొరతను అధిగమించటంలోనైనా కేసీఆర్‌కు మరె వరూ సాటిరారు. ఆ తర్వాత పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని ప్రాజెక్టులకు అనుమతులు తేవడంలోనైన, స్నేహపూర్వక ఒప్పందాలు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలంబిస్తూ తాగు, సాగు నీటి కష్టాలను తీర్చడంలో సీఎం కేసీఆర్ చూపించిన దౌత్యనీతి, రాజనీతిజ్ఞత మరింత విశేషమైనది, శ్లాఘనీయమైనది. రాష్ట్రంలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కు ఈ వేసవిలో చల్లని వార్తను అందించారు. జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.93 టీఎంసీల డెడ్ స్టోరేజ్ కు చేరింది. దీంతో మిషన్ భగీరథ ద్వారా అందించే తాగు నీటి అవసరాలను తీర్చడం కష్టంగా మారింది. ఇది గమనించిన కేసీఆర్ ఇప్పటికే పొరు గు రాష్ర్టాలతో ఏర్పరుచుకున్న సత్సంబంధాల వల్ల ఒక ఫోన్ కాల్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని ఒప్పించి 2.5 టీఎంసీల నీటిని నారాయణపూర్ నుంచి జూరాలకు తెప్పించి దౌత్య దురంధరుడు అనిపించుకున్నారు. దేశంలో ఎన్నో రాష్ర్టాలు జల వివాదాల పేరుతో ఒకరి మీద ఒకరు నిప్పు లు చెరుగుకోవడం ఇప్పటికీ మనం చూస్తున్నాం, పంజాబ్-హరియానా, కేరళ-తమిళనాడు-కర్ణాటక ఇలా.. ఎన్నో రాష్ర్టాలు నీటి యుద్ధాలతో సతమవుతున్నాయి. అంతెందుకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పు డు అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాలతో తగాదాలు పడిన విషయం మనకు తెలియనిది కాదు.

2017లో తుంగభద్రలో మనకు ఉన్న వాటా నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వమని కర్ణాటక ప్రభుత్వం అడుగగా వెంటనే స్పందించి అంగీకరించారు కేసీఆర్. అగానే మన అవసరానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా వెంటనే ఒప్పుకోవడం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న నానుడిని నిరూపించింది. నీటి యుద్ధాలు చేసుకునే రోజుల నుంచి మంచి ఆదర్శ వాతావరణాన్ని నెలకొల్పిన కేసీఆర్ అందరికీ ఆదర్శప్రాయుడు. రాబోయే రోజుల్లో ఇలాంటి విధానాలతో మన దేశం, రాష్ర్టాలు, మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం.


బాబ్లీ వద్ద మహారాష్ట్ర సర్కారుతో చంద్రబాబు చేసిన హంగామా ఇరురాష్ర్టాల మధ్య విద్వేషాన్నే మిగిల్చా యి. రెండిండ్ల మధ్య ఏదైనా నిర్మించాలంటే ఇద్దరి మధ్య స్నేహపూర్వ క సంప్రదింపులు ఉండాలంటారు. అలాంటిది పక్క రాష్ట్రమైన మహారాష్ట్రతో ఎటువంటి సంప్రదింపులు, ఒప్పందాలు లేకుండానే వేలకోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిన ఘనత ఆంధ్ర పాలకులది. ఈ ఖర్చునంత కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే భావించాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఘాటుగా లేఖ రాసిన విషయం తెలియనిది కాదు. మనోళ్ళు కానీ మన పాలకులు తెలంగాణపై ఎప్పటికప్పుడు దొంగ ప్రేమను చూపించుకుంటూ కృష్ణ బేసిన్ విషయంలో కర్ణాటక రాష్ట్రంతో కూడా పెట్టుకున్న గొడవల వల్ల ప్రజలకు ఎటువంటి లాభం కలుగకపో గా, నీటి ఎద్దడి ఏర్పడి రాష్ర్టానికి కన్నీళ్లను మిగిల్చారు. కర్ణాటకలో నీరు ఉండి కూడా ఒక్క చుక్క దిగువకు తెచ్చుకోలేని పరిస్థితులను తెచ్చారు అప్పటి మన అసమర్థ పాలకులు. జలాలకు సంబంధించిన విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి మనకేంటి అని ఊరుకోవడం లేదా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇరుగు పొరు గు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని, జటిలమైన నీటి సమస్యలను తన మంచి మాటలతో అధిగమించిన ఘనత ఇప్పటి పాలకుడు కేసీఆర్‌ది. ప్రజల తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించటంలో చేప ట్టిన ప్రాజెక్టులు, జరుగుతున్న పనులు చూస్తే అపర భగీరథుడు మన కేసీఆర్ అని చెప్పక తప్పదు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో బతుకుదాం-బతుకనిద్దాం అనే నినాదంతో కేసీఆర్ మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలతో ఎన్నో చర్చలు జరిపి, వారిని ఒప్పించి, మెప్పించి విజేయుడై దేశానికే ఆదర్శంగా నిలిచారు. దానివల్ల రాష్ర్టానికి కలిగిన మేలు వెలకట్టలేనిది.

ఒక్కప్పుడు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో దొరకని మహారాష్ట్ర సహకారం, ఇప్పుడు దండిగా దొరుకుతుండటం దీనికి నిదర్శనం. అదిలా ఉండగా గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో కూడా కేంద్రాన్ని మెప్పించి, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చరిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణకే తలమానికంగా మారిన కాళేశ్వరం, మేడిగడ్డ, చనాక-కొరాట, తమ్మిడిహట్టి లాంటి నిర్మాణాలకు మార్గాన్ని సుగమం చేశారు. దీనివల్ల తెలంగాణ ప్రజల తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఎత్తును 100 మీటర్ల నుంచి అవసరమైతే 101 ఎత్తుకు పెంచుకునేలా చేసుకున్న ఒప్పందం కేసీఆర్ దౌత్యనీతికి నిదర్శనం. ఇవేమీ అర్థం చేసుకోలేని ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర పాలనా విధానాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గుడ్లగూబ పగటి సమయంలో వెలుతురును చూడలేదు. అలాగని అది సూర్యుని తప్పు కాదు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అకుంటిత దీక్షతో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రతిపక్ష నాయకులకు కనబడకపోవడం ఇలాంటిదే. వీటన్నిటికి చర్చలు, సంప్రదింపు చర్యలు, ఇచ్చి పుచ్చ్చుకునే విధానాలే కారణం. నీటి కేటాయింపుల విషయంలో 1969 ఏప్రిల్ 10న కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన బచావత్ ట్రిబ్యునల్ ఎందుకు నీటి కష్టాలను తీర్చలేకపోయింది? అలాగే కృష్ణ జాలాల పంప కం విషయంలో ఏర్పడిన బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు సమస్య పరిష్కారానికి ఐదేండ్ల సమయం ఎందుకు పట్టింది అని ఆలోచించాల్సిన అవసరం మనపై ఉన్నది. ఇప్పటికీ కొన్ని రాష్ర్టాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నా ఈ ట్రిబ్యునల్‌లు ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయి? రాష్ట్ర పాలకుల మధ్య సమన్వయం, స్నేహపూర్వక సత్సంబంధాలు ఉంటే ఎంత జఠిలమైన సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చునని కేసీ ఆర్ నిరూపించారు, ఇలా భౌగోళిక సరిహద్దులు కలిగిన రాష్ర్టాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలంబిస్తే ఆ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Taduri-Srinivas
2017లో తుంగభద్రలో మనకు ఉన్న వాటా నుంచి ఒక టీఎంసీ నీటిని ఇవ్వమని కర్ణాటక ప్రభుత్వం అడుగగా వెంటనే స్పందించి అంగీకరించా రు కేసీఆర్. అగానే మన అవసరానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా వెంటనే ఒప్పుకోవడం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న నానుడిని నిరూపించింది. నీటి యుద్ధాలు చేసుకునే రోజుల నుంచి మంచి ఆదర్శ వాతావరణాన్ని నెలకొల్పిన కేసీఆర్ అందరికీ ఆదర్శ ప్రాయుడు. రాబోయే రోజుల్లో ఇలాంటి విధానాలతో మన దేశం, రాష్ర్టా లు, మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం. దీనికి కేసీఆర్ దిక్సూచిగా నిలువాలని దేశం ఆశగా ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్)

188
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles