తిరుప్పావై


Thu,January 11, 2018 11:37 PM

ధనుర్మాస వ్రతం పూర్తి కావొస్తున్నది. భోగినాడు గోదా కల్యాణంతో తిరుప్పావై వ్రతం పూర్తవుతుంది. గోదాదేవి చెప్పిన చివరి మూడు పాశురాలు ఇవి.
andal-kalyanam

28వ పాశురం

కఱవైగళ్ పిన్‌శెన్ఱుకానమ్ శేర్ న్దుణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద ఆయ్‌కులత్తు - ఉన్దన్నై
పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడైయోమ్
కుఱై వొన్ఱు మిల్లాద గోవిన్దా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు!
అరియాద పిళ్ళై గళోమ్ అన్బినాల్ ఉన్దన్నై
శిఱు పేరళైత్తనవుం శీరి యరుళాదే
ఇఱైవా! నీతారాయ్ పఱయేలో రెమ్బావాయ్.


భావం

ఆలమందలతో కలిసి అడవుల్లో పడి తినే కుడిఎడమ తెలియని గోపకులము. నీవు తోడబుట్టిన పుణ్యం మాది. లోకమర్యాదల లోతు ఎరుగని లేమలము. నిన్ను ప్రేమతో పిలుస్తున్నాము. కోపగించుకోకుండా కరుణించు స్వామీ. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

29వ పాశురం

శిత్తుం శిరుకాలే వన్దు ఉన్నై చ్చే విత్తు, ఉన్
పొత్తామరై యడియే పోట్రుమ్ పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱన్దు - నీ
కుత్తేవల్ ఎఙ్గలై క్కొళ్లామల్ పోగాదు
ఇత్తైప్పఱై కొళ్వానన్ఱుకాణ్ గోవిన్దా!
ఎత్తైక్కుమ్ ఏళేళుపిఱవిక్కుమ్, ఉన్దన్నోడు
ఉత్తోమేయావోం ఉనక్కేనామాట్చెయ్‌వోమ్
మత్తైనఙ్కామఙ్గల్ మాత్తేలో రెమ్బావాయ్.


భావం

తెల్లవారకముందే వచ్చి నిన్ను సేవిస్తున్నాము. నీ సుందర పాదారవిందాలను ప్రస్తుతి చేస్తున్నాము. మా గోకులంలో అవతరించి మన్ననలు పొందిన నీకు మేము చేసే సేవ వద్దనడం తగదు. ఏడేడు జన్మలకు.. ఎప్పటికీ నీతోనే వీడని బంధం కావాలి. నీ సేవల్లో తరించాలి. చిల్లర కోరికలు మాకొద్దు.

30వ పాశురం

వఙ్గక్కడల్ కడైన్ద మాదవనైక్కేశవనై
త్తిఙ్గల్ తిరుముగత్తుచ్చేయిళై యార్ శెన్ఱిఱైంజి
అఙ్గప్పరైకొణ్డ వార్తై అణిపుదువై
పైఙ్గమల త్తణ్డెరియల్ ప్పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదున్తప్పామే
ఇఙ్గపరిశురై పార్ ఈ రిరణ్డు మాల్వరైత్తోళ్
శఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎగుం తిరువరుళ్ పెత్తు ఇన్బుఱువరెమ్బావాయ్


భావం

ఓడల కడల కడలిని చిలికిన మాధవుడిని, కేశవుడిని చంద్రాననలు కోరి చేరి స్తుతించారు. వ్రేపల్లెలో పరను పొందారు. అదేవిధంగా భట్టనాథుని కోసం గోద చెప్పిన ముప్పది పాటలను క్రమం తప్పక పాడేవారు చతుర్భుజుడు, దివ్యముఖారవిందుడైన శ్రీమన్నారాయణుని కరుణను పొంది బ్రహ్మానందాన్ని అనుభవించుదురు గాక!

ఆండాళ్ తిరువడిగళే శరణమ్!
aandal

694
Tags

More News

VIRAL NEWS