దేశానికే రైతుబంధు

Thu,February 14, 2019 01:14 AM

యావత్ దేశం నేడు తెలంగాణ వైపు చూస్తున్నది! నిన్నటి వర కు రైతును, వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రధాని నరేం ద్ర మోదీని కూడా నాగలి కాడి పట్టించిన మన సీఎం కేసీఆర్‌కు దేశ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం గా, సమగ్ర వ్యవసాయ ప్రగతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతున్నది. దేశంలోనే ఏ నాయకుడూ ఊహించని రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రం లో నీటి పారుదల ప్రాజెక్టులు ప్రారంభించి వ్యవసాయాన్ని జాతీయ అజెండాగా మార్చారు కేసీఆర్. దేశానికే దశను, దిశను చూపించగలిగిన నాయకునిగా పలు నాయకుల నుంచి మన్ననలు పొందుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ బాటలో ఒరిస్సా, బెంగాల్ ప్రభుత్వాలు రైతుబంధును అమ లుచేస్తున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు తెలంగాణను అనుసరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరికి ప్రధాని మోదీ కూడా రైతుబం ధు తరహాలో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి కేసీఆర్ బాటలో నడువక తప్పలేదు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. పల్లెలన్నీ వ్యవసాయం ఇరుసుగా జీవనం కొనసాగిస్తున్నవే. రాష్ట్రంలో ప్రధాన పంట వరి. దాంతోపాటు మక్కజొన్న, పత్తి, సోయా, వేరుశనగతో పాటు కంది, పెసర, మినుములు వంటి పప్పుధాన్యాలను కూడా విరివిగా పండిస్తారు. అందుకోసమే వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తు న్నది కేసీఆర్ ప్రభుత్వం.

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యకమ్రాలు దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉండేదో గుర్తుకొస్తే గుండె తరుక్కపోతున్నది. నాటి పాలకులు నీటి ప్రాజెక్టులు చేపట్టలేదు. చెరువుల మరమ్మతులు చేయలేదు. రైతు సంక్షేమం, అభివృద్ధి పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరించడంతో తెలంగాణ ప్రాంతం కాటకాల కోనగా మారి పోయింది. కానీ, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం అన్న పదానికి అర్థమే మారిపోయింది. రైతు అనే పదానికి పరమార్థం చేకూరింది. వ్యవసాయం అంటే మట్టి కాదు, రైతన్న చేతిలో విత్తనమై మొలకెత్తే జాతి సంపద. మన దేశంలో వ్యవసాయం ఒక ఉద్యోగం కాదు, అదో జీవన విధానం. ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాకుండా ఆచరణలో పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్. వడ్డీ వ్యాపారస్థుల చేతుల్లో విలవిలలాడుతున్న రైతులను రుణ విముక్తులను చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే నాలుగు విడతల్లో రూ.లక్ష వరకు రైతుల రుణాల ను మాఫీ చేశారు. వానలు పడగానే రైతును వేధించే సమస్య విత్తనాల కోసం, ఎరువుల కోసం అప్పు చేయడం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొ ని తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అసాధారణ పథకం రైతు బంధు. ఈ పథకం యావత్ దేశానికి మార్గదర్శకత్వం వహించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై అపూర్వ ప్రశంసలందుకున్నది. ఈ పథకం కింద రైతుల కు ఏడాదికి రెండు విడుతలుగా ఎకరానికి రూ.8 వేలు అందిస్తున్నది. వ్యవసాయానికి కావాల్సింది అత్యంత అవశ్యకమైనది కోతల్లేని నాణ్యమైన విద్యుత్.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఏర్పడిన వెం టనే కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అనతికాలంలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని రైతాంగానికి మొదట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఇది దేశ చరిత్రలోనే అరుదైన సంఘటన. తెలంగాణలో సాగునీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచి, వ్యవసాయ ఉత్పత్తులను స్థిరీకరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ అన్న నినాదాన్ని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పం గా తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రం గంలో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి ప్రధాన నదులపై మూడు భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు రంగారెడ్డి వంటి మూడు భారీ ప్రాజెక్టులే కాకుండా మరికొన్ని మధ్యత రహా ప్రాజెక్టులను కూడా వేగవంతంగా పూర్తిచేస్తున్నది.

దీనికో సం ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లను కేటాయిస్తున్నది. ఒకవైపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే రాష్ట్ర వ్యవసాయంలో తరతరాలుగా ముఖ్యపాత్ర నిర్వహిస్తున్న చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నది. మరో చరిత్రాత్మ క పథకం రైతుబీమా. రైతులు ప్రమాదవశాత్తు, ప్రకృతి వైపరీత్యాల వల్ల, సహజంగా మరణించినా పథకం కింద రూ.5 లక్షలను రైతు కుటుంబానికి అందజేస్తున్నది. తెలంగాణ సర్వతోముఖ వికాసంలో వ్యవసాయానిదే అగ్రాసనం. అందరికీ అన్నం పెట్టే రైతును అగ్రపీఠంపై కూర్చోబెట్టాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తు న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం చేయడానికి నడుం కట్టింది. ఏటా బడ్జెట్‌లో వ్యవసాయానికి నిధులు కేటాయిస్తున్నది. ఈ కేటాయిం పులను ఏటా పెంచుకుంటూ పోతున్నది. బడ్జెట్‌లో 26 శాతం నిధులు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది మన తెలంగాణ రాష్ట్రమే.
veerendra
ఉమ్మడి రాష్ట్రం లో 2013-14 బడ్జెట్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు కేటాయించింది 4,040 కోట్లు మాత్రమే. అందులో తెలంగాణ వాటా 1697 కోట్లు మాత్రమే. కానీ, స్వరాష్ట్రం ఆవిర్భవించినాక 2017-18 వ్యవసాయానికి 37,968 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ స్పందనకు అనుగుణంగానే రైతాంగం కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు 2017-18 సంవత్సరంలో 100 లక్షల టన్నుల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంకల్పం ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదనట్లు మన వ్యవసాయరంగ అభివృద్ధి చూస్తే అర్థమవుతున్నది. ఎత్తయిన తెలంగాణ భూములకు కృష్ణా, గోదావరి నదుల నీళ్లు అందవన్న సీమాంధ్ర పాలకుల వితండ వాదనకు సమాధానమే కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, పెద్ద, మధ్య తరహా నీటి ప్రాజెక్టులను సుమారు లక్షన్నర కోట్లతో చేప డుతున్నది. సకలజన సంక్షేమం కేసీఆర్ లక్ష్యం. వ్యవసాయాన్ని స్వర్ణయుగం చేయడం కేసీఆర్ స్వప్నం! తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కేసీ ఆర్ సంకల్పం! శత కోటి జనాభా కలిగిన భారతదేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలుపడమే కేసీఆర్ ఆశయం..!!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)

493
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles