అవినీతి అంతు చూద్దాం!

Mon,April 15, 2019 11:16 PM

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి నోటివెంట అత్యుత్తమమైన, ఉదాత్తమైన మాటలను ఇటీవల విన్నాం. అలా గే, భారతీయ ప్రజాస్వామ్యంలోని ఏ రాజకీయ పార్టీ అధినేత నుంచీ ఇంత ముక్కుసూటి అభిప్రాయాలను ఇప్పటిదాకా వినలేదు. గత శుక్రవారం (12వ తేదీ) హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అవినీతి అం తు తేల్చడానికి దిశానిర్దేశం చేసిన తీరు అనూహ్యం. అవినీతి అంతానికి పంతం శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన బ్యానర్ వార్త చదువుతుంటే మనసు పులకించిపోయింది. ఎన్నాళ్లకు ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత కోట్లాది మంది ప్రజల హృదయాల్లోకి తొంగి చూశారా అనిపించింది. ఆయన ఆదేశాలు ఎప్పుడెప్పుడు ఆచరణలోకి వచ్చి, ఆ సంస్కరణలు, పారదర్శకతతో కూడిన పాలనతో అవినీతి రహిత సమాజం ఆవిష్కృతమవుతుందా అని ఎదురుచూస్తున్నాం. ఎవరు కాదన్నా, ఇంకెవరు నమ్మకపోయినా భవిష్యత్ తెలంగాణ బం గారు బాట పట్టి తీరుతుందనడానికి ఇదే తాజా నిదర్శనం. 2018 డిసెంబర్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా రాష్ట్ర ప్రగతి యజ్ఞాన్ని కొనసాగిస్తూ తీసుకున్న అద్భుత నిర్ణయం ఎంత చరిత్రాత్మక అవసరమో ఇలాంటి సంఘటనలు వెల్లడిస్తాయి. ప్రజలు ఎప్పటికీ పూర్తి అభివృద్ధి కాముకులేనని ఈ అపురూప విజయం మరోమారు నిరూపించింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నించీ కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాత్రం పడకేయకుండా ఎలాగైతే అధికారులను, నాయకులను పరుగులు పెట్టించారో సరిగ్గా ఇదేరకమైన స్ఫూర్తిదాయకమైన చైతన్యం మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల అనంతరం చూస్తున్నాం.

ప్రతిచోటా సమూల పాలనా సంస్కరణలను, పారదర్శకతను ప్రవేశపెట్టడం ద్వారా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ముందుంటున్నందుకు తెలంగాణ బిడ్డలమందరం గర్విద్దాం. రాజకీయాల్లో మంచిని, మనుషుల్లో విలువలను, సమాజంలో క్రమశిక్షణను ప్రవేశపెట్టాలన్న వారి తాపత్రయాన్ని సహృదయంతో అర్థం చేసుకొందాం. చేతనైతే ఆయనకు బాసటగా నిలుద్దాం.


ఒక్క టర్మ్‌లోనే తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశానికే తలమానికంగా నిలిపిన ఆయన పట్టుదల, కృషి ప్రస్తుత ఈ రెండో టర్మ్‌లోనూ అప్రతిహతంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారత చరిత్రలో దేశప్రగతి గుణాత్మక మార్పునకు నోచుకోకపోగా, యావత్ ప్రపంచ దేశాల ముందు మన ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యం పాలైన దీనదుస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి అవినీతి. మన దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదని అమలుకు ముందే అంబేద్కర్ వంటి మహానుభావులు అభిప్రాయపడటానికి దోహదపడిన అంశాల్లోనూ ఇదొకటి. ప్రజాస్వామ్యంలోని మధురఫలాలను రుచిచూసే అవకాశమే ఇప్పటికింకా మన దేశప్రజలకు రాకుండాపోయింది. నేతి బీరకాయ నీతిలా ప్రజాస్వామ్యమంటే ఇక ఇంతేనేమో అన్న స్థిరాభిప్రాయానికి జనం రావడానికి ఇన్నాళ్లూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే ప్రధాన కారణం. మళ్లీ ఇన్నాళ్లకు ఒక విప్లవాత్మకమైన ప్రజాభిప్రాయానికి పట్టం కట్టే ప్రభుత్వం వచ్చినందుకు అందరం ఆనందించాలి. నిఖార్సయిన ప్రజాభిప్రాయాల్ని ఆచరణలోకి తేగల దమ్మున్న రాజకీయపార్టీని మనం ఇవాళ చూడగలుగుతున్నామం టే, ఈ ఘనత కచ్చితంగా కేసీఆర్ దృఢ స్థిర సంకల్పానికే దక్కుతుంది. ఆయన తప్ప, మరొకరి వల్ల ఇలాంటివి సంభవం కావు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్, రెవెన్యూ శాఖలలో అవినీతి ఎంతగా పేరుకు పోయిందంటే, అసలు లంచం లేకుండా ఏ చిన్న పనీ జరుగడం లేదన్నది నిజం. చాలా ఆశ్చర్యంగా ఉద్యోగులకు పెద్ద ఎత్తు న జీతాలు పెరిగినా ఈ రుగ్మత అదే పనిగా ఇంకా కొనసాగుతుండటం. పైవేకాదు, రవాణా, పోలీస్, విద్యుత్, అబ్కారీ, రోడ్లు భవనాలు, విద్య, వైద్యారోగ్యం తదితర అన్ని శాఖల్లోనూ అవినీతి ఇవాళ విచ్చలవిడి అయ్యింది. ఆఖరికి న్యాయ, సేవ, పత్రికా రంగాలకు సైతం ఈ డబ్బు జబ్బు వ్యాపించడం బాధాకరం.
DBS
ప్రజాస్వామ్యానికే ఇదొక పెద్ద చీడపురుగులా, చెదలులా పరిణమించింది. ప్రజలు అధికారులు, సంబంధితుల కు లంచం ఎందుకివ్వాలి? అని ముఖ్యమంత్రి స్థాయి ఉన్నత ప్రజాప్రతినిధి ప్రభుత్వ స్థితిని సమీక్షించుకు న్న సందర్భం ఇప్పటివరకు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే దాదాపు చూడలేదు. అన్ని ప్రభుత్వాల్లా, పార్టీ ల్లా, అందరు రాజకీయ నాయకుల్లా మనమెందుకుండాలి? ఎవరో కొందరు చేసే ఈ తప్పుల వల్ల మొత్తం ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి?- ఈ తరహా ప్రశ్నలు, మీమాంస సాధారణ నాయకులకు వచ్చేవే కావు. ప్రతిచోటా సమూల పాలనా సంస్కరణలను, పారదర్శకతను ప్రవేశపెట్టడం ద్వారా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ముందుంటున్నందుకు తెలంగాణ బిడ్డలమందరం గర్విద్దాం. రాజకీయాల్లో మంచిని, మనుషుల్లో విలువలను, సమాజంలో క్రమశిక్షణను ప్రవేశపెట్టాలన్న వారి తాపత్రయాన్ని సహృదయంతో అర్థం చేసుకొందాం. చేతనైతే ఆయనకు బాసటగా నిలుద్దాం. అంతేకానీ, నడిచే వారి కాళ్లకు అడ్డం పడే కుత్సిత బుద్ధికి ప్రతిపక్షాలు ఇక తక్షణం స్వస్తి చెప్పాలి. నాయకులు, అధికారులు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలన్న స్పృహను గుర్తుంచుకుం టూ అప్రమత్తంగా మెలగాలి. ప్రజలకు మంచిసేవ చేయడం కన్నా గొప్ప బాధ్యతలు మనకేం ఉంటాయి? ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయికూడా లంచం ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులను సృష్టిద్దాం అన్న మన సీఎం ఆలోచనా పంథాను ప్రజలందరం, ప్రత్యేకించి ఉద్యోగులంతా అం దిపుచ్చుకోవాలి. ఇటువంటి ఉత్తమ వ్యవస్థల నిర్మాణం జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం లభిస్తుంది. అప్పుడే మనమంతా కల లు గంటున్న బంగారు తెలంగాణకు బాట పడుతుంది.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles