SATURDAY,    December 15, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
11/15/2015 12:48:32 AM
నాటకం సమస్యకు పరిష్కారం కావాలి
రవీంద్రభారతి, నమస్తే తెలంగాణ : నాటకం సమస్యకు పరిష్కారం కావాలి. సరికొత్త ఇతివృత్తాలను తీసుకుని నాటకాలు రూపొందిస్తే ప్రజలు ఆదరిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. రవీంద్రభారతిలోని ఘంటసాల వేదికలో ఏఆర్.కృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పద్మభూషణ్ ఏఆర్.కృష్ణ 90వ జయంత్యోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీవీ చూస్తూ మనం సహజమైన నాటకానికి దూరమవుతున్నామన్నారు. ఏఆర్.కృష్ణ స్ఫూర్తితో నాటకాలను బతికించుకోవాలని పిలుపునిచ్చారు నాటకరంగ ప్రముఖులు దుగ్గిరాల సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వల్లభనేని వెంకటేశ్వరరావు, నటుడు ప్రతాప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీనాథుడు చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు. ఆకెళ్ల రచనకు దుగ్గిరాల సోమేశ్వరావు దర్శకత్వంలో ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాల కృష్ణ శ్రీనాథుడుగా ప్రధాన పాత్ర పోషించారు. శ్రీనాథుడి సతీమణిగా పద్మప్రియ నటించగా, డాక్టర్ జీబీ.రామకృష్ణశాస్త్రి, మల్లాది వెంకట కుటుంబ శర్మ, కొమరవోలు శ్రీనివాసరావు, మల్లాది భాస్కర్ పుండరి ఇతర పాత్రల్లో ఒదిగిపోయారు.
185
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd