MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Medak News
7/14/2016 12:05:35 AM
పిల్లుట్ల ప్రకాశ్‌కుతెలంగాణ రత్న
కొండపాక : చిందుయక్షగానంతో తన కులవృత్తి ని ప్రారంభించిన ఓ జానపద కళాకారుడు ఇం తింత ఎదిగి జానపదంలో తనదైన బాణీని ఏ ర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ ఉద్యమానికి తన కళను అంకితం చేశాడు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో తె లంగాణ రత్న అవార్డు అందుకున్నాడు. కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన పి ల్లుట్ల ప్రకాశ్ తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్న చిందుయక్షగానాన్ని గ్రామగ్రామాన ప్రదర్శించి కుటుంబాన్ని పోశించుకునేవాడు. క్రమంగా జానపదం వైపు తన కళను మరల్చుకొని జానపద కళాకారునిగా అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

తెలంగాణ ఉద్యమంలో త నదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచాడు. చిందుయక్షగానం, పౌరణిక, పద్యనాటకం, జానపదం పలు కళరంగాల్లో ప్రసిద్ద కళాకారునిగా గుర్తింపు సాధించుకున్నాడు. దేశ వీదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. జానపద రంగంలో పిల్లుట్ల ప్రకాశ్ చే సిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఆర్పితసాహిత్యసాంస్కృతిక స్వచ్ఛంధ సేవా సంస్థ ఆయనకు తెలంగాణ రత్న అవార్డు ను అందజేసింది. విశాఖపట్టణంలోని కళాభార తి ఆడిటోరియంలో జరిగిన 15వ వార్షికోత్సవ సందర్భంగా ఈ అవార్డును అందజేసింది.

ప్ర ముఖ న్యాయమూర్తి సీహెచ్.రామకృష్ణ, విశాఖపట్టణం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ బాలమోహన్‌దాస్, సినిమాడైరెక్టర్ రఘు, సత్యనారాయణ, ఆర్పితస్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకుడు పి.విసోముల చేతులమీదుగా ప్రకాశ్‌కు తెలంగా ణ రత్న అవార్డును అందజేశారు. ఈ అవార్డులో భాగంగా ఆయనకు 20గ్రాముల బంగారు పథకాన్ని జ్ఞాపిక, ప్రశంసపత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ స్వచ్ఛంధ తనకు తె లంగాణ రత్న అవార్డు ఇచ్చినందుకు పిల్లుట్ల ప్ర కాశ్ హర్షం వ్యక్తం చేశారు.
128
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd