వీరనారి కమలమ్మ..!

Mon,March 12, 2018 02:36 AM

-తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ మృతి
-నివాళులర్పించిన వివిధ పార్టీలు, సంఘాలు
పోచమ్మమైదాన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యో ధురాలు చెన్నబోయిన కమలమ్మ (92) ఇకలేరు. నెల రోజులు గా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని దవాఖా నలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ని జాం నిరంకుశ పాలనను ఎదిరించి, ముందు తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కమలమ్మ వృద్ధాప్యంలో కూడా పోరాట పటిమ విడువలేదు.

నైనాల గ్రామంలో జననం
చెన్నబోయిన కమలమ్మ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం నైనాల గ్రామంలో రంగారావు, రంగమ్మకు జ న్మించింది. చిన్నతనంలోనే మరిపెడ మండలం రాంపురం గ్రా మానికి చెందిన చెన్నబోయిన ముకుందంతో వివాహం జరిగిం ది. నాడు గ్రామాల్లో కొనసాగుతున్న నిజాం నిరంకుశత్వం, ద మనకాండను నిరసిస్తూ కధన రంగానికి సిద్ధమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు మద్దికాయల ఓంకార్ నాయకత్వంలో భర్త అప్పన్నతో కలిసి అజ్ఞాత దళంలో అడుగు పెట్టిం ది. అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడు ఉండగా, అత్త, ఆడబిడ్డ వద్ద వదిలేసి పోరాటంలో నిమగ్నమైంది. ఇదే క్రమంలో కొన్నాళ్ల తర్వాత పోరాట గమనంలో కమలమ్మ దం పతులకు రెండో కుమారుడు జన్మించాడు. ఈ సమయంలో సా యుధ పోరాటం త్రీవ స్థాయిలో ఉపందుకుంది. పసిగుడ్డును ఎవరికైనా ఇవ్వాలంటూ పార్టీ తీర్మానించింది. దీంతో కమలమ్మ రక్త సంబంధం కన్నా, వర్గ సంబంధమే విలువైనదిగా భా వించింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా దంపతులిద్దరూ ప్ర జారక్షణ, సాయుధ దళాల ప్రాణాలే ముఖ్యమంటూ పసికందును అడవిలో ఒక గుర్తు తెలియని కోయ జాతి కుటుంబానికి దానం చేశారు. ఇప్పటికీ ఆ బిడ్డ ఏమైంది.. ఎక్కడ ఉంది ఎవరికీ తెలియదు.

ఉర్రూతలూగించిన విప్లవ గీతాలు
ప్రజానాట్యమండలి సభ్యురాలిగా ఉన్న కమలమ్మ గళం నుంచి జాలువారిన విప్లవ గీతాలు, జానపదాలు ప్రజలను ఉ ర్రూతలూగించాయి. ప్రధానంగా సై...సై... గోపాలరెడ్డి.. నీవు నిలిచావూ ప్రాణాలొడ్డి.. తిరునగరి రామాంజనేయులు (ఆనాటి ఆజ్ఞాత కవి) వీరోచిత స్మారక గేయం దేశవ్యాప్తంగా పీడిత ప్ర జల గుండెల్లో మారుమోగింది. వృద్ధాప్యంలో కూడా నిజాం నిరంకుశత్వంపై పాడిన పాటలు అందరినీ ఆలోచింపచేస్తాయి.

ఉద్యమస్ఫూర్తికి ప్రభుత్వ సత్కారం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చెన్నబోయిన క మలమ్మ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోని కమలమ్మ త్యాగనిరతి, పోరాట పటిమను సీఎం కేసీఆర్ గుర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2016లో సత్కరించడంతోపాటు రూ.లక్ష నగదును అందజేశారు.

గ్రంథాలయాల్లో కమలమ్మ పుస్తకాలు
వీరవనితగా పేరొందిన కమలమ్మ చరిత్ర పుస్తకాలు వివిధ దేశాల గ్రంధాలయాల్లో భద్రపరిచారు. తెలంగాణ ప్రభుత్వం 8, 9 వ తరగతి సాంఘికశాస్త్రం పుస్తకాల్లో చెన్నబోయిన కమలమ్మ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. అలాగే గతంలో కమలమ్మను నోబుల్ బహుమతికి అర్హురాలుగా పేర్కొంటూ జాతీ య మహిళా సమాఖ్య ప్రతిపాదించింది. పలు సాంకేతిక సమ స్యలతో నిలిచపోయిందని కమలమ్మ అల్లుడు, పార్టీ నేషనల్ కౌ న్సిల్ మెంబర్ రాంనర్సింహారావు తెలిపారు.

కమలమ్మకు ఘన నివాళి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మకు పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పోచమ్మమైదాన్‌లో నివాసం ఉంటున్న క మలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ద వాఖానలో ఆదివారం ఉదయం చనిపోగా, అక్కడ మగ్దూం భ వన్‌లోనే నివాళులు అర్పించారు. అనంతరం మధ్యాహ్నం మృతదేహాన్ని ఇంటికి తీసుకవచ్చారు. ఈసందర్భంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు నాయకులు, ప్రజా నాట్యమండలి కళాకారులు, మహిళా సమాఖ్య నాయకురాళ్లు శ్రద్ధాంజలి ఘ టించారు. నాడు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమె ప్రత్యేకంగా గుర్తింపు పొందారని గుర్తు చేసుకున్నారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆట పాటలతో నివాళలు అర్పించారు. కాగా సాయంత్రం ప్రారంభమైన కమలమ్మ అంతియయాత్ర రాత్రి వరకు కొనసాగింది. కాగా నివాళులు అర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యుడు వీ రాంనర్సింహారావు, వెంకట్రాము లు, సిరబోయిన కరుణాకర్, నేదునూరి జ్యోతి, న్యూడెమోక్రసీ నాయకులు నున్న అప్పారావు, గంగుల దయాకర్, సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రచయిత్రి అనిశెట్టి రజిత, స్థానిక కార్పొరేటర్ యెలుగం లీలావతి, టీఆర్‌ఎస్ నా యకులు యెలుగం సత్యనారాయణ, అచ్చ విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమార్, మురళి, మైస మొగిలి తదితరులు ఉన్నారు.

365
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles