THURSDAY,    December 13, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
6/13/2016 12:51:15 AM

వందేళ్ల జామా మసీద్

-మూడో సాలార్జంగ్ చొరవతో సాహెబ్‌నగర్‌లో నిర్మాణం
-వందేళ్ల పండుగకు ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ
వనస్థలిపురం : గతమెంతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన మరుగునపడిన వాటిలో సాహెబ్‌నగర్ జామా మసీదు ఒకటి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి మూడో సాలార్జంగ్(యూసుఫ్ అలీఖాన్) చొరవతో నిర్మించిన ఈ ప్రార్థనామందిరం సమైక్య పాలనలో కనుమరుగయ్యే స్థితికి చేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో వందేళ్ల కిందటి ఈ మసీదు పూర్వవైభవం సంతరించుకోనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కమిటీ సభ్యులు.

ఇదీ చరిత్ర..
హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్‌లోని ఈ మసీద్‌ను వందేళ్ల క్రితం నిర్మించారు. అరబ్ కాలమానం ప్రకారం సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. 1338వ హిజ్రీలో దీని ని ర్మాణం జరిగింది. జుమా నమాజ్(శుక్రవా రం ప్రార్థన)తో ప్రారంభం అయినట్లు శిలాఫలకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం 1437వ హిజ్రీ చివరలో ఉన్నాం. అంటే వంద హిజ్రీలు పూర్తయినట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో సాహెబ్‌నగర్ ప్రాంతంలో భగ్గీఖానా(గుర్రాల శాల) ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

భగ్గీఖానా సమీపంలో ఉన్న పెద్దబావి నుంచి అప్పటి ని జాం సర్కార్‌లో ప్రధానమంత్రి అ యిన మూ డో సాలార్జంగ్‌కు ప్రతిరోజూ గుర్రపు బండిపై తాగునీళ్లు తీసుకువెళ్లే వారని స్థానికులు పేర్కొంటున్నారు. సాలార్జంగ్ కూడా వస్తూ వెళ్లేవారని.. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక మసీద్ ఉండాలన్న ఉద్దేశంతో జామా మసీదు నిర్మా ణం చేపట్టారని చెబుతుంటారు. సాయెబులు అధికంగా నివాసముండడం కారణంగా గ్రామానికి సాహెబ్‌నగర్ అనే పేరు వచ్చిందని చరిత్ర తెలుపుతోంది.

మట్టితోనే మెరిసేలా నిర్మాణం..
మిరుమిట్లు గొలిపే ఈ మసీదు నిర్మాణం పూర్తిగా మట్టితోనే జరిగింది. పైన ఉన్న మినార్లను అందంగా మలిచారు. వందేళ్లు పూర్తయినా ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం గమనార్హం. వనస్థలిపురం ప్రాంతంలో పురాతనమైన మసీదు ఇదేనని స్థానికులు అంటున్నారు. 2012లో మజీద్ కమిటీ పక్కనే పునర్నిర్మాణం చేపట్టింది. రెండు వందల మంది నమాజ్ చేసుకునేలా రూపుదిద్దారు.

వారసత్వ సంపదగా గుర్తించాలి...
వందేళ్ల చరిత్ర కలిగిన మసీదును వారసత్వ సం పదగా గుర్తించాలని కమి టీ సభ్యులు కోరుతున్నా రు. పండుగలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తు న్న ప్రాధాన్యం గతంలో ఎవ రూ ఇవ్వలేదని, మసీదు కు కూడా చోటు కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇక్కడ కూడా జరిగే లా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడో సాలార్జంగ్ నిర్మించారు
ఈ ప్రాంతంలో మసీదు ఉండాలని, వెంటనే నిర్మాణం చేపట్టాలని నిజాం ప్రధానమంత్రి మూడో సాలార్జంగ్ స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చినట్లు పూర్వీకులు తెలిపారు. మసీదులో ఉన్న శిలాఫలకం దీని చరిత్రను తెలియజేస్తోంది. ఇక్కడ అధికంగా సాయెబులు నివా సనముంటుండం వల్ల గ్రామానికి సాహెబ్‌నగర్ అనే పేరు వచ్చింది. -మొఘల్ సత్తార్ బాషా, మసీదు కమిటీ అధ్యక్షుడు
402
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd