సిబ్బంది ఆత్మశోధన అవసరం

Thu,April 18, 2019 01:22 AM

చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాల గురించి ముఖ్యమం త్రి సూచనల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చట్టాలను వాస్తవంగా రూపొందించినపుడు గాని ఇది సమగ్రం గా తెలిసే అవకాశం లేదు. ఆ వివరాలు తెలియకనే కావ చ్చు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మార్పులు అనే ఆలోచనలో ప్రభుత్వ ఉద్దేశం రాష్ర్టానికి మేలు చేయటం అవుతుంది. ఉద్యోగులకు హాని చేయాలని ప్రభుత్వం భావిస్తుందనుకోలేము. అటువంటి అవస రం ఎందుకుంటుంది. పైగా ఆ సిబ్బంది ద్వారానే చట్టాలను అమలుపరుచాలి. అందువల్ల సిబ్బంది ఆందోళన చెందవలసిన అవసరమేమీ కన్పించదు. ఇంకొకవైపు ఆలోచిస్తే, ఒకవేళ లక్ష్యాల సాధన శాఖల పరం గా, విధుల పరంగా ఏమైనా మార్పులు చోటు చేసుకున్నట్లయితే ఆ కారణంగా సిబ్బంది సర్వీసులకు, జీత భత్యాలకు ఇదే భద్రత కొనసాగుతుం ది. అటువంటప్పుడు ఆందోళన చెందటం వల్ల ఉద్యోగులకు సమాజం నుంచి సానుభూతి లభించే అవకాశం ఉండదు. అందువల్ల, ప్రభుత్వం తలపెట్టిన చర్యలను సిబ్బంది మొదట పాజిటివ్‌గా చూసేందుకు అలవాటుపడాలి. తర్వాత వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. తమ సూచనలు తాము చేయాలి. ఆ సూచనలు పరిపాలన మెరుగుదలను, అవినీతి కట్టడిని ఉంచుకొని జరుగాలి తప్ప సొంత ప్రయోజనాలను కాదు. స్వప్రయోజనాల కోసం చేస్తున్నట్లు తోచి న పక్షంలో అందుకు ప్రజల సానుభూతి ఉండదు. తమ బంగారు తెలంగాణ ప్రతిజ్ఞలకు విలువ ఉండదు. తమ పాజిటివ్ సూచనలను ప్రభు త్వం పరిగణనలోకి తీసుకోదని అనలేము. వాస్తవానికి మార్పులను ప్రభుత్వం ప్రత్యక్షంగా, సిబ్బంది పరోక్షంగా చేస్తారు. అమలులో ఉభయుల ప్రత్యక్ష పాత్ర ఉంటుంది. ఆ విధంగా చట్టపరమైన మార్పులన్న వి ఒకస్థాయిలో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగపు ఉమ్మడి చర్య అవుతుంది.

సమర్థ పాలనకు, అవినీతి కట్టడికి కొత్త చట్టాలు చేయగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినప్పటి నుంచి ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి. సీఎం ప్రకటనను సమాజం ఆహ్వానిస్తుండగా ఉద్యోగులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు మేలు చేయటమే గనుక, ఉద్యోగులు పాజిటివ్ దృష్టితో ఉండి పనులు సక్రమంగా జరిగేందుకు, అవినీతి తొలిగిపోయేందుకు సహకరించాలి. బంగారు తెలంగాణ కోసం అంటూ తాము స్వయంగా చేసిన ప్రతిజ్ఞలను మరచిపోకూడదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ విషయమై తమవైపు నుంచి జరిగిన మంచి చెడులపై ఆత్మపరిశీలన, దిద్దుబాట్లు చేసుకోవాలి.


ఇందుకు తప్పనిసరిగా కావలసింది ఉద్యోగులకు అటువంటి స్ఫూర్తిని కలిగించుకోవటం. అది కలుగనప్పుడు ప్రభుత్వం తలపెట్టిన ఏ మార్పు అయినా వారికి ఇబ్బందిగా తోస్తుంది. ఆందోళనను కలిగిస్తుంది. అటువంటి స్ఫూర్తి ఏర్పడిన పక్షంలో తమను తాము ఆ మార్పులో భాగస్వాములుగా చూసుకుంటారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పు డు, భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగులకు అటువంటి స్ఫూర్తి కలుగుతుందని, కలుగాలని సమాజం ఆశించింది. వలస పాలనకు, అందువల్ల వచ్చిన వెనుకబాటుకు దశాబ్దాల కాలం గురైన తర్వాత, ఆ స్థితికి వ్యతిరేకంగా స్వయంగా ఉద్యోగులు సైతం కష్టనష్టాలకోర్చి పట్టుదలగా పోరాడిన మీదట, తెలంగాణ భవిష్యత్తు కోసం వారికి అటువంటి స్ఫూర్తి సహజమైన రీతిలో కలుగగలదని ఎవరైనా నమ్ముతారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? రాష్ట్రం ఏర్పడిన వెనుక ఉద్యోగ సంఘాలు తాము బంగారు తెలంగా ణ నిర్మాణం కోసం పాటుపడగలమని తమ సమావేశాల్లో ప్రతిజ్ఞలు చేశా యి. ఒకసారి కాదు, పలుమార్లు. ప్రతిరోజు ఒక గంట అదనంగా పనిచేయగలమని కూడా అన్నాయి. ఉద్యోగులు అవినీతికి పాల్పడబోరని మాటల రూపంలో అనటం ఇబ్బందికరం గనుక అనలేదు గాని, అవినీతికి మంచి పాలనలో చోటుండదు గనుక వారి ఆలోచనల్లో అది కూడా అంతర్లీనంగా ఉన్నదనే మనం భావించాం. కానీ వాస్తవంగా అందుకు కట్టుబడిన వారు కొందరు మాత్రమేనని ఆరు నెలల తిరుగకముందే ప్రజలకు తోచింది. ఇందుకు సంబంధించి వివరాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు గాని, క్లుప్తంగా రెండు మాటలు అనుకుందాము. అవినీతి ఉమ్మ డి రాష్ట్రంలో కన్న తగ్గలేదనే మాట విరివిగా వినిపించసాగింది. ఆశ్చర్యకరంగా చిన్న ఉద్యోగులే గాక పెద్ద అధికారులు కూడా అవినీతి నిరోధక శాఖకు పట్టుబడసాగారు. సాధారణంగానైతే అవినీతి మామూలే కదా అని తీసుకునే వాళ్లమేమో.

ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టుల విషయమై పట్టుబట్టి కూర్చొనటంతో ఆ శాఖ ఉద్యోగులు కూడా తెలంగాణ స్ఫూర్తితో రాత్రింబగళ్లు శ్రమ పడుతున్నారు. భూమి రికార్డుల విషయంలో ఇదే జరిగింది. కాని దురదృష్టవశాత్తు అదే రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు విరివిగా అవినీతి ఆరోపణలకు గురవుతున్నారు. ఇక వివిధ శాఖల వారు ప్రజలను పనుల విషయమై తిప్పుకొనటం, వేధించటం, అవినీతి సర్వసాధారణమైపోయింది. హక్కులతో పాటు బాధ్యతలు, నైతికతలు కూడా ఉంటాయని రెవెన్యూ ఉద్యోగులు గుర్తించాలి.


కాని ఒక సుదీర్ఘ ఉద్యమం, దాని నుంచి వచ్చిన ఆదర్శ భావనలు, భవిష్య నిర్మాణంలో ఉద్యోగుల కీలకమైన పాత్ర అనే ఆలోచనల నేపథ్యం నుంచి చూసినప్పుడు ఇటువంటి ధోరణి దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించింది. ఇక ఒక గంట అదనంగా పనిచేయటమేమో గాని, ఆలస్యంగా కార్యాలయాలకు వచ్చి తొందరగా వెళ్లిపోవటం అంతకుముందు వలెనే కొనసాగింది. సీనియర్ మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేసి దీనిపై వ్యాఖ్యానించటం, హెచ్చరించటం జరిగిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. అదే సమయంలో ఇందుకు భిన్నమైన దృశ్యాలు కూడా కొన్ని కనిపించాయి. ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టుల విషయమై పట్టుబట్టి కూర్చొనటంతో ఆ శాఖ ఉద్యోగులు కూడా తెలంగాణ స్ఫూర్తితో రాత్రింబగళ్లు శ్రమ పడుతున్నారు. భూమి రికార్డుల విషయంలో ఇదే జరిగింది. కాని దురదృష్టవశాత్తు అదే రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు విరివిగా అవినీతి ఆరోపణలకు గురవుతున్నారు. ఇక వివిధ శాఖల వారు ప్రజలను పనుల విషయమై తిప్పుకొనటం, వేధించటం, అవినీతి సర్వసాధారణమైపోయింది. హక్కులతో పాటు బాధ్యతలు, నైతికతలు కూడా ఉంటాయని రెవెన్యూ ఉద్యోగులు గుర్తించాలి. ఒకవైపు తమ ఉద్యమాలు, ప్రతిజ్ఞలు ఉండగా, మరొకవైపు స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం తమకు ఆర్థికంగా, ఇతరత్రా లాభించేవి అనేకం చేసిన తర్వాత కూడా ఉద్యోగులు ఈ విధంగా వ్యవహరించటా న్ని ప్రజలు గుర్తించి నిరసించటం మొదటి సంవత్సరం పూర్తికాక ముందే మొదలైంది. జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుంటే వీరి స్థితి ఈరోజున దేశంలోనే అగ్రస్థానం అవునో కాదో తెలియదు గాని, తప్పకుండా అగ్రస్థానాలలో ఒకటి అవుతుంది. అయినప్పటికీ తాము ఉద్యమించిన, తాము ప్రతిజ్ఞలు చేసిన రాష్ట్రం పట్ల వీరు చూపుతున్న బాధ్యత ఈ విధంగా ఉన్నది.

అది చాలదన్నట్లు పీఆర్సీ, ఐఆర్ వంటివి కొంత ఆలస్యమైనందుకు, అది ప్రభుత్వం చేతిలో లేని ఆలస్యం అయి నా సరే, ప్రభుత్వంపైన కత్తిగడుతారు. దీన్ని తెలంగాణ స్ఫూర్తి అనగల మా? పైన చెప్పుకున్న వివిధ అంశాలు అన్నీ రాష్ర్టాభివృద్ధికి, ప్రజల మేలుకు, సుదీర్ఘ వలస పాలన నుంచి బయటపడి ఒక ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తున్న ఒక సమాజపు ఆశలకు దోహదం చేసేవేనా? అది జరుగాలంటే మునుగోడు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మా ఆఫీసు అవినీతి రహితం అని ఒక బోర్డు ఏర్పాటుచేసిన స్ఫూర్తి రావాలి. అధికార యంత్రాంగపు అవినీతి విషయం కేసీఆర్‌కు తెలంగాణ వచ్చే సమయానికి తెలుసు. కాని దానిని నియంత్రించేందుకు గట్టి చర్యలు మొదటనే తీసుకోవటం గాక, ముందుగా రాజకీయ అవినీతిని, అత్యున్నతాధికారుల స్థాయి అవినీతిని అదుపు చేసినట్లయితే, ఆ సిగ్నల్స్ వెళ్లి కిందిస్థాయిలోనూ అదుపు అవుతుందన్నది ఆయన ఆలోచనగా ఉండినట్లు చెప్తారు. కానీ ఆ సిగ్నల్స్ ఏమి వెళ్లాయో తెలియదు గాని, 2014 జూన్‌లో అధికారం స్వీకరించిన ఆయనకు పరిస్థితిని 2015 జనవరి వర కు ఏడు మాసాల పాటు గమనించిన తర్వాత సహనం నశించినట్లు ఉం ది. దానితో జనవరి 11న వరంగల్‌లో పేదల సభలో మాట్లాడుతూ లంచమంటే తోలు తీస్తా నన్నారు. అప్పటినుంచి ఇప్పటికి మరొక నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలం గడిచింది. ముఖ్యమంత్రి మళ్లీ ఈ విషయాలు మాట్లాడవలసి వస్తున్నది. ఉద్యోగులు ఆత్మపరిశీలన చేసుకోవలసింది, దిద్దుబాట్లు చేసుకోవలసింది ఇక్కడున్నది. పోయినమారు ఆయన కేవలం అవినీతిని ప్రస్తావించి హెచ్చరికలు మాత్రం చేశారు. ఆ తర్వాత కాలంలోనూ అటువంటివే కొన్నిచేశా రు.
Ashok
సిబ్బందికి తెలంగాణ స్ఫూర్తి ఉన్నట్లయితే, తాము చేసిన ఉద్యమాలను, ప్రతిజ్ఞలను తాము గౌరవిస్తుండినట్లయితే ఇటువంటి హెచ్చరికల అవసరమే ఉండేది కాదు. కాని ఉద్యోగులు తమ పట్ల తామే గౌరవాన్ని చూపుకోలేదు. తమ రాష్ర్టాన్ని, ప్రజలను, వారి మేలును, పురోగతిని గౌరవించలేదు. అట్లా గౌరవించకుండా అవమానించారు. తమనుతా మే అవమానించుకున్నారు. అటువంటి పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి ఈ సారి హెచ్చరికలు చేయటం లేదు. ఈ సమస్యను తీర్చేందుకు వ్యవస్థపరంగా ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు. అది చట్టాల మార్పులు, కొత్త చట్టాల తయారీ. ఇందులో హెచ్చరికలు, చర్యలు ఏమున్నాయి. కనుక దీన్ని సిబ్బంది స్వాగతించాలి. తెలంగాణ స్ఫూర్తిని కలిగించుకుంటే ఆ పని తప్పకచేస్తారు.

283
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles