నాణ్యమైన విద్య అందించాలి


Wed,January 16, 2019 11:05 PM

విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి అనేక అధ్యయనాలు చాలా విషయాలు వెల్లడించాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం ఎంతో ముందుకు పోతున్నది. కానీ ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న పిల్లలు చదవడం, రాయడంలో వెనుకబడుతున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని వాస్తవం. అయితే ప్రాథమిక స్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యాశాఖ అధ్యయనం చేయాలి. వాళ్లు ప్రాథమిక విద్యను పూర్తి చేసే సరికి చదవడం, రాయడం లాంటివే కాకుండా అన్ని సబ్జెక్టుల్లో రాణించడానికి కావాల్సిన నైపు ణ్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి.
-పి. ఆంజనేయులు, కరీంనగర్

విభజన సమస్యలు పరిష్కరించాలి

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాష్ట్ర విభజన సమస్యలు ఇప్పటికీ అనేకం అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని మాటలకే పరిమితం కావద్దు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ పరిశీలించి పరిష్కరించాలి.
-సి. శ్రీనివాస్, మహబూబ్‌నగర్

పెరుగుతున్న ధ్వని కాలుష్యం

నగరాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువ అవుతున్నది. వాహనదారు లు అవసరం లేకున్నా సిగ్నల్స్ దగ్గర అదేపనిగా హారన్ మోగిస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ అధికారులు దృష్టి సారించకపోవడం శోచనీయం. ఫ్రీ లెఫ్ట్ లాంటివి కూడా బ్లాక్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.అలాగే ధ్వని కాలుష్యం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
-బి. తిరుపతి, హైదరాబాద్

388
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles