TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
5/17/2016 12:13:40 AM

పాప్‌కార్న్ వర్క్‌షాప్.. అదుర్స్

హైదరాబాద్ : పాప్‌కార్న్ థియేటర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమ్మర్ థియేటర్ వర్క్‌షాప్‌నకు మంచి స్పందన లభిస్తున్నది. నిర్వాహకులు జంట నగరాల్లోని వివిధ పాఠశాలలకు వెళ్లి.. స్థానిక విద్యార్థులకు రంగస్థల కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1న ప్రారంభమైన ఈ వర్క్‌షాప్ 20వరకు కొనసాగనుందని పాప్‌కార్న్ థియేటర్ ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌రాజ్ వంగరి తెలిపారు. అంజిబాబు, నిఖిల్ జాకబ్, తిరువీర్, రాజ్‌కుమార్, క్రాంతికుమార్, వికాస్ చైతన్య, పవన్మ్రేశ్ తదితరులు విద్యార్థులకు రంగస్థల కళల్లో శిక్షణ ఇస్తున్నారు. వీరి కృషిని భాషా సంస్కృతిక శాఖ అభినందించింది.
640
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd