అపర భగీరథుడు గోపాల్‌రెడ్డి అస్తమయం


Sun,April 15, 2018 03:34 AM

-నివాళులర్పించిన మంత్రి జగదీష్‌రెడ్డి
-పలువురు ప్రముఖుల సంతాపం
గరిడేపల్లి : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, గడ్డిపల్లి కేవీకే వ్యవస్థాపకుడు, ఎత్తిపోతల పథకం రూపకర్త డాక్టర్ ఘంటా గోపాల్‌రెడ్డి(88) శనివారం మృతి చెందారు. గోపాల్‌రెడ్డి గత కొద్ది రోజులుగా మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గోపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి లో 1932లో జన్మించిన ఘంటా గోపాల్‌రెడ్డి తన వి ద్యాభ్యాసం అనంతరం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి రైతులకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికి ఆదర్శంగా నిలిచారు. 1969లో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా ఎత్తిపోత ల పథకానికి రూపకల్పన చేసి గడ్డిపల్లి గ్రామం శివారులో ఆ గ్రామంతో పాటు చుట్టూ ఉన్న ఏడు గ్రామా ల రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురులు కు రిపించేందుకు మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మరి కొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం విశేషం. అంతేకాక గడ్డిపల్లిలో 1984-85 ఆర్థిక సంవత్సరంలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో కేవీకేను ఏర్పాటు చేసి వ్యవసాయరంగ రూపురేఖలను మా ర్చేసి ఘనత సాధించారు.

అలాగే 1980లో గడ్డిపల్లి చుట్టూ ఉన్న ఏడు గ్రామాల రైతులను సమీకరించి అందరి సహకారంతో రైతు సేవా సహకార సంఘా న్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు అనేక సేవలు చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గోపాల్‌రెడ్డి. నేటికి ఈ రైతు సేవా సహకార సంఘ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గడ్డిపల్లి కేవీకే కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పని చేసి వ్యవసాయ పరంగా విస్తృత సేవలు అందించారు. కేవీకే ద్వారా చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1994లో ఉత్త మ కేవీకేగా ఎంపిక చేసి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చతురానందమిశ్రా చేతుల మీదుగా అ వార్డును పొంది ఆదర్శంగా నిలిచారు.

అలాగే జిందా ల్ అవార్డును కూడా పొందారు. దీని ద్వారా వచ్చిన రూ.25 లక్షలను గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు కే టాయించడం గమనించదగిన విషయం. ఇవే కాకుం డా గ్రామంలో ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు 8 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఘంటా గోపాల్‌రెడ్డి కారణంగానే గడ్డిపల్లి సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు దేశంలో గ్రామానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుందనడం అతిశయోక్తి కాదు. గో పాల్‌రెడ్డి పార్ధీవ దేహాన్ని శవపేటికలో అమర్చి ఆయన ఇంటి సమీపంలో సమాధి చేశారు. కాగా గో పాల్‌రెడ్డికి భార్య రత్నమాల, ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, మీరా, కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నారు. అజిత్‌రెడ్డి పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమంలో స్వచ్ఛంద కా ర్యకర్తగా సేవ చేయడం గమనించదగిన విషయం.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...