TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Khammam News
12/16/2015 1:44:43 AM
పొత్తులు పొసగేనా..!
-సీపీఎం, సీపీఐకి కలిసిరాని ఎన్నికల ఐక్యత
-గతంలో ఒకరినొకరు దెబ్బతీసుకున్నసంఘటనలే అధికం..
-తొలిసారిగా 1985 ఎన్నికల్లో బయటపడిన విభేదాలు
-క్షేత్రస్థాయి కేడర్‌లో ఇప్పటికీ పాత వైఖరే నెలకొనటం విశేషం
-ప్రస్తుత స్థానిక పోరులో ప్రశ్నార్థకంగా కూటమి సభ్యుల మద్దతు..

ఖమ్మం, నమస్తేతెలంగాణ :ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరికి సంబంధించిన వారిని వారు వేర్వేరు క్యాంపుల్లో భద్రంగా కాపాడుకుంటూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇదే సందర్భంలో నాలుగు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుకు మిత్రపక్షాల నుంచి మద్దతు ఏ మేరకు లభిస్తుంది..అన్నదే ఇప్పుడు జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా దెబ్బతిన్న సీపీఐ, సీపీఎంల అగ్రనేతలు భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాటమార్చి మరోసారి అవేపార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎంతవరకు సహకరించుకుంటాయి.. ? అనుక్షణం వామపక్షాలతో ఢీఅంటే ఢీ అన్న కాంగ్రెస్, టీడీపీల మద్దతు ఎలా ఉండబోతున్నది అనేదే హాట్ టాఫిక్‌గా మారింది.

ఖమ్మం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 15: సీపీఎం, సీపీఐ సోదరపార్టీలు.. సమస్య ఏదైనా కలిసి పోరాడేవి.. ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఐక్యంగా బరిలోకి దిగేవి.. ఇరు పార్టీల శ్రేణులను ఒకేతాటిమీదకు తెచ్చి ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించే వి.. గెలిచినా, ఓడినా ఇరునేతలు కూర్చుని విశ్లేషించుకునేవా రు.. బాధ్యతను చెరి సమానంగా పంచుకునేవారు.. ఇదంతా గతం.. ప్రజాపోరాటాలకే జీవితాలను అంకితం చేసిన నేతలున్నప్పటిది..! మరి ఇప్పుడు.. కాలం మారింది.. వామపక్షాల నాయకులూ మారారు.. ఎన్నికలు ఎత్తుగడల కోసమే అన్న వి షయాన్ని పక్కనపెట్టి ఓట్లు, సీట్లే గీటురాయి అనుకున్నారు.. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎంతకైనా తెగిస్తూ వస్తున్నారు.. నాటి మంచికంటి రాంకిషన్‌రావు, వంకాయలపాటి వెంకయ్య దగ్గర్నుం చి.. నేటి తమ్మినేని వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరా వు వరకు ఒకరినొకరు దెబ్బ తీసుకున్నారు.. ఆ క్రమంలో ఉద్యమ గు మ్మాన బలమైన ఉద్యమం కలిగిన సీపీఎం తీవ్రంగా నష్టపోయింది.. కాగా మరికొద్ది రోజుల్లో జరుగబోతున్న స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరెండు పార్టీలు ఎంతవరకు సహకరించుకుంటాయి.. అనుక్షణం వామపక్షాలతో ఢీ అంటే ఢీ అ న్న కాంగ్రెస్, టీడీపీల మద్దతు ఎలా ఉండబోతున్నది. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పువ్వాడ నాగేశ్వరరావు గెలిస్తే ఏపార్టీకి ప్రయోజనం అన్నదే ప్రశ్నార్ధకంగా మా రింది..!

జిల్లాలో ఈనెల 27న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జ రుగబోతున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరుపున మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ ఒంటరిగానే మరోసారి బరిలోకి దిగుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా లింగాల కమల్‌రాజ్ పోటీచేస్తున్నారు. సీపీఐకి చెందిన పువ్వా డ నాగేశ్వరరావు మాత్రం సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఈనెల 12తో నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగియటంతో అభ్యర్థులు క్యాం పు రాజకీయాల్లో మునిగిపోయారు. ఎవరికి సంబందించిన వారిని వేర్వేరు క్యాంపుల్లో భద్రంగా కాపాడుకుంటూ ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఇదే సందర్భంలో నాలుగు పార్టీల ఉ మ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుకు మిత్రపక్షాల నుంచి మద్దతు ఏ మేరకు లభిస్తుం ది..? అన్నదే ఇప్పుడు జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్న చర్చ.

గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న సీపీఐ, సీపీఎంల అగ్రనేతలు భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా పాలక పక్షాలతో కలిసిపోటీ చేయబోమని ప్రకటించా రు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, లేదా టీఆర్‌ఎస్ అన్నీ బూర్జువా పార్టీలని, వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. కానీ ఏడాది దాటగానే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాటమార్చి మరోసారి అవేపార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నారు. ఇలా ఎం దుకు చేశారో..? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చె ప్పిన పువ్వాడ నాగేశ్వరరావును ఒప్పించి ఎందుకు పోటీచేయించారో ఆయా పార్టీల శ్రేణులకే అర్ధం కావటం లేదు.

వామపక్షాలకు కలిసిరాని పొత్తులు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక లేదా మరే ఇతర ఎన్నికలు వచ్చినా 1983కు ముందు వామపక్షాలైన సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసిపోటీ చేసేవి. అప్పటికి ఆరెండు పార్టీలకు జిల్లాలో బలమైన పునాదులు ఉన్నాయి. ఆతర్వాత ఎన్టీఆర్ రాజకీయా ల్లోకి రాగానే తొలిసారిగా టీడీపీతో బహిరంగంగా పొత్తులు కుదుర్చుకుని సీట్లు పంచుకున్నాయి. ఎన్టీఆర్ మరణం తర్వా త చంద్రబాబుతో దోస్తీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేశాయి. ఆయన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పోటీచేశాయి. ఇలా ఒకరితర్వాత మరొకరితో పొత్తులు కుదుర్చుకుంటున్న తరుణంలో జిల్లాలో పైచేయి సాధించేందుకు సీపీఎం, సీపీఐ చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఆక్రమం లో ఎవరైతే ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ సోదరపక్షంలోని శ్రే ణులను సైతం ఫిరాయింపులకు ప్రోత్సహించింది. దీంతో ఇరుపార్టీల శ్రేణుల్లో అసహనం పెరిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇద్దరి మద్యన పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకుం ది. ఇదే అదనుగా భావించిన పాలక పార్టీలు వామపక్షాల్లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని కీలక నాయకత్వాన్ని బయటికి తీసుకువచ్చి సొంతపార్టీ నేతలపై ఎదురుదాడి చేయించాయి. నీతి, నిజాయితీకి, ప్రజాసేవకు అంకితం అనుకున్న పార్టీల్లో జరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాలను బహిర్గత పరిచాయి. వాటన్నింటినీ చూసిన వామపక్ష శ్రేణులు తాము నమ్మిన కామ్రేడ్లు తమనే మోసం చేస్తున్నారన్న కోపంతో ఒక్కరొక్కరుగా ఎర్రజెండా పార్టీలను వీడుతూ వచ్చారు.

1985లో ఉమ్మడి కార్యాచరణకు తూట్లు..!
ఎన్నికలు, ఓట్లు, సీట్లే గీటురాయి అని ఎప్పుడైతే వామపక్షాలు భావించాయో అనాటి నుంచి తాము రూపొందించుకున్న ఉమ్మడి కార్యాచరణకే తూట్లు పొడుచుకున్నాయి. ప్రధానంగా 1985లో ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా సీపీఐ మద్దతుతో సీపీఎంకు చెందిన మంచికంటి రాంకిషన్‌రావు పోటీ చేశారు. అప్పటికే సీపీఎం ఖమ్మంలో గట్టిపట్టు సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తుంది. దీన్ని జీర్ణించుకోలేని సీపీఐ ఎలాగైనా సీపీఎం ఆధిపత్యానికి గండికొట్టాలనే ఉద్దేశ్యంతో మంచికంటికి వ్యతిరేకంగా, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు వెంపటి రామకోటయ్యతో నామినేషన్ వేయించింది.

అదే సంఘటన వామపక్షాల ఐక్యతను తొలిసారిగా దెబ్బకొట్టింది. ఆ తర్వాత కాలంలో ఇరుపార్టీల అగ్రనాయకత్వం జిల్లానేతలకు సర్ధిచెప్పింది. దీంతో ఖమ్మం అసెంబ్లీ నుంచి 1989, 1994 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు వామపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా సీపీఐకు చెందిన పువ్వాడ నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. అదే సందర్భంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం 1996లో కాంగ్రెస్ అభ్యర్ధి పీవీ రంగయ్యనాయుడిపై పోటీకిదిగి గెలుపొందారు. రెండేళ్లలోపే ఉప ఎన్నికలు రావటంతో 1998లో నాదెండ్ల భాస్కర్‌రావు చేతిలో తమ్మినే ని ఓడిపోయారు. దీంతో సీపీఐ తమకు సహకరించలేదని సీపీ ఎం శ్రేణులు బహిరంగ ఆరోపణలకు దిగాయి. ఆ వెంటనే వ చ్చిన 1999 ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీచేసిన పువ్వాడను సీపీఎం ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇరుపార్టీల మ ధ్యన రాజకీయ వ్యూహం బెడిసికొట్టడంతో అప్పటినుంచి ఒకరినొకరు ఓడించుకుంటూ వస్తున్నారు.

క్యాడర్‌లో ఇప్పటికీ పాతవైఖరే..!
జిల్లాలో ఎప్పుడైతే సీపీఎం, సీపీఐ అగ్రనాయకత్వం మధ్య వైరుద్యాలు ఎర్పడ్డాయో అవి కిందిస్థాయి క్యాడర్ వరకు వెళ్లా యి. దీంతో గ్రామాల్లో ప్రాభల్యం పెంచుకునేందుకు ఇరు పా ర్టీల కార్యకర్తలు భౌతికదాడులకు సైతం దిగారు. ఆస్తులు తగలబెట్టుకున్నారు, ప్రాణాలు తీసుకున్నారు. అవేవీ పట్టించుకోకుండా పైస్థాయి నాయకత్వం మాత్రం వారికి అవసరమైనప్పుడల్లా వామపక్షాల ఐక్యత అంటూ అప్పుడప్పుడు ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాం, సహకరించాలంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఒకరి వలన మరొకరు సర్వస్వం కోల్పొయిన సామాన్య ప్రజలు ఏం చేయాలోపాలుపోని స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఇప్పటికీ కిందిస్థాయిలో సీపీఎం అంటే సీపీఐకి అస్సలు పొసగదు. తాజాగా ఈ నెల 27న జరుగబోతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష శ్రేణులకు మరోసారి అగ్నిపరీక్ష ఎదురయ్యింది.

సీపీఐ పార్టీకి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు సీపీఎం మద్దతుతో మరోసారి బరిలోకి దిగారు. ఈ పొత్తు సీపీఎం పార్టీకి చెందిన కిందిస్థాయి క్యాడర్‌కు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తున్నది. గతంలో ఖమ్మం ఎమ్మెల్యేగా తాము గెలిపిస్తే, ఏదైనా పనికోసం వెళ్లిన సందర్భంలో పార్టీ మారితేనే అనే మెలిక పెట్టిన నాయకుడిని ఏ విధంగా సపోర్టు చేయాలంటూ ఒక సీనియర్ కామ్రేడ్ వాఖ్యానించటం విశేషం. ఇదే వైఖరి తమ పార్టీకి చెందిన ఎంపీటీసీలందరిలో ఉందని, ఎమ్మెల్సీ ఓటుతో జిల్లా కేంద్రంలో కూర్చుని, స్వంత ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు చేస్తున్న అగ్రనాయకత్వానికి దిమ్మతిరిగే సమాధానం చెపుతామని అన్నారు. కూటమిలోని కాంగ్రెస్, టీడీపీల సభ్యులది కూడా ఇదే పరిస్థితి. వామపక్ష నాయకులు ఎన్నికలప్పుడే మంచిగా ఉంటారని, అవసరం తీరగానే తిట్టిపోస్తారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిరోజుల్లో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధికి కూటమి సభ్యుల మద్దతు ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు.
814
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd