MONDAY,    December 10, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Karimnagar News
11/15/2017 2:12:21 AM
వాసాలకు బాల సాహిత్య పురస్కారం ప్రదానం
కరీంనగర్ కల్చరల్: బాలసాహిత్యంలో విశేష కృషి చేసిన వాసాల నర్సయ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కార్ ప్రదానం చేశారు. 2017 సంవ త్సరానికిగాను ఆయన ఈ ఆవార్డు అందు కున్నారు. విజయవాడలోని చుక్కపల్లి పిచ్చ య్య ఆడిటోరియం ఇందుకు వేదికైంది. సా హిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చేతుల మీదుగా ఈ పురస్కారం అం దుకున్నారు. రూ. 50వేలు ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి మండలం చెవులమద్ది వాసాల నర్సయ్య స్వగ్రామం. ఆరు దశాబ్దాలుగా బాలసాహిత్యంలో నిరంతర సాహితీ సేవ అందించిన ఆయన మొత్తం 36 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో 28 పుస్తకాలకు పైగా బాల సాహిత్య రచనలే. బుజ్జాయి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, బాలబాట, మొలక తదితర బాలల మాసపత్రికలు, సంకలనాల్లో నర్సయ్య కథలు, బాలల కథలు, పొడుపు కథలు, కవితలు, గేయాలు, గ్రంథ సమీక్షలు, వ్యాసా లు,అనువాదాలు ప్రచురితమయ్యాయి. బాలసాహిత్యంలో నరసయ్య సేవను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి పురస్కారం ప్రదానం చేసింది. ఆ యన ఆవార్డు అందుకున్న సందర్భంగా బాల సాహిత్య పరిషత్, హైదరాబాద్ తరుపున డాక్టర్ ఎం భూపాల్, పైడిమర్రి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
170
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd