‘భారత కోకిల’ను స్మరించుకుందాం!


Tue,February 12, 2019 10:50 PM

sarojini-naidu
దేశంలో రజియా సుల్తానా నుంచి సరోజినీనాయుడు వరకు పురుషాధిక్యతను అధిగమించి వివిధరంగాల్లో రాణించారు. అనేక సమస్యలను సమర్థవంతం గా ఎదుర్కొని ప్రముఖులుగా పేరుపొందిన వారిలో భారత కోకిల సరోజినీనాయుడు ఒకరు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెంది న సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న జన్మించారు. సరోజినీనాయుడు మంచి రచయిత్రి. ఆమె తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులవడం వల్ల ఆమెకు బాల్యం నుంచే విద్యాపరమైన గట్టి పునాదులు ఏర్పడినాయి. సరోజినీ నాయుడు మాతృభాష బెంగాలీతో పాటు, ఆంగ్లభాష అనర్గళంగా మాట్లాడేది. ఆంగ్లంలోనే మంచి సందేశాత్మక కవితలను చిన్నతనం నుంచే రాయడం ప్రారంభించారు. తన 13వ ఏట లేడీ ఆఫ్ లేక్ పేరుతో 1300 పంక్తులతో రచన చేసి సంచలనం సృష్టించింది. సరోజినీ రచనలను ప్రముఖ ఆంగ్లభాషా విమర్శకులు ఆర్థర్‌సైమన్స్, ఎడ్వర్ గూస్‌లు చదివి ఆమెను అభినందించారు.

సరోజిని ది బర్డ్ ఆఫ్ టైవ్‌ు, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్ వంటి కావ్యాలు రచించారు. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సహకారం తో ఆమె ముత్యాల గోవిందరాజులు నాయుడిని కులాంతర వివాహమాడింది. భారత జాతికి కులం పెద్ద అడ్డుగోడ అని తరచూ చెప్తూ ఉండేది. ఆమె రాసిన లేఖల్లో తన వ్యక్తిగత విషయాలకన్నా, సామాజిక సమస్యలనే ఎక్కువగా ప్రస్తావించేది. గాంధీజీ ప్రారంభించిన మూడు ముఖ్య ఉద్యమాలైన సహాయనిరాకరణ (1921), ఉప్పు సత్యాగ్రహం (1930), క్విట్ ఇండి యా (1942)లకు ఆమె ప్రత్యక్షంగా మద్దతునిచ్చింది. సరోజినీకి హైదరాబాద్ నగరం తో ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆమె కవిత నైట్ ఫాల్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ చదివితే సంధ్యా సమయంలో ఆ నగరం ఎలా ఉంటుందో మన కళ్ల ముందు నిలుస్తుంది. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తనయగా నేటితరం అమ్మాయిలకు సరోజినీ ఆదర్శనీయం.
- ఎం.రాంప్రదీప్
(నేడు సరోజినీ నాయుడు జయంతి)

1050
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles