MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
6/29/2015 1:24:29 AM

ఆధునిక హంగులతో మెట్రో రైతుబజార్

fiogf49gjkf0d
-భరత్‌నగర్ మార్కెట్ డిజైన్లు ఫైనల్
-త్వరలోనే నిర్మాణం షురూ
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : నగరంలోని మెట్రో రైల్ స్టేషన్లు సరికొత్త వసతులతో మైమరపించబోతున్నాయి. స్టేషన్‌లో దిగడమే ఆలస్యం.. మీరు కోరుకున్న వస్తువులు మీ కళ్లముందే వాలిపోనున్నాయి. ట్రాఫిక్.. రోడ్లు దాటాల్సిన అవసరం.. లేకుండా మెట్రోలో ప్రయాణించి అన్నింటినీ కొనుగోలు చేసుకునే రోజులు రాబోతున్నాయి. వంటింటి అవసరాలైన కూరగాయల నుంచి పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోత్వరలో మెట్రో మోడల్ రైతుబజార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగానే కూరగాయాల అమ్మకాల కోసం భరత్‌నగర్ స్టేషన్‌లో మెట్రో రైతుబజార్‌ను హెచ్‌ఎంఆర్ నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ నిర్మించే మెట్రో రైతుబజార్ డిజైన్లు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికంగా ఇక్కడ మెట్రో రైతు బజార్‌ను హెచ్‌ఎంఆర్ వర్గాలు నిర్మించబోతున్నాయి.

మూడు మార్కెట్లు..
140 మీటర్ల వ్యవధి గల స్టేషన్ కింది భాగంలో మూడు మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నారు. రైతుల కోసం రిటైల్ మార్కెట్, వ్యాపారుల కోసం హోల్‌సేల్ మార్కెట్, పార్సిల్ వెజిటబుల్ మార్కెట్లను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. వేటికవే ప్రత్యేకంగా ఉండనున్నాయి. రిటైల్ మార్కెట్ కోసం రెండు ఫీట్ల ఎత్తులో ర్యాంప్‌ను, హోల్‌సేల్ మార్కెట్, పార్సిల్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా కియోస్క్/ షెటర్లను నిర్మిస్తున్నారు. మొత్తం 60 కియోస్క్‌లను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ మూడు మార్కెట్లలో సుమారుగా 150 మంది రైతులు, వ్యాపారులు, అమ్మకందారులు ఉంటారు.

ఏసీ డార్మెటరీ రూం..
రైతులు వ్యాపారులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఇక్కడే ఏసీ డార్మెటరీ రూంను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ 40 మంది రైతులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా గదిని నిర్మిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మార్కెట్లోనే గడపాల్సి రావడంతో వారి సౌకర్యార్థం ఇదే గదిలో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు. ఈ తరహా ఏర్పాట్లు గ్రేటర్‌లోని రైతు బజార్లలో ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

ఫుడ్ జోన్..
స్టేషన్‌లో ప్రత్యేకంగా ఫుడ్‌జోన్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ తిను బండారాలు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ కోసం కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. పార్కులో తచ్చాడినట్లుగా ఇక్కడ ఫుడ్‌జోన్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.

నిర్వాసితులకు బాసటగా..
ప్రస్తుతం భరత్‌నగర్ స్టేషన్ నిర్మించనున్న ప్రాంతంలో గతంలో అసంఘటిత రంగంలో రైతుబజార్ కొనసాగింది. అయితే, స్టేషన్ నిర్మాణం కారణంగా రైతుబజార్‌ను ఎత్తివేయాల్సి వచ్చింది. స్టేషన్ నిర్మాణం కారణంగా 40 మంది హోల్‌సేల్, రిటైల్ అమ్మకందారులు నిర్వాసితులయ్యారు. వీరికి బాసటగా నిలిచేందుకు మెట్రో స్టేషన్‌ను రైతుబజార్‌గా మార్చేశారు. నిర్వాసితుల కోసం ఎర్రగడ్డ ైఫ్లెఓవర్ కింద వీరికి తాత్కాలికంగా ఏర్పాట్లు చేయగా, వాటిని అద్దెను హెచ్‌ఎంఆరే చెల్లిస్తోంది. రైతుబజార్‌లో ఏర్పాటు చేసే రిటైల్ స్టోర్స్‌ను ప్రత్యేకంగా రైతుల కోసమే కేటాయించనున్నారు. మార్కెట్ నిర్మాణం పూర్తి కాగానే స్టేషన్‌లోనే ప్రత్యేకంగా ఉపాధి కల్పించనున్నారు. దళారీలకు అస్కారం లేకుండా, ప్రయాణికులు స్వేచ్ఛగా కూరగాయలను కొనుగోలు చేసుకోవడానికి ఇక్కడ అస్కారముంటుంది.. రైతులే నేరుగా ఈ రైతు బజార్‌లో అమ్మకాలు సాగించవచ్చు. ఇక్కడి మెట్రో స్టేషన్ నుంచి భరత్‌నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు, భరత్‌నగర్ ఫైఓవర్ బ్రిడ్జిలను అనుసంధానం చేస్తూ స్కైవాక్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
358
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd