పచ్చదనాన్ని పెంచుదాం

Fri,May 10, 2019 01:05 AM

వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఏటా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికంతటికీ కారణం ప్రకృతిని మనం సరిగ్గా కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. దాన్ని ధ్వంసం చేస్తే, మన మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. రోజురోజుకూ తగ్గిపోతున్న అడవిని సంరక్షించుకోవాలి. అలాగే ఇష్టానుసారం చెట్లను నరికివేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉన్నది. పర్యావరణ పరిరక్షణ గురించి మన అందరికీ తెలుసు. అయినా దాన్ని ఆచరణలో పెట్టాలనే ఆలోచన ఇప్పుడు కరువైంది. అందుకే ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొవాల్సిన వస్తున్నది. కాబ ట్టి ఇకనైనా పచ్చదనం పెంచడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.
-బి. రామాంజనేయులు, నాగార్జునసాగర్

పొదుపుగా నీటిని వాడుకోవాలె

ఎండాకాలంలో నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు అడుగంటుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రజ లు నీటిని పొదుపుగా వాడుకోవాలి. అంతేకాదు నీటి సంరక్షణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. వానా కాలం వచ్చిందంటే చాలా చోట్ల నుంచి విపరీతంగా నీళ్లు రోడ్లపైకి వస్తుండటం మనం చూస్తుంటాం. వాన నీటిని కూడా పొదుపుగా వాడుకుంటూ తమ అవసరాలు తీర్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. నీళ్లు ఉన్నప్పుడు నిల్వ చేసుకోవడం, అవసరం మేరకే పొదుపుగా వాడుకోవడం అన్నది నిత్యం ఆచరించాలి. అప్పుడే భావి తరాలకు మనం సేవ చేసిన వాళ్లం అవుతాం. ఈ చైతన్యం ప్రజల్లో రావాలి. అప్పుడే నీటి పొదుపు సాధ్యం అవుతుంది
-ఎం. రమేశ్, నాగర్‌కర్నూల్

122
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles