రాష్ర్టాభివృద్ధిలో మన కార్మికులు


Tue,February 12, 2019 01:21 AM

తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటి నుంచి నాకో అనుమా నం మన కార్మికులెక్కడ? అని. ఈ మధ్య 2, 3 రోజుల కిం దటే పత్రికల్లో వార్త. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి సుమారు 14 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణాల్లో తదితర కార్యక్రమాల్లో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారని. మరి మన తెలంగాణ కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారు? తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా భవన నిర్మాణంలో బీహార్ రాష్ట్ర కార్మికులే కనిపిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు భవనా ల్లో వడ్రంగి పని చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. రాజస్థాన్ కార్మికులు భవనాల్లో బండపరిచే పనిచేస్తున్నారు. ఇక్కడో చిన్న ఉదాహరణ. మొన్న దసరా ముందు ఒకపనిపై కలకత్తా వెళ్తుంటే రైలు మొత్తం దాని పరిమితి కంటే 2, 3 రెట్ల కార్మికులు హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్తున్నారు. పండుగ తర్వాత తిరి గివచ్చి తమ తమ కార్యాల్లో నిమగ్నమవుతున్నారు. దీంట్లో చాలామంది సినీ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారని వారితో మాట్లాడితే తెలిసింది ముచ్చట. ఇప్పుడు కాదు, గత పదేండ్లుగా చూస్తున్నా. తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తు న్న నిర్మాణ కార్మికులంతా బీహార్, మధ్యప్రదేశ్, యూపీ కార్మికులే. ఇప్పటికీ ఉన్నారు. ఇటుక కార్మికులంతా ఒరిస్సా వారే. గత ముప్ఫై ఏండ్లుగా చూస్తుంటే తెలిసిందేమంటే తెలంగాణలో ఈ పనులన్నీ ఇతర రాష్ర్టాల కార్మికులే చేస్తున్నారు. సరే మరి మన తెలంగాణ కార్మికులెక్కడ? ఇక్కడి వడ్డరి, కమ్మరి, కుమ్మరి, మేదరి, చాకలి, నిర్మాణ కార్మికులు ఎటు వెళ్లారు? అందరూ కార్మిక స్థితి నుంచి కాంట్రాక్టర్లుగా మారారా? అలా మారితే అభివృద్ధి చెందితే సంతోషమే. కానీ మొత్తం 3 కోట్ల పై చిలుకు ప్రజానీకంలో కనీసం 2 కోట్ల మంది ఈ వర్గానికి చెందిన వారుంటారు. వారందరూ అభివృద్ధి చెందారా? అందులో కొందరు చదువుకొని విద్యావంతులై ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో చేరారా? కొందరు చేరారు.

అంతా కలిసి లక్షన్నర లోపే. అందరికి నిజంగా ఉపాధి దొరికి ఉంటే ఇక నిరుద్యోగిత ఎక్కడ? మరి కోటిన్నర జనం ఎక్కడ? కొం దరు వ్యవసాయంలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మనం నేరు గా చూస్తున్నాం కూడా. వీరు 40, 50 లక్షలకు మించరు. మిగితా వారు చిన్నా పెద్ద వ్యాపారాలు చూసుకుంటున్నారనుకున్నా ఇంకా 12 వేల పైచిలుకు గల గ్రామాల్లో కనీసం 30, 40 లక్షల మంది తెలంగాణ అంతటా జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తున్నవారుంటారు. అక్షరాస్యత 60 శాతం దాకా ఉంది కాబట్టి ఇందులో 18 నుంచి 20 లక్షల మంది చదువుకున్న వారై ఉంటారు. మిగతా చదువుకోనివారు ఏం చేస్తున్నారు? చదువుకున్నవారు కొంతమంది విదేశాల బాట పడుతున్నారు. వీళ్ల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీళ్లు నానా యాతనలు పడుతున్నారు గల్ఫ్ దేశాల్లో. కేటీఆర్, కవితలు వీళ్లను విదేశాల నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు. హైదరాబాద్ ఫుట్‌పాత్‌ల మీద బతికేవాళ్లు ఎక్కువమంది. ఫుట్‌పాత్‌లు ఖాళీచేస్తే వారి బతుకు ఖాళే. ఇదిలా ఉంచితే ఈ పనిలేనివారు ఏం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో 500 నుంచి 1000 మంది దాకా 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారుంటా రు. వీరంతా డిగ్రీలోపు చదువుకున్నవారే. వీరిలో కొంతమంది తమ తమ కులవృత్తులు చేస్తున్నారు. ఇది నచ్చనివారు, ఇంకో పని దొరుకక ఊరికే ఉంటున్నారు. వీళ్లంతా ఖాళీగా తిరుగుతున్నారని నమ్మదగ్గ నిజం. తెలంగాణ మొత్తంలో ఉన్న ఈ కోటి కోటిన్నర మందికి తెల్లకాలర్, ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకడం అసంభవం. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ నిజాన్ని గ్రహించాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానంటుంది. చాలామంచిదే. కానీ వారిని వట్టిగా విడిచి భృతి ఇవ్వవద్దు, వీళ్లను ప్రభుత్వ కార్యాలయాల్లోనో, నిర్మాణ కార్యక్రమాల్లోనే వారితో పనిచేయించి ఈ భృతి ఇవ్వాలి. ప్రతి నెల సర్టిఫికెట్, ఫలానా వ్యక్తి ఫలా నా ఆఫీసులో, ఫలానా నిర్మాణంలోనే పనిచేస్తున్నాడనే ధృవీకరణతో భృతి ఇవ్వాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు లభిస్తాయి.
c-hanmanth-rao
వారికి అనుభవం కూడా వస్తుంది. లేకుంటే ఈ సౌకర్యం దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గత డ్బ్భై ఏండ్లుగాఎవ్వరూ చేయలేని పనులు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. నేను అరువై ఏండ్లుగా చూస్తున్నా... నిత్యం ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే నాయకుడు నాకిప్పటికీ కనిపించేలేదు, ఒక్క కేసీఆర్ తప్పా. ఏ ప్రభుత్వమైనా కంటితుడుపుగా రాజ్యాలేలి తమ కుటుంబాలను బాగు పరుచుకున్నాయి తప్ప, ఒరగబెట్టిందేమీ లేదు. కేసీఆర్ ఇచ్చే రాయితీలు బాగా ఉపయోగపడుతున్నాయి. యువత ఎక్కడివారు అక్కడే స్థిరపడితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ప్రయత్నాలు చేసి ఉన్నత వ్యాపారాలు చేసుకోవాలి. ప్రజలు పైకి వస్తే అం దరూ సంతోషిస్తారు. ఎప్పుడు అధికారం వస్తుందా? ఎప్పుడు దోచుకుందామా అని నక్కలు కాచుకుంటున్నాయి. తెలంగాణీయులం మనం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. బాగుపడినాక పై దొంగలు మనల్ని ఏం చేయలేరు.

765
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles