తమిళ ఓటర్లు ఎవరివైపు?

Thu,April 18, 2019 01:22 AM

తమిళ రాజకీయ రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన కరుణానిధి, జయలలిత దివంగతులైన తర్వాత తొలిసారిగా తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రతిపక్ష స్థానంలో బలమైన నాయకుడిగా మిగిలాడు. కానీ అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పటికీ, అదొక పార్టీ గా బలంగా నిలబడిలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరోక్ష మద్దతుతో రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో జయలలిత వారసత్వం అన్నాడీఎంకేకు దక్కుతుందా లేక దినకరణ్ వర్గం పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తిదాయకంగా మారింది. తమిళనాడులో ఎన్నికల రంగంలో ఇప్పుడు ప్రజలను కదిలించే నాయకులు ఎవరూ లేరు. అందువల్ల రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభంజనమూ లేదు. అయితే పైకి కనిపిస్తున్న రాజకీయ పొరల అడుగున అంతర్వాహినులు దాగి ఉన్నాయి. వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కష్టం. తమిళనాడు రాజకీయాల్లో మొదటినుంచి కుల ప్రభావం ఎక్కువ. బహిరంగంగా ఎవరూ కులం పేరు వాడుకోవడం లేదు. కానీ ప్రచారసరళిలో కుల కోణం స్పష్టంగా కనబడుతున్నది. ఈ కుల ప్రభావమే శశికళ దగ్గరి బంధువు, అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం (ఎఎంఎంకే) నాయకుడు దినకరణ్‌కు బాగా కలిసి వస్తున్నది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను దినకరణ్ దెబ్బతీయడానికి కులం కార్డ్ చక్కగా పనిచేయవచ్చు. అధికార పక్షం కూడా కులం ప్రాతిపదికన ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నది. వన్నియార్‌ల పార్టీ అయిన పీఎంకేతో పొత్తు పెట్టుకున్నది. ఉత్తరాది జిల్లా ల్లో పీఎంకే ప్రభావం ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల గొం తు వినిపిస్తున్న పుతియ తమిళహం పార్టీతో కూడా అన్నా డీఎంకే పొత్తు పెట్టుకున్నది.

ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా ఉందని వేరే చెప్పనవసరం లేదు. కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి. గతంలో ఆర్‌కేనగర్ ఉప ఎన్నికను ధన ప్రభావం కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. జయలలిత వారసత్వాన్ని చాటుకోవడం కోసం ఈ ఎన్నికల్లో దినకరణ్ పోటీ పడ్డారు. అతడిని దెబ్బతీయడానికి అధికారపక్షం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ధనం ప్రవహించింది.


మరోవైపు దినకరణ్ నేతృత్వంలోని అమ్మా మక్కల్ మున్నే త్ర కజగం ముస్లి పార్టీ అయిన ఎస్‌డీపీఐతో పొత్తు పెట్టుకున్నది. దినకరణ్ పార్టీకి ఒక అనుకూలాంశం ఉన్నది. అది అధికార కూటమిలో భాగం కాదు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో కీచులాటలు ప్రజలకు విసుగు తెప్పించాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వమ్ వర్గాల మధ్య సఖ్య త లేదు. డీఎంకే నుంచి కూడా దినకరణ్ వర్గం కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చునని అంటున్నారు. దినకరణ్ ముక్కులాతోర్ సామాజికవర్గానికి చెం దిన ఓటర్లు ఎక్కువగా దినకరణ్‌కు ఓటువేసే అవకాశం ఉన్నది. తమిళనాడులో సామాజికవర్గాల మధ్య చీలికల వల్ల ద్రవిడ ఉద్యమ ప్రభావం తగ్గిపోతున్నదని కొందరు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు మాత్రం తమ కులస్తులు రాజకీయరంగంలో ప్రవేశించడాన్ని ఆహ్వానిస్తున్నారు. సామాజికవర్గాల సమీకరణల వల్ల దళితులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీరు ఎక్కువగా డీఎంకే కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే వారిపై జరిగే దాడులను ప్రధాన రాజకీయపక్షాలేవీ పట్టించుకోవడం లేదు. అన్నాడీఎంకే, దినకరణ్ సారథ్యంలోని ఏఎంఎంకే ఎంజీఆర్-జయలలిత వారసులం మేమే అంటూ ప్రచారం చేసుకుంటున్నా యి. అయితే అన్నాడీఎంకే ఇప్పటికే అధికారంలో ఉన్నది. కానీ ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడం దినకరణ్‌కు తప్పనిసరి. దినకరణ్ ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆయనపై రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వబోయారనే కేసు ఉన్నది. దినకరణ్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోకుండా అనర్హులయ్యారు. దీనిపై కోర్టుకు వెళితే అక్కడా చుక్కెదురైంది. ఇటీవలే కోర్టు దినకరణ్‌కు రెండాకుల గుర్తు తిరస్కరించింది. దీంతో ఆయన పార్టీ గిఫ్ట్ బాక్స్ గుర్తుతో పోటీ చేయవలసి వచ్చింది. ఈ గుర్తు జన సామాన్యానికి తెలువదు.

పైగా గుర్తింపు పొందిన పార్టీ కానందువల్ల బ్యాలట్‌పై ఇండిపెండెంట్‌గానే ఉంటుంది. ఇటీవల అలంగుడిలో ఏఎంఎంకే అభ్యర్థి తెర్బోగి వి పాండికి మద్దతుగా సభ జరిగింది. మనిషికి రెండు వందల వంతున ఇచ్చి జనాన్ని తరలించారు. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి వచ్చినప్పటి కన్నా ఎక్కువ జనం కనిపించారు. అనేకమంది అన్నా డీఎంకే నుంచి ఏఎంఎంకే వైపు వచ్చినట్టు కథనాలు వినిపించాయి. తమిళ జాతీయవాదం: వార్తాపత్రికలు పెద్దగా పట్టించుకోని ప్రధానాం శం తమిళ జాతీయవాదం. ఆంగ్ల పత్రికలైతే ఈ అంశాన్ని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రధాన పార్టీలు ఇప్పుడు ద్రవిడవాదాన్ని వదిలిపెట్టినట్టే కనిపిస్తున్నాయి. వైకో నాయకత్వంలోని ఎండీఎంకే పరిస్థితి కూడా అదేవిధంగా ఉన్నది. ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో చేరింది. 2009లో శ్రీలంక తమిళ టైగర్ల పోరాటం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్, డీఎంకే నిష్క్రియాపరత్వం విమర్శలకు గురైంది. తమిళ జాతీయవాదం పేరున యువత భారీ ఎత్తున కదిలిరావడం మొదలైంది. జల్లికట్టు నిరసనలు ఇందుకు సూచన. మాజీ నటుడు సీమాన్ నామ్ తమిళర్ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ ఎల్‌టీటీఈ నేత ప్రభాకర న్ ఫోటోను తమ ప్రచారంలో ఉపయోగిస్తున్నది. నెడువాసల్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాలను నిర్వహించింది. ఈ ప్రాంతంలోని కుటుంబాల కు శ్రీలంక ఎస్టేట్ కార్మికులతో సంబంధాలు ఎక్కువ. సీమా న్ మంచి వక్త. ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారంలో ఉన్నా యి. ఈ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నది. ఈ అభ్యర్థులలో సగం మంది మహిళలు. ఈ పార్టీకి రెండు శాతానికి మించి ఓట్లు రావంటున్నారు. అయితే డీఎంకే, వామపక్షాల నిష్క్రియాపరత్వం నేపథ్యంలో ఈ పార్టీకి ప్రాధాన్యం లభిస్తున్నది. తమిళనాడులో అంతర్వాహినిలా ఉన్న ఈ జాతీయ భావనను నగర ప్రాంత రాజకీయ పెద్దలు పట్టించుకోవడం లేదు.
francis-cody
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీధి మయ్యుం రంగంలో ఉన్నప్పటి కీ డబ్బు ఖర్చుచేయడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఈ పార్టీ ఉనికి లేదు. కమల్‌హాసన్ స్వయంగా పోటీ చేయకపోవడం వల్ల పార్టీ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా ఉందని వేరే చెప్పనవసరం లేదు. కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి. గతంలో ఆర్‌కేనగర్ ఉప ఎన్నికను ధన ప్రభావం కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. జయలలిత వారసత్వాన్ని చాటుకోవడం కోసం ఈ ఎన్నికల్లో దినకరణ్ పోటీ పడ్డారు. అతడిని దెబ్బతీయడానికి అధికారపక్షం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ధనం ప్రవహించింది. జనాలను డబ్బుపెట్టి తరలించడం ప్రదర్శన కోసం ఉపయోగపడవచ్చు. కానీ దానివల్ల ఓట్లు పెరుగవు. పోలింగ్ సమయంలో ఎవరెంత ఖర్చు చేస్తారనేది ప్రధానమైపోయింది. బలాబలాలు: తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో అన్నాడీఎంకే 37 స్థానాలను గెలుచుకున్నది. జయలలితకున్న ఆదరణ ఇందుకు కారణం. ఎస్. రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే, నటు డు విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే కూడా బీజేపీ కూటమిలో ఉన్నాయి. డీఎంకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. కమ్యూనిస్టులు కూడా ఈ కూటమిలో ఉన్నారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 18 వ తేదీన ఒకే విడుతగా జరుగనున్నాయి. కరుణానిధి వారసుడిగా రంగంలోకి దిగిన స్టాలిన్‌కు ఇది అగ్నిపరీక్ష. అన్నాడీఎంకేలోని వర్గాలకు, దికనరణ్‌కు కూడా ఇది జీవన్మరణ సమస్య. జయలలిత, కరుణానిధి మరణించిన నేపథ్యంలో ఆయా పార్టీల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
(సౌజన్యం: ది వైర్ )

249
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles