WEDNESDAY,    October 18, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
8/14/2016 12:20:13 AM

స్నాతకోత్సవ సంబురం

శేరిలింగంపల్లి, ఆగస్టు 13: గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిపుల్‌ఐటీ) 15వ స్నాతకోత్సవం శనివారం బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో కనుల పండువగా జరిగింది. ఈవేడుకలకు ప్రముఖ యూటీవీ గ్రూప్, స్వదేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రోనీ స్క్రేవాలా హాజరై వివిధ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పట్టాల ప్రదానం అనంతరం విద్యార్థులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. విద్యార్థులంతా తెల్లటి ఖాదీ ఖుడ్తా, పైజామా, పంజాబీ డ్రెస్‌లు, చీరల హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజిరెడ్డి, త్రిపుల్‌ఐటీ డైరెక్టర్ పీజే.నారాయణ, అకాడమిక్స్ డీన్ స్రవంతిశివస్వామి, ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ రామచర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
440
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd