TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Warangal News
7/27/2016 1:28:48 AM
తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!
-తెలంగాణకు అన్ని కోణాల్లో చబుల్ ఆర్
-సాంస్కృతిక రాజధానిపై సీఎం ప్రత్యేకాభిమానం
-ఓరుగల్లు సౌరభం విశ్వవ్యాప్తం చేయాలనే తపన ఆయనలో ఉంది..
-కాళోజీ కళాకేంద్రం అద్భుత వేదిక కాబోతోంది..
-ఆత్మగౌరవ ప్రతీకలైన కళల పునరుజ్జీవన ప్రక్రియ

వరంగల్ ప్రతినిధి-నమస్తే తెలంగాణ:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీనహోదాపై ఏనాడూ పట్టించుకోలేదు. . సరైన ఆధారాలివ్వలేదు.. కానీ, ఇప్పు డు తెలంగాణ ప్రభుత్వ చొరవ వల్ల తెలుగుభాషకు ప్రాచీన హోదా అతి త్వరలో దక్కబోతోంది. తగిన ఆధారాలను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. ఇక తీపికబురు త్వరలోనే రానుంది.. అని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తంచేశారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన నమస్తే తెలంగాణతో ముచ్చటించారు. అనేక అంశాలపై ప్రతిస్పందించారు.

తెలంగాణ వల్లే తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా రాబోతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాచీన హోదా విష యంలో పట్టింపులేనితనం, సరైన ఆధారాలను ఇవ్వకపోవ డంతోపాటు దాదాపు ఆరేడేళ్లపాటు అటకెక్కిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కోర్టులో ఇంప్లీడ్ కావడం, ప్రాచీన హోదాకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇవ్వడం వల్ల త్వరలో తెలుగు భాషకు ప్రాచీనహోదా లభించబోతున్నది అని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మా మిడి హరికృష్ణ అన్నారు. కోర్టులో అన్ని రకాల వాదనలు పూర్తయ్యాయని, తెలుగు భాషకు సంబంధించిన త్వరలో తీపి కబురు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, దృక్పథం, మార్గం అన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని సుస్థిరం చేసే దిశగా సాగుతున్నాయని ఆయన అన్నారు. ఓరుగల్లు యావత్ తెలంగాణకు సాంస్కృతిక రాజధానిగా ఒకప్పుడు విరాజిల్లిన పరిస్థితి తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పునఃప్రతిష్ట కాబోతున్నదని ఆయన వివరించా రు. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మహనీయుల పేరుమీద రాష్ట్రస్థాయి అవార్డులు ప్రకటించడం గొప్ప విషయమన్నా రు. మంగళవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..ఓరుగల్లు కళా సాంస్కృతిక సౌరభం విశ్వవ్యాప్తం..
తెలంగాణ ఉద్యమంలో కానీ.. ఇవ్వాళ తెలంగాణ స్వరా ష్ట్రంలో కానీ ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, కళా వారసత్వాలను సమున్నతంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. చెబలార్ (ఫోరార్స్ ఫర్ పునర్ నిర్వచనం, పునర్ నిర్మాణం, పునరుజ్జీవనం, పునరాన్వేషణ) ప్రాతిపదికన అన్ని కోణా ల్లో విస్తృత కార్యాచరణ అమలవుతున్నది. అందులో భాగం గా ఓరుగల్లుకు ఉన్న కాకతీయ వారసత్వాన్ని పునరుజ్జీవింప చేసేందుకు ప్రభుత్వం ఆచరణ సాధ్యమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.

1984లో నటరాజ రామకృష్ణ నేతృ త్వంలో పుట్టిన మహత్తరమైన నాట్యరీతి పేరిణికి పూర్వవైభ వం తెచ్చేందుకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో పూర్తి కావడం వల్ల ఏకకాలంలో 256 మంది సుశి క్షుతులైన పేరిణి నృత్యకారులు తయారయ్యారు. ప్రభుత్వ సంగీత కళాశాలలో సర్టిఫికెట్ కోర్సుగా, డిప్లొమో కోర్సుగా రాబోతున్నది. అట్లాగే ఒగ్గుకథకు చుక్కాని అయిన చుక్కా సత్తయ్య నేతృత్వంలో ఇటుకాలపల్లి జనగామలో ప్రత్యేక శిక్ష ణా శిబిరాలు నిర్వహించాం. ఇటీవల సూరజ్‌కుండ్‌లో జరి గిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో ఒగ్గుకథతోపాటు అనేక తెలంగాణ కళారూపాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సంప్రదాయ నృత్యరీతులతోపాటు జానపద కళలకు ఖజా నాగా ఉన్న తెలంగాణలో సమస్త జానపద కళల్ని వెలికితీయ డం, కళాకారుల్ని బతికించుకోవడం తద్వారా కళను భవిష్య త్‌కు అందించడమే ప్రక్రియ కొనసాగుతున్నది.

వీటితోపా టు నిర్మాణాత్మకంగా ఓరుగల్లుకు ఉన్న వారసత్వానికి కొన సాగింపుగా సీఏం ఆలోచనల్లోంచి ఉద్భవించిన కాళోజీ కళా కేంద్ర నిర్మాణం. భవిష్యత్ వందేళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణం జరుగుతోంది. త్వరలో నిర్మాణం పూర్తయి వరంగల్‌కు ఒక అత్యద్భుతమైన వేదికగా ఉండబోతున్నది. కాళోజీ పురస్కారం, దాశరథి పురస్కారం రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే రెండు అవార్డులు వరం గల్‌కు జిల్లాకు చెందిన మహనీయుల పేరుమీద ఇవ్వడం ఒక గొప్ప విశేషం.

హరితకవిత..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ఉద్యమ స్వరూ పంతో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కవులు, సాహి తీవేత్తల భాగస్వామ్యం చేసేందుకు హరిత కవిత పోటీలు నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతి పదివేలు, ద్వితీయ బ హుమతి రూ.7500, తృతీయ బహుమతి 5వేలు, రూ. 2500 చొప్పున నాలుగు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వ బోతున్నాం. సాహిత్య రంగంలో భాషా సాంస్కృతిక శాఖ బతుకమ్మ, బోనాలు, హైదరాబాద్ సంస్కృతిపై పద్యతెలం గాణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వ హించే ఉత్సవాలు ఇలా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విశేష మైన కృషి చేస్తున్నది.

ఆరేళ్ల తర్వాత..
తెలుగు భాషకు ప్రాచీన హోదా విషయంలో 2008-09 నుంచి ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ దాదాపు చేతులెత్తేసే పనిచేసింది. దాదాపు ఆరేళ్లపాటు పట్టించుకోకుండా ఉంటే మళ్లీ తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన త ర్వాత తెలుగుకు భాషకు ప్రాచీన హోదా తిరిగి చర్చకొచ్చింది. ఆర్యభాష కన్నా, ద్రవిడ భాష పురాతనమైనది. ఆ మాటకొస్తే ద్రవిడ భాషల్లోఉన్న తెలుగు ఆర్యభాషల్లోని సంస్కృతం కన్నా ప్రాచీనమైనది అని, శాతవాహ నుల కోటిలింగాల, బౌద్ధ ఆరామంగా ఉన్న ధూలికట్టలో దొరికిన ఆనవాళ్లు ఇలా అనేకానేక ఆధారభరిత, శాస్త్రీయమైన ఆధారాలు నివేదించడం వల్ల తెలుగు భాషకు త్వరలో ప్రాచీన హోదా లభించబోతున్నది. ఎంతోకాలం గా ఎదురుచూసిన తీపి కబురు తెలంగాణలో దొరికిన ఆధారాలతో తెలుగు భాష రుజువు చేయబడి తీర్పు వెలువడే దశలో ప్రాచీన హోదా దక్కబో తున్నదన్న సంకేతాలు వస్తున్నాయి.
392
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd