నూతన అభివృద్ధి నమూనా

Wed,February 20, 2019 01:02 AM

సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేసి దేశంలో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ట్రెండ్ అనడం కన్నా నూతన అభి వృద్ధి నమూనా దేశానికి చేసి చూపించారనడం సబబు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 40 వేల కోట్లకు పైగా సం క్షేమం కోసం బడ్జెట్ కేటాయించడం సాహసోపేతమైన చర్య. ఈ సందర్భంగా కొందరు సంక్షేమం పద్దు పెరిగిపోతున్నదని ఆం దోళన వ్యక్తం చేయడం విచిత్రమైన విషయం. తాము మాత్రమే బాగుంటే చాలని వారి ఉద్దేశం కావచ్చు. సంక్షేమమే ప్రజాసామ్య వ్యవస్థలో అంతి మ లక్ష్యం. జీవన ప్రమాణాలు, ఆయు ప్రమాణం, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, విద్యా చైతన్యం, వైద్య సదుపాయాలు గృహవసతి, తాగు నీరు, విద్యుత్ మొదలైనవి అభివృద్ధిని సంక్షేమాన్ని ఏక కాలంలో తెలు పుతాయి. సంక్షేమం గురించి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటి ఫండ్ కూడా ఖర్చుపెట్టాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. పారిశ్రామిక అడవుల పెం పకం కూడా సాగాలని స్పష్టంగా పేర్కొన్నది. తరుగుతున్న అడవులను మొత్తం భూమిలో 33 శాతం విస్తీర్ణం ఉండాలని నిర్దేశించుకున్నది. అలా గే నిత్య ఆహారంలో రెండు నుంచి మూడు వేల దాక క్యాలరీలు, ప్రోటీన్స్ పోషకాహారాలు ఉండాలని ప్రమాణాలు నిర్ణయించింది. ఇవే అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనం.

ఉపాధి కల్పన, ఉత్పత్తి, నైపుణ్యాలు సేవా రంగాలు, సంక్షేమ రంగా లు, జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి. కొందరు చెప్పే అభివృద్ధి వేరు. రైళు,్ల రోడ్లు, విమానాశ్రయాలు, కార్లు, ైఫ్లె ఓవర్లు, పరిశ్రమలు, షేర్ మార్కెట్లు అభివద్ధికి చిహ్నం కాదు. అవి అందరికీ సంబంధించినవి కావు. ప్రభుత్వ దవాఖానాలు, తాగునీరు అందరికి కరెంటు, గృహవసతి, విద్యా వైద్య, ఉపాధి, ఉద్యోగం, ఉత్పత్తి నైపుణ్యాలు, డబుల్ బెడ్‌రూవ్‌ు ఇండ్లు, ఆసరా పథకాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ మొదలైనవి ప్రజల నిజ మైన అభివృద్ధికి చిహ్నాలు. ఇలా పేదల ప్రత్యక్ష అనుభవంలో వచ్చేవన్ని అభివృద్ధిలో భాగం. వీరి అనుభవంలోకి రాని అభివృద్ధి అందరికి చెందే అభివృద్ధి కాకపోవచ్చు. నిజానికి తారు రోడ్లు, ప్లై ఓవర్లు, కార్లు, బైకులు, టూరిజం, విమానాశ్రయాలు, పరిశ్రమలు వ్యాపారంలో భాగం. మౌలిక సదుపాయాల పేరిట చేసేవి, చెప్పేవి నిజమైన అభివృద్ధిగా చెబుతుంటారు కానీ అవి పూర్తి అర్థంలో నిజమైన అభివృద్ధి కాదు. సాగు నీరు అందించ డం భూములున్న వారికి ఎంతో ఉపయోగం. తద్వారా పంట పెరుగుతుం ది. కూలీలకు ఉపాధి పెరుగుతుంది. అందువల్ల అది అభివృద్ధిలో భాగం. ఈ దృష్టికోణంతో చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నూతన అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకువచ్చిందో చూసి ఇతర రాష్టాలు, దేశం, ప్రపంచం గమనించింది. అవసరమైన మేర కు తమకు అనువుగా స్వీకరిస్తున్నవి.

నాలుగు సంక్షేమ శాఖల ద్వారా ప్రస్తుతం 740 రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి. వచ్చే జూన్ నుంచి మరో 120 ప్రారంభం కానున్నాయి. మొత్తం కలిసి 840 రెసిడెన్షియల్ స్కూల్లు. వీటిలో మొత్తం విద్యార్థులు పదో తరగతి చేరినప్పుడు 500 మంది చొప్పున 840 రెసిడెన్షియల్ స్కూళ్లలో నాలుగు లక్షల ఇరువై వేల మంది బాలబాలికలు చదువుకుం టారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 7 చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. నియోజకవర్గానికి 20 చొప్పున 119 నియోజకవర్గాలకు, మరి కొన్ని ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు కలిపితే 2400 స్కూళ్లు అయితయి. 12 లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకుంటారు. విద్యార్థికి ఏడాదికి ఒక లక్ష ఇరువై వేల చొప్పున మొత్తం 15 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతాయి. మంచి నాణ్యమైన విద్యతో పాటు పలురంగా ల్లో వారి సృజనను, అభిరుచులను, నైపుణ్యాలను వెలికితీసి ఉన్నతంగా ఎదిగించడం జరుగుతుంది. లక్షా 75 వేల కోట్ల బడ్జెట్‌లో ఇది పది శాతం కన్నా తక్కువే. భవిష్యత్ సమాజ నిర్మాణానికి ఇది పెట్టుబడి. వారి నైపు ణ్యాల అభివృద్ధే దేశాభివృద్ధి. విద్యకు విద్యార్థులకు పెట్టే పద్దు కొందరు వృథా అనుకుంటారు. అభి వృద్ధిలో భాగం కాదనుకుంటారు. ఇది పొరపాటు. ఆ మాటకొస్తే ఐదా రువేల ఉద్యోగాలకు 8 లక్షల మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి చదువు కోసం పెట్టిన పెట్టుబడి వృథానా? ఇలా వృథా అనుకు నేవారికి చేతులు జోడించి నమస్కారం పెట్టి వారి అభివృద్ధిలో, జీతభత్యా ల్లో, లాభాల్లో, ప్రయోజనాల్లో, సౌకర్యాల్లో, సుఖాల్లో, ప్రజల రక్తమాంసా లు శ్రమ శక్తి, నైపుణ్యాలు జీవితాలు ధారపోయడం ఎలా ఉందో లెక్కలు తీసి చెప్పితే తప్పా వారికి అర్థం కాదు.

కనీస కూలీలు, కనీస జీవన ప్రమా ణాలు సమాజంలోని ఇవ్వకపోవడం వల్ల వారికోసం ఆసరా పథకాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, సబ్సిడీ బియ్యం, ఉచిత ఇండ్లు, వైద్యం అం దించడం జరుగుతున్నది. వారి శ్రమ శక్తికి రోజుకు కనీసం రూ. 350-500 ఇచ్చినప్పుడు ఇవి పెద్దగా అవసరం పడవు. సామూహిక బీమాతో రూ.5 లక్ష లు కుటుంబానికి అందించే పథ కం కూడా ఇందులో భాగమే. ఇలా ప్రత్యక్షంగా ప్రజల అభివృద్ధికి జీవన ప్రమాణాలకు ఇవన్నీ తోడ్పడుతున్నాయి. ఇవికాకుండా, వీటిగురించి కాకుండా మాట్లాడే అభివృద్ధిలో ప్రజలకు వాటా అందే అవకాశాల్లేని అభి వృద్ధి అని అర్థం. గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలువడానికి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకంలో ఏదో ఒక లబ్ధి చేకూరింది. ఆ గుర్తింపుతోనే తిరిగి గెలిపించారనేది సుస్పష్టం. మొత్తం అన్ని ఆసరా పథకాలతో 39 లక్షల 20వేల మంది లబ్ధి పొం దుతున్నారు. ఒక్కొక్కరు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సంబంధీకులకు స్ఫూర్తినిస్తున్నారు. భారం తగ్గి వీరి ఆదాయం, వారి ఆదాయం కలిసి జీవ న ప్రమాణాలు పెరుగడంతో పాటు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం, ఆయు ప్రమాణం పెరుగడం జరుగుతున్నది. ఇలా ఈ పథకాలన్నీ వారి జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి పరుచడంలో ఉపయోగపడుతున్నాయి. రెసి డెన్షియల్ స్కూళ్ల ద్వారా ఉన్నత విద్య అందించడం ద్వారా ఆ మేరకు వారి ఖర్చు తగ్గుతున్నది.
ramulu-bs
పిల్లల ఖర్చు తగ్గడమంటే అది ఆదాయం పెరి గినట్టే. ఇలా మొత్తంగా చూసినప్పుడు ఒక కోటి మందికి పైగా ఏదో ఒక ప్రయోజనం ప్రత్యక్ష్యంగా అందుకుంటున్నారు. ఆ గుర్తింపుతోనే గెలిపిం చారు తప్ప ఈవీఎంల ఏమిలేదని లబ్ధిదారుల లెక్క స్పష్టం చేస్తున్నది. కేసీఆర్ సమగ్ర దృష్టి, సమగ్ర అభివృద్ధి దృష్టి, సంక్షేమ దృష్టి, సంశ్లేషణతో ఇవన్ని ఏకకాలంలో సాకారమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధన ఎంతో దూరంలో లేదు.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles