క్యాన్సర్‌కు అవగాహనే పరిష్కారం

Fri,April 19, 2019 01:22 AM

ఆధునిక జీవన సరళి కారణంగానే క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తున్నది. ఏటా రాష్ట్ర వ్యాప్తం గా వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. మరెంతో మంది వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది. అయితే ఈవ్యాధి చుట్టూ అనేక వాదనలు జరుగుతున్నాయి. కొంతమంది ఇది వ్యాధి కానే కాదని, చికిత్స పేరుతో లక్షలు దండుకోవటం, రోగులను కీమో తెరపీ పేరుతో మరింత ముం దుగా చంపటం మాత్రమే చేస్తున్నారనే విమర్శ లూ ఉన్నాయి. ఏదేమైనా ఈ వ్యాధిని నివారిం చటం ఇప్పటి అనివార్య సమస్య. అయితే జీవ న విధానంలో అనుసరిస్తున్న అలవాట్లు, కాలు ష్య పరిస్థితులు, విషతుల్యమైన ఆహార పదార్థా లతోనే క్యాన్సర్ వస్తున్నది. చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్న తీరు ఆందోళన కలి గించేదే. ఇప్పటికైనా మేల్కోవాలి.
- జీడిపెల్లి లింగారావు, రామకృష్ణకాలనీ, కరీంనగర్

గులాబీ గుబాలించాలె

రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నిక ల్లో ఇప్పటివరకూ గులాబీ జెండానే గుబాళించింది. దానికి ఒకే ఒక కారణం. ఏండ్ల తరబడి ఉద్యమం చేసి చిరకాల కోరిక అయిన ప్రత్యేక తెలంగాణను సాధించుకోవటమే. దీనికితోడు ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని సర్వతోముఖా భివృద్ధి దిశగా సీఎం కేసీఆర్ తీసుకుపోవటం కూడా చెప్పుకోవ చ్చు. మిషన్ కాకతీయ మొదలు, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ లాంటి ఎన్నో మ్యానిఫెస్టోలో లేని పథకాలను ప్రారంభించి ప్రజల వద్దకు పాలనను తీసుకుపోయారు కేసీఆర్. అందులో భాగంగానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలంటే మళ్లీ కేసీఆరే రావాలని ఏకపక్ష తీర్పునిచ్చి అధికారం పీఠం అప్పగించారు. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎంపీటీ సీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో కూడా ఉద్యమ పార్టీని గెలుపించుకొని మన రాష్ట్రంలో మన పాలనను సాధించుకోవాలె. నిజానికి ఈ ఎన్నికలే మన అభివృద్ధికి మొదటి మెట్టుగా ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలువాలె.
- తాళ్లపెల్లి మనోజ్, మలక్‌పేట్, హైదరాబాద్

127
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles