ఉత్తముడి బాటే లోకరీతి


Sun,February 17, 2019 01:47 AM

ఉయద్యదాచరతి శ్రేష్టః తత్తదేవోతరో నరః
సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే..
త్తములైనవారు అనుసరించే మార్గం లోకప్రమాణమై నిలుస్తుంది. అదే కొలబద్దగా తర్వాతి తరాలు దాన్ని అనుసరిస్తాయని భగవద్గీత చెబుతుంది. భగవద్గీతలో చెప్పింది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సరిగ్గా సరిపోతుంది. నెత్తురు చుక్క చిం దించకుండా, శాంతిమార్గంలో సాగించిన రాష్ట్ర సాధనోద్యమం నుంచి మొదలు నేడు పాలనలో అవలంబిస్తున్న విధానాల వరకు అన్ని విశ్వవ్యాప్తమవుతున్నా యి. అనేక రాష్ర్టాల్లో రాష్ట్ర విభజన ఉద్యమాలు కూడా జరిగాయి. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా జరిగింది. అప్పుడు అది రక్తసిక్తమైంది. కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమం భిన్నంగా జరిగింది. ఉద్యమ కమాండర్‌గా కేసీఆర్ నిలువడంతోపాటు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉద్యమం పక్కదారి పట్టకుండా చూశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను చేపట్టిన వారు దాని ఫలితాన్ని అందుకోవడం అరుదుగా జరుగుతుం ది. కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర ఉద్యమ ఆకాంక్ష లు నెరవేరడం స్వయంగా చూడగలిగారు. దేశానికి తెలంగాణ ఇప్పుడొక రోల్‌మోడల్. ఉద్యమాలు చేసేవారికైనా.. పాలన చేయాలనుకున్న వారికైనా ఇదో అధ్యయన కేంద్రం. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వమే. 2001లో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడిగా మొదలుపెట్టారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, అటుకులు బుక్కిన.. అన్నం తిన్న తెలంగాణ ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నా రు. రాజకీయంగా కేసీఆర్ చరిత్ర పరిసమాప్తమంటూ నాటి ఏలికలు మాట్లాడారు.

కానీ, అన్నింటిని తట్టుకొని తాను నిలబడటమే కాదు.. తల్లి కోడి పిల్లకోడిని కాపాడుకున్నట్టు తెలంగాణ ప్రజలను, ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడిండు. ఇదంతా ఆషామాషీగా జరుగలేదు. టీఆర్‌ఎస్‌ను నిలువునా చీల్చాలన్న పన్నాగాలు ఒకవైపు.. ఉద్యమం బలహీనపడిందని సూత్రీకరించే ప్రయత్నం మరోవైపు, పదవుల కోసమే జరుగుతున్న ఉద్యమంగా చిత్రీకరించే కుయుక్తి ఇంకోవైపు.. ఇలా అన్నింటిని తట్టుకొని తెలంగాణను ఒడ్డున పడేశాడు. రాష్ట్ర సాధనొక్కటే ఎజెండాగా కదిలిన ఏకైక ఉద్య మ పార్టీ టీఆర్‌ఎస్. 2001 నుంచి ఎన్నికలు ఏవైనా.. తెలంగాణ రాష్ట్ర సాధనొక్కటే మ్యానిఫెస్టో. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ తన పాత్రను మరువలేదు. ఈనగాచి నక్కల పాలు చేయవద్దన్న ప్రజల ఆలోచనల మేర కు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టింది. మార్పుతోపాటే తనను తాను మార్చుకున్నపుడు విజేతగా నిలువడం సాధ్యమవుతుంది. ఆవిర్భావం తర్వాత తెలంగాణ తనను తాను మలుచుకున్నది. ఇలా మలుచుకోవడంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికతదే కీలకపాత్ర. తెలంగాణకు ఆయనే చోదకశక్తి. 60 ఏండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ ఏర్పడితే కారు చీకట్లు తప్పవంటూ విశ్లేషించిన వాళ్లున్నారు. ఆర్థికంగా తెలంగాణ ఏర్పాటు నష్టమని, ప్రజలు తెలంగాణ ఎందుకు ఏర్పడిందని బాధపడే రోజు వస్తుందని జోస్యం చెప్పినవారున్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమ గరిమ ఉన్నవాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటమే తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచింది. 2014 జూన్ 2న కేసీఆర్ కాకుండా మరొకరు ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది నిస్సందేహం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మ.

ఆయన ఆలోచన, ఆచరణ అంతా తెలంగాణమే. తెలంగాణ ప్రజల అవసరాలేమిటో.. ఆకాంక్షలేమిటో స్పష్టంగా తెల్సిన మహానాయకుడు కేసీఆర్. తెలంగాణను బంగారు తునకగా మార్చుకుంటామని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారు. నాడు ఏం చెప్పాడో.. ఇప్పుడు అదే ఆచరణలో పెడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తున్నారో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఉమ్మడిపాలనలో తెలంగాణ పీఠభూమి అని, ఇక్కడ నీరు పరుగుపెడుతుందని చెప్పి తమ ప్రాంతానికి నీటిని మళ్లించారు. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ నీటికి నడక నేర్పించారు. కాళేశ్వరమైనా, మేడిగైడ్డెనా, పాలమూరులోని ప్రాజెక్టులైనా రికార్డు సమయంలో నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి. మిషన్ కాకతీ య పేరుతో చెరువుల పునరుజ్జీవం చేశారు. గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ మెడలో నీళ్ల హారాన్ని మలిచారు. నాలుగేండ్లలోనే తెలంగాణకు గట్టి పునాది వేశారు. నియామకాల విషయంలో నూతన ఒరవడి సృష్టించారు. ద్విముఖ వ్యూహంతో వెళ్లారు. ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ద్వారా నాలుగేండ్లలో వేలాది కొలువులను అందించారు. ఇక పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, గురుకుల టీచర్ల బోర్డు.. ఇలా అనేక విధాలుగా పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు. లక్షమందికి పైగా ఇలా ఉద్యోగాలు పొందినవారుంటారు. మరోవైపు ప్రైవేట్ రంగం లో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించారు. ఐటీ, ఇతర పరిశ్రమల్లో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం మూడులక్షల మందికి పరిశ్రమల్లో కొత్తగా ఉద్యోగాలు లభించాయి. ఇదో రికార్డు. ఇదేకాకుండా సర్వీసు, నిర్మాణరంగం తదితర వాటిల్లో లెక్కలేనంతమందికి అవకాశాలు వచ్చాయి.

నిధుల విషయంలో కూడా కేసీఆర్ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. ఆర్థికశాఖను ఔపోసన పట్టారు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఆరోవేలుగా ఉన్న సంక్షేమాన్ని ఇప్పుడు ప్రధాన విభాగంగా మార్చారు. అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వానికి జోడెద్దులు. ఈ రెండు రంగాలకు సమాన స్థాయి లో నిధులు ఇచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు దేశానికి మార్గం చూపించాయి. రైతుబంధు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఆర్థిక, వ్యవసాయరంగంలో అనుభవం గడించినవారితో సహా ప్రతి ఒక్కరి మన్ననలు పొందింది. ఇప్పుడు దేశ ఎన్నికల్లో ఇదే పెద్ద నినాదమైంది. తెలంగాణ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా దాదాపు అన్నిపార్టీలు కాపీకొడుతున్నాయి. బెం గాల్, ఒరిస్సా తదితర రాష్ర్టాలు యథాతథంగా తీసుకొని అమలుచేస్తున్నా యి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా రైతుబంధు తరహాలోనే కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. కేంద్రంలోని అనేక పథకాలకు కేసీఆర్ పథకాలు ప్రేరణగా ఉన్నాయి. సంపద పెంచడమే కాదు.. వాటిని సమాజానికి పంచడమే లక్ష్యం. అలా అయితేనే సమాజంలోని అన్నివర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. గ్రామాల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల అభ్యున్నతికి సంబంధించి శాసనసభలో చెప్పారు. యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపల సాగు, చేతి వృత్తిదారులకు హామీలు లేకుండా ప్రోత్సాహాక రుణాలు, పేదలకు ఉచితంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు.. ఇలా సుమారు 500 పథకాలున్నాయి. అన్నింటి లక్ష్యం తెలంగాణ సమాజాభివృద్ధే. ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తేవడమే. ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు చేరడంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉపయోగపడిం ది.
satish
పథకాల గ్రౌండింగ్ అంటే గత ప్రభుత్వాల హయాంలో అధికారులకు కాసుల పంటే. అవినీతి కూపం ఉండేది. ఇప్పుడు ఒక్కరూపాయి కూడా లంచం ఇవ్వకుండానే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. పాలనలో పారదర్శకత తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. నాలుగున్నరేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో రాజకీయంగా టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంపై ఈషనాణ్మాత్రపు అనుమానాలు ఎక్కడో ఉం డేవి. కానీ, నాలుగున్నరేండ్లలో తన కార్యసాధనతో తెలంగాణ ప్రజలతోపాటు దేశాన్ని కేసీఆర్ మెప్పించారు. అందుకే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో దేశం నిబిడాశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ యావత్ తెలంగాణ కేసీఆర్ వెనుక నిలిచింది. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. ప్రజల కోసం పనిచేస్తే ప్రజ ల్లో నిలిచిపోతావన్న అంబేద్కర్ మాటల్లోని స్ఫూర్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌లో కనిపిస్తుంది. ఆయన తన కోసం జీవించడం లేదు. ప్రజల కోసం పని చేస్తున్నారు. తెలంగాణ పునాదులను పటిష్టం చేసే మహాకార్యాన్ని ఆయన తన భుజస్కంధాలపై వేసుకున్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగుతున్నారు. ఆయన మార్గం అనుసరణీయం. అందుకే తెలంగాణ యావత్తు ఆయన పాలననే మరోసారి కోరుకున్నది. ఇప్పుడు దేశం చూపు కూడా తెలంగాణ వైపే ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మొదలుపెట్టిన ప్రయత్నం కూడా కచ్చితమైన ఫలితాన్నిచ్చి తీరుతుంది. దేశానికి మార్గనిర్దేశం చేసే శక్తియుక్తులన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్నా యి. కేసీఆర్ పాలనే దీనికి గీటురాయి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయా లు తెలంగాణ కేంద్రంగానే జరుగుతాయనడంలో సందేహం లేదు.

1009
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles