ప్రజాసంక్షేమం కోరని జాతీయపార్టీలు

Tue,February 12, 2019 10:50 PM

జాతీయ పార్టీలు, తమ పార్టీ నాయకుల బాగు కోసమే కానీ, దేశ ప్రజల మేలు కోసం ఏ మాత్రం కృషిచేయడం లేదనే ఆరోపణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకూ వర్తిస్తాయి. అధికారాన్ని కాపాడుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్న జాతీయపార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడే జిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి. గత నెలరోజుల్లో జరిగిన రెండు సంఘటనలు, మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చూస్తే సగటు భారతీయునికి అర్థమవుతుంది. గత డ్బ్భై ఏండ్లలో మారని రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల గొడుగు కిందనే ఉన్న ఈ రెండు జాతీయపార్టీలు స్వలాభం కోసమే ఒకరిపై మరొకరు నిం దలతో కాలం గడుపుతున్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం అంటూ అరుచుకునే ఏ రాజకీయ నాయకుడూ అధికారంలో ఉండగా, ప్రత్యర్థిపై ధైర్యంగా చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశాన్ని ఏలిన పార్టీలన్నీ దేశ ప్రయోజనాల కన్నా, పార్టీల ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యం ఇచ్చాయి. మారి న ప్రపంచ రాజకీయ, ఆర్థిక మార్కెట్‌శక్తులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దగల నైపుణ్యం, ముందుచూపు ఉన్న స్వతంత్ర నాయకత్వం ఇప్పుడు దేశానికి అవసరం. కుల, మత, ప్రాంతీయ తత్వాలతో రాజకీయాలను భ్రష్ఠు పట్టిస్తున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు లేని కొత్త రాజకీయశక్తిని ముందుకు తీసుకపోవాలి. రాజ్యాంగస్ఫూర్తి అయిన ఫెడరల్ భావనకు చిల్లులు పొడుస్తూ, కేంద్రీకృత పాలనతో రాచరికాన్ని తలపించే కేంద్ర పాలనకు అంతం పలుకాలి. స్వతంత్ర పాలనకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ప్రాంతీయపార్టీలన్నీ ఏకమై, నూతన భావజాలాన్ని ఆవిష్కరించుకోవాలి.

స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకొన్న రాజకీయ వేదిక అయిన కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన, ఆ సిద్ధాంతాలను విభేదించిన వారి ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడిన రాజకీయపార్టీలే ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉంటున్నాయి. గాంధీ-నెహ్రూల శాంతి, సామ్యవాద సిద్ధాంతాలను విభేదించిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, రావ్‌ు మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ లాంటి నాటి నాయకులు వారివారి ఆలోచనల కు అనుగుణంగా కాంగ్రెస్‌తో విభేదించి కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేసి న రాజకీయపార్టీలు నేడు బీజేపీగా, సమాజ్‌వాదీపార్టీగా, రాష్ట్రీయ లోక్ దళ్‌గా మరో పార్టీగానో అవతరించాయి. ఈ నేతలు ఎన్నో ఉన్నతమైన, మానవీయమైన, భారతీయత ఉట్టిపడే ఆలోచనలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. వారు, వారి శిష్యగ ణం ఏర్పాటుచేసిన పార్టీలు, ఈరోజు మనుగడలో ఉండి, అధికారం కోసం ఇప్పటికీ తహతహలాడుతున్నాయి. కానీ ఆ మహానుభావుల ఆలోచనలకు అనుగుణంగా, నేటి యువతను ఉత్తేజపరిచే నూతన భారత ఆర్థిక సిద్ధాంతాలను కానీ, ప్రణాళికలను కానీ ప్రతిపాదించే స్థితిలో లేకపోవడం విచారకరం. ఏ లక్ష్యం కోసమైతే అన్నిరకాల సిద్ధాంతాలను, లక్ష్యాలను పక్కనబెట్టి, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ, దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతారని భావించిన జనతా పార్టీ నాయకులు ఆరు నెలల్లో తమ పంతాలకు పెద్దపీట వేసి ముక్కలుగా చీలిపోయారు. ఇందిరాగాంధీపై వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధించాలనే ప్రయత్నంలోనే చీలిపోయి 16 నెలల్లో అధికారానికి దూరమవడమే కాకుండా, ఇందిరాగాంధీకి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనతాపార్టీ చూపిన దారిలోనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మామూలు ప్రభుత్వ శాఖలుగా మార్చుకు న్నది. తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పి, కేసులు నమోదు చేయిం చి, బెదిరించి తమదారికి తెచ్చుకొనే కొత్త దారులను కనుగొన్నది. అప్పటి నుంచి అధికార పార్టీలకు అణిగిమణిగి ఉండే నాయకుల అవినీతి ఎంత పెద్దదైనా ఏ దర్యాప్తు సంస్థ ఒక్క కేసు పెట్టదు.

దేశంలోనే అత్యంత ప్రతి ష్ఠాత్మకమైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ, ఐటీ శాఖ లాంటివి కూడా 1980 తర్వాత తమ ప్రభావాన్ని కోల్పోయాయి. మధ్యమధ్యలో కొన్ని కేసుల్లో వాటి శక్తిసామర్థ్యాలు బయటపడినా రాజకీయ నాయకులపై పెట్టి న కేసులు దశాబ్దాల తరబడి సాగాయి. దీనివల్ల ప్రజాధనం దుర్వినియో గం తప్పా ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజస్థాన్, హర్యానాల్లో అనేక ఆస్తులను అక్రమంగా సంపాదించాడని కేసులు నమోదు చేశాయి. కానీ ఈ కేసులు రాబర్ట్ వాద్రాను నిందితునిగా తేల్చి శిక్షించలేకపోయాయి. యూపీఏ ప్రభుత్వ హయాం లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల్లో లంచాలు తీసుకొని, ప్రభుత్వంలో తనకున్న పరపతి తో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించాడని, ఆ సొమ్ముతో ప్రభు త్వ నిబంధనలకు వ్యతిరేకంగా, మనీ లాండరింగ్ ద్వారా విదేశాల్లో తన పెట్టుబడులతో ఆస్తులు సంపాదించుకొన్నాడని కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. దీనికి కొంతమంది వ్యాపారవేత్తలు సహకరించారనేది ప్రాథమిక ఆరోపణ. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కొన్ని కొత్త కేసుల్లో ఇది ఒకటి మాత్రమే ఉదాహరణ. వందలాది రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసులు అటు సుప్రీంకోర్టులో, ఇటు సీబీఐలో కొనసాగుతున్నాయి. ఇంకా ఐటీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ వారి కేసులు వీటికి అదనం. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టి పారి పోయిన వ్యాపార సంస్థల యజమానులు ఎందరో. వారి కేసుల్లో రాజకీయ నాయకుల ప్రమేయాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు.
prabhakar
ఎందుకంటే నాయకులకు, అన్నిపార్టీలకు వాణిజ్య, వ్యాపారవేత్తల నుంచి ఎన్నిక ల నిధుల అందడం మామూలే. అందుకే వారికే మరిన్ని కొత్త పథకాల ద్వారా ప్రజాధనాన్ని, బ్యాంకుల ద్వారా, న్యాయబద్ధంగా అందించడానికి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల కోసమే తమ పథకాలకు మహాత్మా గాంధీ పేరును పెట్టుకున్నాయి. నేటి అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పథకాలను రూపొందించుకోగల సిద్ధాంతాల ప్రాతిపదిక లేదని ఈ రెండు పార్టీల పాలన నిరూపించింది. అందుకే ప్రాంతీయ పార్టీ ల సమ్మేళనంగా కొత్త ఫెడరల్ కూటమి ఆవశ్యకత అత్యాశ కాదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)

573
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles