హృదయాన్ని పరివర్తించే దేవుడు


Thu,January 25, 2018 10:52 PM

jesus
భక్తసింగ్ అనే గొప్ప దైవజనుడు మనమందరం దేవుని దృష్టిలో సమానమైనవారం, కావాల్సినవారం అని చెప్తుండేవాడు. కాని మానవుడు హృదయం చేసిన పాపం వల్ల దేవునికి దూరమైనాడు. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో యిర్మియ 17-9లో ఇలా రాయబడి ఉన్నది. హృదయము అన్నింటి కంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పటికీ మానవుడు హృదయంలో ఉద్భవించే పాపాన్ని బట్టి చెడిపోతున్నాడు. ఎట్లనగా, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, లోభములు, చెడుతనము, కామ వికారాలు, చెడ్డ కళ్లు, దైవ దూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నియూ లోపలి (హృదయం) నుండే బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుచునని ఆయన (యేసుక్రీస్తు) చెప్పెను. చెడు అనే పాపపు హృదయం తొలగించడానికి నీవు ఇష్టపడిన యెడల ప్రకటన గ్రంథం 3-20 వచనంలో హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చెదని అని దేవుని వాక్యం చెప్పబడియున్నది. కాబట్టి మన చెడుతనం, వ్యాధులు, బలహీనతల నుండి విడిపించి, మనల్ని కొత్త వ్యక్తిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 36-26 వచనంలో నూతన హృదయము నీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసెదను అని చెప్పుచున్నాడు.
...?బ్రదర్ జాషువా సత్యవేదం

1061
Tags

More News

VIRAL NEWS

Featured Articles