చౌకీదారువి మాటల మూటలే

Mon,March 18, 2019 11:08 PM

chowdikar
ప్రధాని నరేంద్ర మోదీకి అంతులేని ఆత్మవిశ్వాసం. అతని అధికార అనుచరగణం, అతని పార్టీ వారు నేను కూడా చౌకీదారునే అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దేశానికి రక్షకులం తామే అన్నట్లు ప్రచారానికి లంకించుకున్నారు. కానీ మరోవైపు రాఫెల్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోదగ్గ రుజువులను పరిశీలనలోకి తీసుకుంటున్న స్థితి. దీంతోపాటు రఘురాం రాజ న్ వేలు, లక్షల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతదారుల పేర్లను ప్రభుత్వానికి నివేదికగా అందజేశారు. 2-జీ కుంభకోణం, నీరవ్ మోదీ కుంభకో ణం లాంటివి ఎలాంటి విచారణకు, చర్యలకు నోచుకోకపోయినా.. అవినీతికి వ్యతిరేకంగా తామే పోరాటం చేశామని, అవినీతి,అక్రమాలను నిర్మూలించామని చెప్పుకోవటానికి వెనుకాడటం లేదు! ఇలాంటి వాటి విషయంలో ఎలాంటి చర్యలకు దిగకున్నా.. దేశానికి తామే చౌకీదార్లమ ని మాత్రం అందమైన అబద్ధంగా చెప్పుకుంటున్నారు. మోదీ మద్దతుదారులైతే అడ్డే లేనివిధంగా మాట్లాడుతున్నారు. దేశానికి తామే రక్షకులమని, చౌకీదారులమని భావిస్తున్నారు. నిజానికి మోదీ హయాంలో అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ఏవైనా చర్య లు తీసుకున్నారా అన్నదానితో సంబంధం లేకుండా గొప్పలకు పోతున్నారు. దేశంలో నేరపూరితమైన అవినీతి అక్రమాలను చూడ నిరాకరిస్తున్నారు. మోదీ చెప్పుకుంటున్న గొప్పలు పక్కనపెడితే.., దేశంలో అవినీతి కుం భకోణాలు ఏ రీతిన సాగాయో చూడాల్సిన అవసరం ఉన్నది.

మోదీ చెప్పుకుంటున్న గొప్పలు పక్కనపెడితే.., దేశంలో అవినీతి కుంభకోణాలు ఏ రీతిన సాగాయో చూడాల్సిన అవసరం ఉన్నది. రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగవేతకు పాల్పడిన బడాబాబుల పేర్ల జాబితాను ప్రధాని నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన ఎనిమిది నెలలకే ఆయన కార్యాలయానికి పంపారు.


రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగవేతకు పాల్పడిన బడాబాబుల పేర్ల జాబితాను ప్రధాని నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన ఎనిమిది నెలలకే ఆయన కార్యాలయానికి పంపారు. బ్యాంకు రుణాల బాకీదారుల జాబితాను పీఎంఓకు పంపుతూ వారిపై సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శింక్షించాలని కోరారు. ఎగవేతదారులపై తీసుకునే చర్య లు అవినీతిపరులకు భయంగొల్పేలా ఉండాలని కోరారు. కానీ మన చౌకీదారు కుంభకోణాలకు పాల్పడిన బడాబాబుల అవినీతి బండారం వైపు తొంగైనా చూడలేదు. ఒక సమాచారహక్కు కార్యకర్త సౌరవ్ దాస్ ప్రకారం.. ప్రధాని కార్యాలయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వారికి పన్ను ఎగవేతదారులు, బ్యాంకు బాకీదారుల లిస్టును పంపలేదు, చర్య లు తీసుకోవాలని కోరలేదంటే నమ్ముతారా! కానీ ఇది నిజం. పీఎంఓ కార్యాలయానికి వచ్చిన అవినీతిపరుల జాబితాపై చర్యలు తీసుకోవాల ని ఎవరినీ కోరకపోవటం గమనార్హం. ప్రధాని అధికార కార్యాలయం రఘురాం రాజన్ అందజేసిన బ్యాం కు అప్పుల ఎగవేతదారుల లిస్ట్‌ను పార్లమెంట్‌కు చెప్పటానికి కూడా పీఎం ఓ నిరాకరించింది. సీనియర్ పార్లమెంటేరియన్, పార్లమెంటరీ ఎస్టిమే ట్స్ కమిటీ ముఖ్యుడు మురళీ మనోహర్ జోషీ పార్లమెంట్‌కు అవినీతి పరుల జాబితాను పార్లమెంట్ కమిటీకి తెలుపాలని ఆరు ఉత్తరాలు రాసి నా వాటిని పీఎంఓ పట్టించుకోలేదు. ఇంకా ఘోరమైన విష యమేమంటే.. రఘురాం రాజన్ తయారుచేసిన ఎగవేతదారుల లిస్ట్‌ను పార్లమెంట్ కమిటీకి తెలిపేందుకు జాబితా ఖరారు చేసేందుకు కూడా వారు సిద్ధంగా లేరు.

బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన నీరవ్‌మోదీ ఇక్కడినుంచి ఇంగ్లండ్ పారిపోయి ఇంగ్లండ్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన నిందితుడిగా అతన్ని అరెస్టు చేసి భారత్‌కు అప్పజెప్పాలంటే.. క్రిమినల్ ఫ్రాడ్ విషయాన్ని తెలుపుతూ ఎస్‌ఎఫ్‌ఓ నుంచి ఫిర్యాదును పంపాలని ఎనిమిది నెలల క్రితమే ఇంగ్లండ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. అప్పుడు మాత్రమే నీరవ్ మోదీపై చర్యలు తీసుకోవటానికి మార్గం సుగమం అవుతుందని ఇంగ్లండ్ తెలిపింది. కానీ భారత ప్రభుత్వం మాట మాత్రంగా ఓ విజ్ఞాపన చేసి కూర్చున్నది.


మీటింగ్‌లు జరుగకుండా కావాలని బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యా రు. కుంభకోణానికి పాల్పడిన వారి పేర్లు బయటపెట్టాడానికి జరుగాల్సి న సమావేశానికి హాజరుకావటానికి కూడా వారు తిరస్కరించారు. రఘురాం రాజన్ తయారుచేసిన కుంభకోణాలకు పాల్పడిన వారి జాబితాపై ఎలాంటి చర్యలు తీసుకోవటానికి కూడా మోదీ ప్రభుత్వం సిద్ధం గా లేదని, సీబీఐ అధికారులు, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాపోయారు. మోదీ, అతని మద్దతుదారులు ఎన్ని మాటలు చెప్పినా, నిజం ఏమంటే బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్య తీసుకోవటానికి సిద్ధంగా లేరన్నది వాస్తవం. రఘురాం రాజన్ చెప్పిన విషయాలు అటుండగానే మోదీకి 2-జీ కుంభకోణం విషయం దొరికింది. దానిపై ఎంతో రాద్ధాంతం దేశవ్యాప్తం గా జరిగింది. చివరికి జరిగిందేమంటే.. ప్రభుత్వ పాత్ర అంతా అనుమా నాస్పదమే, క్రియాశూన్యతనే. ఆ కేసుపై జరుగాల్సినంత రాద్ధాంతం జరి గి చివరికి అది కోర్టులో పడింది. అది నడిచినడిచి ప్రత్యేక కోర్టులో ఆ కేసులోని 17 నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. 2-జీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ రాజాతో సహా అందరూ నిర్దోషులయ్యారు. ఈ తీర్పుపై రాజకీయవర్గాల్లో తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రభు త్వ తరఫు న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై ఆరోపణలొచ్చాయి. ఆ క్రమంలో 2-జీ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన, ప్రతివాదన లేకుండా వాయిదాల మీద వాయిదా లు పడి చివరికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా బయటకువచ్చారు.

ఈ సందర్భంగానే ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి నాతో అన్న మాటలు ఆసక్తికరమైనవి. అతని మాటల ప్రకారం.. మేం మీడియా హెడ్‌లైన్స్‌ను నిర్దేశిస్తాం, ప్రభావితం చేస్తాం. ఇప్పుడు మోదీకి అది కూడా అవసరం లేదు. బోఫోర్స్ కుంభకోణం విషయంలో అది గాంధీ కుటుంబానికి దగ్గరివారికి సంబంధించినది. 2-జీ కుంభకోణం కూడా ప్రధాని మోదీకి సంబంధించిన వారిది. అంతా నాటకం. కుంభకోణాల విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలన్నీ ఓ డ్రామా. ఒక ప్రదర్శన. ప్రదర్శన ముగిసింది.., ఇప్పుడంతా అయిపోయింది. ఇక్కడే మరో ఆస క్తికరమైన కథ చెప్పుకోవాలి. బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన నీరవ్‌మోదీ ఇక్కడినుంచి ఇంగ్లండ్ పారిపోయి ఇంగ్లండ్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన నిందితుడిగా అతన్ని అరె స్టు చేసి భారత్‌కు అప్పజెప్పాలంటే.. క్రిమినల్ ఫ్రాడ్ విషయాన్ని తెలుపుతూ ఎస్‌ఎఫ్‌ఓ నుంచి ఫిర్యాదును పంపాలని ఎనిమిది నెలల క్రితమే ఇంగ్లండ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. అప్పుడు మాత్రమే నీరవ్ మోదీ పై చర్యలు తీసుకోవటానికి మార్గం సుగమం అవుతుందని ఇంగ్లండ్ తెలిపింది. కానీ భారత ప్రభుత్వం మాట మాత్రంగా ఓ విజ్ఞాపన చేసి కూర్చున్నది. సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఓ) నుంచి అధికారిక విన్న పం పంపే విషయంలో పీఎంఓలో సుదీర్ఘ చర్చలు చేశారు. చివరికి ఆ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు వదిలేశారు. అంతే.. దానిపై ఏ చర్యా లేదు. నీరవ్ మోదీ ఇంగ్లండ్ వీధుల్లో విహారయాత్రలాగా విలాసంగా గడుపుతున్నాడు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ ఉన్నప్పుడు రాఫెల్ కుంభకోణం వ్యవహారంపై లోతైన విచారణ చేప్పట్టాలని సీబీఐని పురమాయించారు.
Swathi-chaturwedi
అం తే.. ఆయనను అర్ధరాత్రి పూట అతని పదవి ఊడిపోయింది. ఇప్పడు.. కేంద్రం సీబీఐ, ఈడీ సంస్థలకు స్వయంప్రతిపత్తిపై మాట్లాడుతూ.., ఆ సంస్థల్లో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను ప్రక్షాళన చేయాలని అం టున్నది. ఈ విషయాలన్నింటిని చూసిన తర్వాత తెలిసేదేమంటే.. మీడియాలో హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా చేసుకున్నంతకాలం ఎవరేమన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అందరూ క్షేమంగా ఉంటారు. మోదీ మాత్రం అవినీతిపరుల భరతం పడుతానని చెప్తూనే ఉంటారు. కానీ అవినీతికి వ్యతిరేకచర్యలు మాత్రం ఆవగింజంతైనా ఉండవు.
(వ్యాసకర్త: ఢిల్లీకి చెందిన జర్నలిస్టు)
ది వైర్ సౌజన్యంతో..

466
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles