TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
9/13/2015 4:34:47 AM

పోటాపోటీగా నాటికలు

రవీంద్రభారతి, సెప్టెంబర్12: వైవిధ్యభరితమైన సామాజిక ఇతివృత్తాలతో ప్రదర్శించిన నాలుగు నాటికలు పోటాపోటీగా సాగాయి. రవీంద్రభారతిలో యువకళావాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ పోటీల్లో భాగంగా రెండో రోజు శనివారం సైకత శిల్పం, సౌందర్య భారతం, పెళ్లి చేసి చూడు? అనగనగా.. నాటికలు ప్రదర్శించారు. అనంతరం రంగస్థల ప్రముఖులు నల్లూరి వేంకటేశ్వర్లు, కాకరాల, కల్యాణిలను ఘనంగా సత్కరించారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సినీదర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ నటులు టి.చలపతి రావు, దర్శకులు ముత్యాల సుబ్బారావు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, రంగస్థల ప్రయోక్త డా.మొదలి నాగభూషణ శర్మ అతిథులుగా పాల్గొన్నారు. ఆదివారం దత్త స్వీకారం,నిర్ణయం,రెండు నిశ్శబ్దాల మధ్య నాటికల పోటీ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే ముగింపు సమావేశంలో సినీ నటుడు సాయి కుమార్‌కు అక్కినేని జీవన సాఫల్య పురస్కార ప్రదానం, బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు.
275
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd