TUESDAY,    November 20, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Karimnagar News
5/13/2016 1:19:24 AM
అవకాశం వస్తే విలన్ పాత్ర చేస్తా
-ప్రముఖ హాస్యనటుడు అదుర్స్ రఘు
-అంజన్న సన్నిధిలో పూజలు
మల్యాల: చదివింది ఎంబీఏ, చేసింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం. స్థిరపడ్డది సినీ రంగం.. ఇది ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రఘు అలియాస్ అదుర్స్ రఘు ప్రస్థానం. కమెడియన్‌గా సినీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రఘు, అవకాశం వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కొండగట్టు అంజన్నను దర్శించుకుని, అనంతరం మల్యాలలో యాంకర్ టింకు ఇంట్లో విలేకరులతో తన అనుభవాలు పంచుకున్నారు.

నమస్తే తెలంగాణ: మీరు చదివింది..?
రఘు: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో పుట్టి పెరిగిన నేను, ఇంటర్‌నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత 1992లో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ గ్రూపులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించా. దాదా పు 14 ఏళ్ల పాటు అదే రంగంలో పనిచేశా..

నమస్తే: సినిమాల్లో అవకాశం ఎప్పుడు వచ్చింది..?
రఘు: ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. ఈ క్రమంలో ఆది (జూనియర్ ఎన్టీఆర్) సినిమాలో కమెడియన్‌గా తొలిసారి అవకాశం వ చ్చింది. తర్వాత మళ్లీ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో నా నటనకు గుర్తింపు వచ్చింది. దీంతో అవకాశాలూ వెతు క్కుంటూ వచ్చాయి. ఇప్పటివరకు 140 సినిమాల్లో నటించా.

నమస్తే: కమెడియన్‌గానే స్థిరపడతారా..?
రఘు: కమెడియన్‌గా చేస్తూనే విలన్ పాత్రలో అవకాశం వస్తే నటిస్తా. ఇటీవలి కాలంలో కమెడియన్లు హీరో పాత్రలు చేస్తున్నారు. దానిని మించి ప్రతి నాయక పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అవకాశం వస్తే తప్పకుండా విలన్ క్యారెక్టర్ చేస్తా. కన్నడ భాషలో ఇటీవలే నా మొదటి సినిమా విడుదలైంది. అందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. రఘు ఓ మంచి నటుడు అనే పేరు తెచ్చుకున్నాక.. నేనే స్వయంగా ఓ సినిమా నిర్మిస్తా.

నమస్తే: ప్రతి పుట్టినరోజున గుడికే వెళ్తారట కదా..?
రఘు: అవును, షూటింగ్ లేకపోతే ప్రతి పుట్టిన రోజు వేడుకకు తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు వెళ్తా. షూటింగ్ ఉంటే చిలుకూరు వెళ్లి పూజిస్తా. ఈసారి మాత్రం వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవస్థానాలను సందర్శించా. ప్రేక్షకులు ఆదరాభిమానాలతో రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు రావాలని వేడుకున్నా.

అంజన్న సన్నిధిలో పూజలు
మల్యాల: కొండగట్టు అంజన్నను సినీ హాస్యనటుడు అదుర్స్ రఘు గురువారం తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. రఘు దంపతులను ఆలయ ఈఓ అమరేందర్ సన్మానించారు. అనంతరం మల్యాల వాసి, జెమిని మ్యుజిక్ యాంకర్ టింకు అలియాస్ కట్కం లక్ష్మీకాంత్ ఇంట్లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రఘుకు టింకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
634
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd