అగ్నికి ఆజ్యం పోసేలా...

Wed,April 17, 2019 01:03 AM

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే పట్టించుకోకుండా హస్తినలో ఈవీఎంలపై హడావుడి చేస్తున్నారు. టెక్నాలజీ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పందంగా ఉన్నది. ఈవీఎంలలో సాంకే తిక లోపాలు తలెత్తినా, ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేకసార్లు వివరణ ఇచ్చింది. కానీ ఓటింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు తన ఓటమికి కారణాలు ఈవీఎంలపైకి నెట్టే ప్రయ త్నం చేస్తున్నారనే అక్కడి ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేవిధంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఏపీలో ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈవీఎంలలో కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట నిజమే. అయితే వాటిని సరిచేయడానికి గంట రెండు గంటలు పట్టింది. అయినా ప్రజలు ఓపికగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నా రు.

కానీ చంద్రబాబు మాత్రం ఇంకా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో అర్థం లేదు. అంతేకాదు తాను ఇచ్చిన పిలుపుమేరకే ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని చంద్రబాబే అంటున్నారు. మరి అలాంటి ప్రజలు ఇచ్చే తీర్పు ఏమిటన్నది త్వరలో తేలుతుంది. అప్పటిదాకా ఆగవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారన్న విశ్లేషణలను చంద్రబాబు జీర్ణించుకోవడం లేదు. అందుకే ఇప్పటి నుంచే అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఈవీఎంల అంశాన్ని ముందుకుతెచ్చారు. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులను చక్కబెట్టకుండా ఆగ్నికి ఆజ్యం పోసేవిధంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నా రు. మాట్లాడితే నాకంటే సీనియర్ నాయకుడు లేడనే చం ద్రబాబు ఇలాగేనా వ్యవహరించేది? ఎన్నికల్లో గెలుపోటములు సహజం. దీన్ని హుందాగా స్వీకరించాలి. అంతేగానీ గెలిస్తే తన ఖాతాలో ఓడిపోతే మాత్రం ఇతర కారణాలు చూపెట్టడం చంద్రబాబుకు మొదటినుంచి అలవా టే. దాన్నే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.
- కోట శంకర్‌రెడ్డి, జమ్మికుంట, కరీంనగర్

152
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles