MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
5/19/2016 12:07:37 AM

ప్రముఖ వైద్యుడు ఏకే చారి మృతి

అబిడ్స్, మే 18 నమస్తే తెలంగాణ: ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వా తంత్య్ర సమరయోధుడు డాక్ట ర్ అచ్చి కృష్ణాచారి(ఏకే చారి) గుండె పోటుతో ఆయన నివా సంలో మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ రోడ్‌లో నివాసముండే ఆయన గత కొంత కాలంగా హృద్రోగంతో బాధ పడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేర్పించగా ఆయన ఆరోగ్యం కుదుట పడింది. బుధవారం ఉదయం హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన మృతి చెందారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. గురువారం బన్సీలాల్‌పేట్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
246
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd