TUESDAY,    December 11, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
8/29/2016 12:36:35 AM

ప్రతిభకు ప్రతిబింబం

-పాతికేళ్లకే వివిధ రంగాల్లో ప్రావీణ్యం
-జాతీయ, అంతర్జాతీయ డాక్టరేట్లు సొంతం
-నేటి యువతకు రోల్‌మోడల్ డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్
హస్తినాపురం : పాతికేళ్లకే 30కిపైగా డాక్టరేట్లు, 12కు పైగా గౌరవ డాక్టరేట్లను జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి అందుకొని నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. సమాజసేవకుడు, దర్శక నిర్మాత, వ్యాఖ్యాత, చిత్రకారుడు, రచయిత, కవి, సంపాదకుడిగానే కాక అనేక రంగాలలో తన ప్రతిభను చాటుతూ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు లింగోజిగూడ డివిజన్ శ్రీనివాసకాలనీకి చెందిన డాక్టర్ ఆర్యవర్ధన్‌రాజ్. స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అయినప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే సెటిలయ్యాడు. యువతలో పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్న ఆర్యవర్ధన్ ప్రపంచంలోని 527 మతాల మీద, పురాణ, ఉపనిషత్, రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి మత గ్రంథాల మీద, గురువులు, మతగురువులు, ప్రవక్తలు, వారి జీవితాలు, రచనల మీద పరిశోధనలు, చర్చలు, వ్యాఖ్యానాలు, విమర్శలు, విశ్లేషణలు చేశాడు. 18 భారత, అంతర్జాతీయ భాషలను మాట్లాడగలడు 12భాషలను చదువగలడు, 6 భాషలను స్పష్టంగా రాయగలడు.

అంతేకాకుండా చిన్న వయస్సులోనే అత్యధిక డాక్టరేట్లను పొందిన వ్యక్తిగా రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంతటి ప్రతిభాశాలిని మోస్ట్ ైస్టెలిష్ జీనియస్ ఇన్ ద వరల్డ్‌గా ది ఆస్ట్రేలియన్ మ్యాగజైన్ ప్రకటించింది. పలు ఎంఎన్‌సీ కంపెనీలలో కీలక పదవులను చేపట్టిన ఆర్యవర్ధన్ 3సంవత్సరాల కాలంలో 18కంపెనీలలో పనిచేసి 32 కంపెనీలకు ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను అందజేసి, వ్యాపార ప్రణాళికలు ఇవ్వడంలో దిట్టగా పేరుపొందారు. 2013వ సంవత్సంలో ఆయన ఉద్యోగం మానేసే రాజ్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా, సాహిత్య కార్యక్రమాలను చేస్తూ సాహిత్యకారుడిగా, సంపాదకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా, కవిగా, వేదాంతవేత్తగా, ఉపన్యాసకుడిగా, వ్యాఖ్యాతగా, దర్శక నిర్మాతగా, సమాజసేవకుడిగా, బహుభాషాకోవిధుడిగా పలు రంగాలలో సమాజం కోసం విశేషంగా కృషిచేస్తున్న డాక్టర్ ఆర్యవర్ధన్‌రాజ్ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణను నమస్తేతెలంగాణతో పంచుకున్నారు.

చిత్రకారుడిగా : ఇతను ఇప్పటివరకు వరకు 15వేలకు పైగా చిత్రాలను, రేఖాచిత్రాలను, ముఖచిత్రాలను అలాగే మరుగునపడ్డ చిత్రాలను, సేకరించి మరలా తనదైన శైళిలో చిత్రించి వాటికిప్రాణం పోస్తున్నాడు. అనేక గ్రంథాలను ముఖ చిత్రాలను చిత్రించి పెట్టాడు.

చరిత్రకారుడిగా :చరిత్రకారుడిగా పలు సంక్షిప్త, సమగ్ర చరిత్రలను వేల పేజీలుగా సంపుటలుగా రాశాడు. డాక్టర్ బిపన్ చంద్ర నేతృత్వంలో పలు జాతీయ, అంతర్జాతీయ, చారిత్రాత్మక సదస్సులలో పరిశోధనల పత్రాలను ప్రకటించారు. ప్రపంచ, బానిసల, మత, వేశ్యల, ప్రజల, భౌగోళిక, భాషా, సాంసృతిక, రాజకీయ, తత్వశాస్త్ర, హిందూమత, ఇస్లాం, క్రైస్తవ, ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశ చరిత్రలపై 50కి పైగా బృహత్తర గ్రంథాలను రాశారు, రాస్తున్నారు.

రచయితగా, కవిగా : రచయితగా ఈయన రాసిన ద రిడిల్స్ పుస్తకం ప్రపంచ సైకాలజీ చరిత్రలో 3వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఇతను సుమారు 100కి పైగా సొంత రచనలను చేశారు. ఆర్యవర్థన్ రచనలు పలు భాషలలోకి అనువదించబడ్డాయి. తెలుగులోకి అనువాదం చేయబడ్డ మొదటి రచన ద రిడిల్స్ ఆఫ్ సత్యహరిశ్చంద్ర.

సాహితీ వేత్తగా : మరుగున పడ్డ తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని అధునాతన పద్ధతిలో భద్రపరిచి సామాన్య ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 6వేల తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. సుమారు లక్షా72వేల తాళ పత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేశారు.

సంపాదకుడిగా : ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల యొక్క సమగ్ర రచనలను సంపూర్ణంగా సేకరించి, భద్రపరిచి, అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మొదటి విడతగా 1500మంది ప్రముఖ వ్యక్తుల రచనలను వారి కృషిని సమగ్ర సంపుటాలుగా పొందుపరిచి, క్రోడీకరించి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చారు ఆర్యవర్థన్. ప్రస్తుతం రెండో విడతగా మరో 1500మంది సమగ్ర సంపుటాలను అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నారు.

వేదాంత వేత్తగా ఉపన్యాసకుడిగా : వేద, ఉపనిషత్తు, పురాణ, ఉప పురాణ, స్మృతి, ఉప స్మృతి, భారత రామాయణ, భగవద్గీత, బైబిల్, ఖురాన్, జైన, బౌద్ధ, చార్వాక ఇత్యాది గంథ్రాలపైన అలాగే ప్రపంచంలో గల 527 మతాలపైనా పూర్తి సమాచారాన్ని సేకరించి పరిశోధించి, పరిశోధనా పత్రాలను అనేక సదస్సులకు పంపించారు. ఇతను 600పైగా యూనివర్సీటీల్లో విద్యాసంస్థల్లో వెయ్యికి పైగా గెస్ట్‌లెక్చర్స్ ఇచ్చారు.

వ్యాఖ్యాతగా : ప్రముఖుల రచనలను సమగ్రసంపుటాలను, శతకాలను, పురాతన గ్రంథాలను, ప్రస్తుత యువతకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో పుస్తకాలన్నింటినీ, చదవాల్సిన అవసరం లేకుండా సులభంగా అందరూ వినే విధంగా , తన సొంత గళంతో వందల గంటల సమయాన్ని ఆడియో సీడీలుగా రూపొందించి సీడీల రూపంలో అందుబాటులోకి తెచ్చారు.

దర్శక నిర్మాతగా : ఆర్యవర్థన్ రాజ్ స్టూడియోస్‌ని స్థాపించి దర్శక నిర్మాతగా వాలివధ-రామకథ అను లఘుచిత్రాన్ని నిర్మించగా 30కిపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. తర్వాత రాళ్ళపల్లితో మేరాభారత్ లఘుచిత్రంగా జాతీయ ఉత్తమ లఘుచిత్ర అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం యువత మేధాసంపత్తిని వెలికి తీయడానికి సుమారు 100 లఘుచిత్రాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సమాజ సేవకుడిగా : రాజ్‌ఫౌండేషన్‌ను స్థాపించి అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా స్వైన్‌ప్లూ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా కోటి నలబై లక్షల మందికి మందులు పంపిణీ చేశారు. మిషన్ గ్రంథాలయ ప్రాజెక్టు ద్వారా 1400 గ్రామాలలో లైబ్రరీలు ఏర్పాటు చేశారు. ఒక్కోలైబ్రరీకి వెయ్యి పుస్తకాలు ఉచితంగా అందించారు.

ఆర్యవర్ధన్ భవిష్యత్ ప్రణాళికలు
్సపాచీన, అమూల్యమైన గ్రంథాలను , ప్రముఖుల గ్రంథాలను, ఆడియో సీడీలుగా మార్చి సబ్సిడీ ధరపై ప్రజానీకానికి అందించడం. ద్వారా వెయ్యి సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించి యువత తప్పుదారి పట్టకుండా కృషి చేస్తాం. తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి అందరికి అందుబాటులోకి తెస్తాం.

ఆధ్వర్యంలో గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలు తమ గ్రామాన్ని ఎలా అభివృద్ది చేసుకోవాలో సూచించడం. గ్రంథాలయా ప్రాజెక్టులో భాగంగా సుమారు 15వేల గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం. అదేవిధంగా కోటి మందికి పెద్ద బాలశిక్ష పుస్తకాలను అందించడం.డొనేషన్ మూవ్‌మెంట్‌అనే ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అవయవదానం చేసే విధంగా ప్రోత్సహిస్తాం.
443
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd