అంబేద్కర్ బాటలో తెలంగాణ

Sun,April 14, 2019 02:01 AM

ambedkar
స్వాతంత్య్ర సమరంలో, తర్వాత దేశ నవ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం రాజకీయ ప్రక్రియతో బడుగు బలహీనవర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుడు అంబేద్కర్. ఈ దేశ సామాజిక వ్యవస్థ భౌగోళిక స్వరూపం ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలతో ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు. ప్రపంచ జ్యోతి బుద్ధుడు, సామాజిక విప్లవ ఆరంభకుడు పూలేల దివిటీని అందుకొని సామాజిక, ఆర్థిక విప్లవాన్ని ముందంజ వేయించి దేశ చరిత్ర గతిని మార్చిన మహోన్నతుడు అంబేద్కర్. ఆయన మేధస్సు, ఆచరణ ప్రతిష్ఠ కొన్ని రంగాలకు పరిమితం చెయ్యడం న్యాయం కాదు. అసమానతల దొంతరగా ఉన్న అమానవీయ సమాజాన్ని మార్చిన తాత్వికుడిగా, అభివృద్ధి ఫలాలను అందరికి అందించే నిర్మాతగా, యుగకర్తగా చరిత్రలో నిలిచిపోయారు. అంబేద్కర్ సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాల్లేని సమాజం కోసం, దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమనే స్పృహను భారతీయ సమా జం కలిగి ఉన్నందువల్లే ఆయన దూరమై 63 ఏండ్లు దాటినా ప్రజలు ఆయ న జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నారు. ఇది ఆయన చెప్పిన విషయాల సమకాలీనతకు నిదర్శనం. భారతదేశ భవితవ్యానికి సంబంధించి అనేక విషయాలను అంబేద్కర్ అలోచించి, విశ్లేషించి వివరించాడు. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఏర్పాటుచేసిన ప్రకరణ 3 తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తాత్విక సమర్థనను ఇచ్చాయి. తెలంగాణ హృదయంలో అంబేద్కర్ చిరస్మరణీయుడు అయ్యాడు.

జాతీయపార్టీల పాలకులు ఆర్థిక, రాజకీయ అధికారాలను ఎక్కువగా తమ గుప్పిట్లో ఉంచుకొని రాష్ర్టాలపై పెత్తనం చలాయిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా అంబేద్కర్ సూచించిన సమాఖ్య స్ఫూర్తి అమలుకోసం కేసీఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


మాట్లాడుతూ భాషా ప్రాతిపదికపై రాష్ర్టా ల నిర్మాణం జరుగడం శ్రేయస్కరం కాదని వివరించాడు. భాషా దురభిమా నం పెరిగి విచ్ఛిన్న ధోరణులు ఏర్పడే అవకాశం ఉందన్నాడు. అల్పసంఖ్యాకులు అణిచివేతకు గురయ్యే అవకాశం ఉన్నదన్నాడు. ఇది స్పర్థలకు ఘర్షణలకు దారితీస్తాయి. రాష్ర్టాల ఏర్పాటుకు భాషా ప్రాతిపదిక అనివార్యమైనప్పుడు ఒక రాష్ర్టానికి ఒకే భాష కాని, ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టా లు ఏర్పాటు చేయాలని సూచించాడు. రాష్ర్టాల ఏర్పాటుకు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వాలంబన అనే కొలమానాలు ప్రతిపాదించాడు. ఇవన్నీ తెలంగాణకు సరిగ్గా వర్తిస్తాయి. చిన్న రాష్ర్టాలు సమర్థవంతమైన పరిపాలన ఏర్పాటుచేసుకోవడానికి, ఆ ప్రాంతపు ప్రత్యేక అవసరాలను తీర్చటానికి వీలవుతుంది. ప్రజల మనోభావాలు తృప్తిపడుతాయి. ఈ విధంగా అంబేద్కర్ తన మేధో శ్రామికత్వంతో ఇచ్చిన విలువైన సూచనలు, రాజకీయ సాం ఘిక విప్లవ కొనసాగింపునకు ఆయన అనుసరించిన రాజ్యాంగబద్ధ సమరశీలతను ఆవాహన చేసుకున్న కేసీఆర్ విజయాన్ని సాధించిపెట్టారు. ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేద్కర్ తాత్విక ధారలో ముఖ్యమైన సంక్షేమ రాజ్యభావనను కేసీఆర్ గత ఐదేండ్లుగా కొనసాగిస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత తక్కువ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ ప్రమాణంలో సంక్షేమ రాజ్య ఫలాలను అందజేస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలు తనపై మోపిన బృహత్తర బాధ్యతను అగ్రగామిగా నిర్వహిస్తూ నిరంతర చలనశీలతతో తన సహచరులతో,పాలనాధికారులతో మమేకం అవుతూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ వ్యవసాయాన్ని మౌలికమైన పరిశ్రమగా గుర్తించారు. ఆహార ఉత్పత్తికి సంబంధించినది కాబట్టి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి భూమి సక్రమ వినియోగానికి సరైన పెట్టుబడిని, ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలని, పం టల బీమాను అమలుచేయాలని నీటి పారుదల సౌకర్యాలను కలిగించాలని వీటికే రాజ్యం బాధ్యత వహించాలన్నాడు.

ఈ వెలుగులో స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని విజయవంతంగా కేసీఆర్ అమలుచేస్తున్నాడు. భూ కమతాల విభజనలను, చిక్కులను ధరణి ద్వారా తొలిగిస్తున్నారు. కోటి ఎకరాల సతత హరిత తెలంగాణ మాగాణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజల తక్షణ బాగోగుల కోసం పుట్టుక నుంచి జీవితాంతం వరకు కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, ఆరోగ్య రక్షణ, సన్న బియ్యం, గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటుచేస్తూ భారీ కేటాయింపులు చేస్తున్నారు. వృత్తి పనివారల నైపుణ్య శిక్షణ కేంద్రాలను బాగా వెనుకబడినవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సమాజ ప్రగతి నిర్ధారించబడుతుందనే అంబేద్కర్ దార్శనికతలో శిశు సంక్షేమం, స్త్రీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్ల, ఆశా వర్కర్ల జీతాలను పెంచారు. బాధిత మహిళలను రక్షించటం కోసం సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడం కోసం హెల్త్ కిట్స్, భారీ సంఖ్యలో గురుకులాలను, కళాశాలలను ప్రారంభించారు. అంబేద్కర్ నాగరికత వల్ల లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చు కానీ విద్యా ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరా దని బోధించాడు. గురుకులాల ద్వారా శ్రామికవర్గాల పిల్లలు ఎలాంటి ఒత్తి డి, సమస్యలు లేకుండా గుణాత్మక విద్యను అందించవచ్చని చెప్పాడు. స్వరాష్ట్రం సిద్ధించాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 900 లకు పైగా గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇవన్నీ ఉత్కృష్ట స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. జనరల్ విద్యా సంస్థలను కూడా గురుకులాలుగా మార్చాలని పౌరసమాజం డిమాండ్ చేస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వ విద్య ను ప్రజల హక్కుగా మార్చిన అంబేద్కర్ బాటలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.
asnala-srinivas
కాలక్రమంలో జాతీయపార్టీల పాలకులు ఆర్థిక, రాజకీయ అధికారాలను ఎక్కువగా తమ గుప్పిట్లో ఉంచుకొని రాష్ర్టాలపై పెత్తనం చలాయిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా అంబేద్కర్ సూచించిన సమాఖ్య స్ఫూర్తి అమలుకోసం కేసీఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. వివేకి, మంచివాడు, దేశకాల అవసరాలు తెలిసిన విజ్ఞుడు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన సాహసిగా అంబేద్కర్‌ను కాలం మనకు అందించింది. చరిత్రను వెనక్కు నడిపించే ప్రతిఘాతక శక్తుల నుంచి చరిత్రను ముం దుకు నడిపించిన వైతాళికుడిగా అంబేద్కర్ చిరస్మరణీయుడు. సమకాలీన భారతంలో ప్రజల ప్రగతిని, సమాజాన్ని ముందుకు సాగకుండా చేసే ఆధిపత్యాన్ని పునరుద్ధరించే శక్తులు పొంచి ఉన్నాయి. పాత అలవాట్లు , పాత ధోరణులు, పాత ఆలోచనలతో తిరోగమనంలో ముందంజ వేయడానికి మోదీ, సంఘ్‌పరివార్ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమమే పరమావధిగా నడువాల్సిన రాజకీయాలు వ్యక్తిగత విశ్వాసాలైన మతం, ఆరాధనా స్థలాల చుట్టూ తిరుగుతూ వాటి ఆధారంగా మరల అధికారాన్ని పొందే అవాంఛనీయ ధోరణులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అం బేద్కర్ అలోచనాధారలో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణం ఆయన సాధించిపెట్టిన అపూర్వ ఫలితాలను కాపాడుకుంటూ మనపై మోపిన బాధ్యతలను కొనసాగించడంలో ముందువరసలో ఉండాలి. అంబేద్కర్ మన మధ్య ఉంటే తను నిర్ధారించిన ప్రమాణాల వెలుగులో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందని సంతోషపడేవారు. అంబేద్కర్ సంక్షేమ రాజ్య భావనను కొనసాగిస్తూ వాటి ఫలాలను ప్రజలకు అందిస్తూ తెలంగాణను దేశానికి ఒక నమూనాగా నిలబెట్టే కృషిలో మమేకమవ్వడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి..)

268
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles