MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
5/13/2016 3:18:26 AM
ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు
తెలుగుయూనివర్సిటీ : తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని పరిరక్షిస్తున్న వారిని గౌరవించుకోవడం అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి అన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులై విశిష్ట సేవలందిస్తున్న పలువురికి పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 2014 సంవత్సర కీర్తి పురస్కారాలను గురువారం అందజేసి సత్కరించింది. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రమణాచారి మాట్లాడుతూ ప్రతిభామూర్తులను, రత్నాల్లాంటి వారిని వెలికితీసి సత్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మట్టి పరిమళం మన భాషలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు ఎస్. నిరంజన్‌రెడ్డి, రిజిస్ట్రార్ మాసయ్య పాల్గొన్నారు.

పురస్కారగ్రహీతలు వీరే..: వనపట్ల సుబ్బయ్య( సృజనాత్మక సాహిత్యం), ద్యావనవల్లి సత్యనారాయణ (పరిశోధన), శ్రీరమణ (హాస్యరచన), కొండవల్లి నీహరిణి (జీవిత చరిత్ర),ఎం. హేమలత (ఉత్తమ రచయిత),రమాదేవి (ఉత్తమ నటి), నిట్టల శ్రీరామమూర్తి(ఉత్తమనటుడు), డి.వి రమణమూర్తి(ఉత్తమ నాటక రచయిత), కుర్రా హనుమంతరావు(హేతువాదం), షాజహానా(ఉత్తమ రచయిత్రి), జక్కని వెంకటరాజం(కవిత్వం), కోట్ల వెంకటేశ్వరరెడ్డి(వివిధ ప్రక్రియలు), బండారు శ్రీనివాసరావు( పత్రికారచన), మలుగు అంజయ్య(అవధానం), మాంటిస్సోరి కోటేశ్వరమ్మ (మహిళాభ్యుధయం), ఎం.రాంచందర్ (గ్రంథాలయ కర్త), కె.రమణయ్య(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), సత్యవాడ సోదరీమణులు(కథ), శ్రీపాద కుమార శర్మ(నాటక రంగం), బబ్బెళ్ల పాటి గోపాల కృష్ణ సాయి(సంఘసేవ), దెందులూరి పద్మమోహన్(ఆంధ్రనాట్యం), గూటం స్వామి(నవల), పి.నర్సింహారెడ్డి(భాషాచ్చంద సాహిత్య విమర్శ), మోతె ఉప్పలయ్య(జానపద కళలు, చెక్కబొమ్మలు), పేట శ్రీనివాసుల రెడ్డి(ఆధ్యాత్మిక సాహిత్యం), టి.శ్రీరంగ స్వామి(సాహిత్య విమర్శ), రుక్మాంగద రెడ్డి(పద్య రచన), మద్ధాళి రఘురాం (సాంస్కృతిక సంస్థ నిర్వహణ),హేమాద్రి(జనరంజక విజ్ఞానం), ప్రభాకర్(జానపద గాయకుడు), డి.సుజాత దేవి(బాల సాహిత్యం), మర్రి రమేష్(ఇంద్రజాలం), అక్కిరాజు సుందర రామకృష్ణ(పద్య రచన), శంకర్(కార్టూనిస్ట్), కె.బి.కె మోహన్‌రాజు(లలిత సంగీతం), నీతా చంద్రశేఖర్(శాస్త్రీయ సంగీతం) పురస్కారాలు అందుకున్నారు.
275
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd