నాడు కాపరి.. నేడు ఉత్తమ మహిళ


Tue,March 7, 2017 11:09 PM

మునిపల్లి: చిన్నతనంలోనే అమ్మానాన్నలు లోకం విడిచారు. నీడనిచ్చిన మేనమామకు ఆసరాగా కర్రపట్టి పశువుల కాపరి అయింది మల్లీశ్వరి. అంది వచ్చిన సాయంతో వికారాబాద్ మల్లీశ్వరి ఎం.వీ.ఎఫ్ ఫౌండేషన్‌ల్లో అక్షరాలు దిద్దింది .అభిరుచితో కెమెరా పట్టింది.....ఆసక్తి కొద్దీ పాటలు పాడింది.ఆత్మైస్థెర్వమే ఆమె ఆయుధం....ఆత్మ విశ్వాసమే ఆమె బలం...నాన్న వదిలిన బాధ్యతను భుజానికెత్తుకున్న మల్లీశ్వరికి ఆమే స్ఫూర్తి. ఆమె నేడు మరెందరికో స్ఫూర్తి.

అమ్మా నాన్న లేకున్నా..


ఉత్తమ తొలి మహిళ వీడియో జర్నలిస్టుగా ఎంపీకైన గౌండ్ల మల్లీశ్వరి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామం. మల్లీశ్వరి చిన్నప్పటినుంచే కష్టాలకు ఎదురీది పెరిగింది.గ్రామానికి చెందిన గౌండ్ల శరణయ్య, మొగులమ్మ దంపతులకు ఐదు మంది కూతుర్లు, ఒక్క అబ్బాయి. అబ్బాయి పూట్టిన పదిహేడు రోజులకే అమ్మనాన్న చానిపోయారు. అప్పటి నుంచి మేనమామల దగ్గర పెరిగిన మల్లీశ్వరికి ఎంవీఎఫ్ రూపంలో కొత్త జీవితం దొరికింది.మల్లీశ్వరి తలరతను ఎంవీఎఫ్ ఫౌండేషన్ మార్చింది. మల్లీశ్వరి తోబుట్టువులు సరిత,శ్రావాంతి, తమ్ముడు శివకుమార్‌లు అందరూ ఒకే దగ్గర హైద్రాబాద్‌లో ఉంటున్నారు.మీడియాలో విధులు నిరవహించడం మల్లీశ్వరి కళ.

మల్లీశ్వరి రాతమార్చిన భాగ్య నగరం


వికారాబాద్ ఎంవీఎఫ్ ఫౌండేషన్‌లో 7వ తరగతి పూర్తి చేసింది మల్లీశ్వరి.రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలంలోని బాలికల హాస్టల్లో 74శాతం మార్కులతో 10వ తరగతి పాసై, వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది...అక్కడి వరకు ఎంవీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో ఎలాగో నెట్టుకొచ్చిన మల్లీశ్వరి, కూకట్‌పల్లిలో డిగ్రీలో చేరి ఫీజులు కట్టుకొవాడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.డీగ్రిలో స్నేహితులు, కూకట్‌పల్లి మున్సిపల్ అప్పటి కమిషనర్ శ్రీనివాస్ సహాయంతో ఏడాదికి ఆవసరమైన ఫీజు ఒకే సారి కట్టారు.ఆ తర్వత చదవు కొనసాగించే అవకాశం దొరకలేదు.అభిరుచి మేరకు నేర్చుకున్న వీడియోగ్రఫీ అవసరం వచ్చింది. తెలిసిన వారి వేడుకలు వీడియో తీస్తూ కొంచెం...కొంచెం అర్థికంగా ఎదుగుతూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఉస్మానియాలో బీఎస్‌సీలో 68 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మారుమూల గ్రామమైన చిన్నచెల్మెడ గ్రామంలో పుట్టిన మల్లీశ్వరి.....పశువుల కాపరిగా గాను వెట్టి చాకిరి చేస్తూ పరిస్థితులను ఎదురీదుతూ మల్లీశ్వరి సాగించిన ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం మల్లీశ్వరిని ఉత్తమ మహిళా వీడియో గ్రాఫర్‌గా ఎంపిక చేశారు.దీంతో చిన్నచెల్మెడ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలి


తెలంగాణ ప్రభుత్వం 2017 మహిళా దినోత్సవం సందర్భంగా తొలి మహిళా వీడియో జర్నలిస్ట్‌గా మల్లీశ్వరికి అవార్డు ప్రకటించింది.మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామానికి చెందిన మహిళకు ఉత్తమ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.మండలంలోని మహిళలు మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి.రెండు రాష్ర్టాల్లోనూ తొలి మహిళగా అవార్డు తీసుకోవడం సంతోషం.
- మునిపల్లి ఎంపీపీ పట్లోళ్ల ఈశ్వరమ్మపాటిల్

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం


మారుమూల గ్రామమైన చిన్నచెల్మడ గ్రామానికి చెందిన గౌండ్ల మల్లీశ్వరికి ఉత్తమ మహిళ అవార్డు రావడం తో గ్రామానికి రాష్ర్టా స్థాయిలో పేరు తెచ్చింది.తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ వీడియో జర్నలిస్ట్‌గా అవార్డు కుఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.మల్లీశ్వరికి అవార్డు ఉత్తమ మహిళ జర్నలిస్టు అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. - గ్రామ సర్పంచ్ నరేష్‌కుమార్

మండలానికి గుర్తింపు వచ్చింది


మా గ్రామానికి చెందిన మహిళకు అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. మండలంలోని మహిళలు మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలి. మల్లీశ్వరికి ఉత్తమ మహిళ అవార్డు రావడంతో రాష్ర్టాంలో మునిపల్లి మండలానికి మంచి గుర్తింపు వచ్చింది.
- స్థానిక ఎంపీటీసీ రాచమ్మ

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...