గీతాంజలి


Fri,January 5, 2018 01:06 AM

Kanakadurga

21వ పాశురం

ఏత్తకళఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప
మాత్తాదే పాల్శొరియుమ్ వళ్ళల్ పెరుమ్పశుక్కళ్
ఆత్తప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్ఱ శుడరే! తుయిలెళాయ్
మాత్తార్ ఉనక్కు వలితొలైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదువన్దు ఉన్ అడిపణియుమాపోలే
పోత్తియామ్ వన్దోమ్‌పుగళ్‌న్దేలో రెమ్బావాయ్


భావం

ఎత్తిన కుండలు ఎదురు పొంగేట్టుగా ఆగకుండా పాలిచ్చే కామధేనువులెన్నో కలిగివున్న నందగోప తనయా మేలుకో. ఆశ్రితరక్షకా! మేలుకో. బలము తగ్గి అసహాయులైన శత్రువులు నిన్ను చేరి, నీ పదములు సేవించిన విధంగా మేము నిన్ను కీర్తింపగా వచ్చాము. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

22వ పాశురం

అఙ్గణ్మాఙలత్తరశర్ అభిమాన
బఙ్గమాయ్ వన్దునిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శఙ్గమిరుప్పార్‌పోల్ వన్దు తలై ప్పెయ్‌దోమ్
కిఙ్గిణివాయ్ చ్చెయ్‌ద తామరై ప్పూప్పోలే
శెఙ్గణ్ శిఱిచ్చిరిదే యెమ్మేల్ విళియావో
తిఙ్గళుం ఆదిత్తియను మెళున్దాఱ్పోల్
అఙ్గణిరణ్డుగొంణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్‌మేల్ చాపమిళిన్దేలో రెమ్బావాయ్.


భావం

విశాలమైన పృథ్విని ఏలే రాజులు అభిమాన భంగమై నీ శరణువేడే విధంగా మేమందరమూ చేరితిమి ఆదరింపుము స్వామీ. కెంజాయ కనుదోయి కరుణా కటాక్షముల, సూర్యచంద్రులు కలిసి ఉదయించినట్లుగా రెండు నేత్రాలతో నిండుగా చూసిన చాలు.. మా శాపకర్మలన్నీ మటుమాయం అవుతాయి. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

23వ పాశురం

మారి మలై ముళంజిల్ మన్నిక్కిడన్దు ఱంగుమ్
శీరియశిఙ్గం అఱివిత్తుత్తీవిళిత్తు
వేరిమయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్‌న్దుదఱి
మూరి నిమిర్దు ముళంగిప్పుఱప్పట్టు
పోదరమా పోలే నీ పూవై ప్పూవణ్ణా! ఉన్
కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ
శీరియ శింగాసనత్తిరున్దు యామ్‌వన్ద
కారియం ఆరాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్.


భావం

కొండగుహలో ఒద్దికగా నిద్రించిన శౌర్యవంతమైన సింహం మేలుకొని, ఠీవిగా జూలు విదిల్చి, గర్జించి బయలుదేరే విధంగా అరుదెంచవయ్యా. కోవెల నుంచి కొలువు కూటమికి వచ్చి, మనోహరమైన సింహాసనాన్ని ఎక్కుము. మమ్ము మన్నించి, దయజూపడానికి వేగంగా రావయ్యా చిన్ని కృష్ణయ్యా. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

24వ పాశురం

అన్ఱి వ్వులగం అళన్దాయ్ అడిపోత్తి
శెన్ఱెంగు తెన్నిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి
పొన్ఱచ్చగడం ఉదైత్తాయ్! పుగళ్‌పోత్తి
కన్ఱు కుణిలా వెఱిన్దాయ్! కళల్ పోత్తి
కున్ఱు కుడైయా ఎడుత్తాయ్ గుణం పోత్తి
వెన్ఱుపగై కెడుక్కుమ్ నిన్‌కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవగమే యేత్తిప్పఱై కొళ్‌వాన్
ఇన్ఱు యామ్ వన్దోం ఇరఙ్గేలో రెమ్బావాయ్.


భావం

అలలోనూ, ఇలలోనూ కొలిచిన చరణాలకు మంగళం. లంకను కూల్చిన అతిబలునకు మంగళం. శకటాసురుడిని చంపిన యశస్వికి మంగళం. గోవర్ధనాన్ని గొడుగుగా ఎత్తినవాడికి జయ మంగళం. వైరుల వధించే నీ వేలాయుధానికి మంగళం. అని నీ వీర చరితము గానం చేసి వచ్చేము కరుణించవయ్యా. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

25వ పాశురం

ఒఱుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒఱుత్తి మగనాయ్ ఒళిత్తు వళర
తరిక్కి లానాగి త్తాన్ తీంగునినైన్ద
కరుత్తైప్పిైళ్లెప్పిత్తు కఞ్ఙన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ఱ నెడుమలే! ఉన్నై
అరుత్తిత్తువన్దోమ్ పఱైతరుదియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్బాడి
వరుత్తముం తీర్‌న్దు మగిళ్‌న్దేలో రెమ్బావాయ్.


భావం

ఒక అమ్మకు కుమారుడివై జన్మించావు. ఆ రాత్రిపూటే మరో అమ్మ ఒడిలో చేరి పెరిగినావు. నిన్ను పరిమార్చడానికి పన్నిన పన్నాగాలను తలకిందులుగ చేశావు. కంసుని గుండె బడబాగ్నివైనావు. ఓ ఆశ్రితపక్షపాతీ! నిన్నే కోరి వచ్చాము. శ్రీ అయిన లక్ష్మికే శ్రీ అయిన నీ విభవం, వీర గాథలు గానం చేస్తాము. జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

26వ పాశురం

మాలే! మణివణ్ణా! మార్‌గళి నీరాడువాన్
మేలై యార్ శెయ్‌వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఙ్ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్చశన్నియమే
పోల్ వన శఙ్గఙ్గళ్ పోయ్‌ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్పఱైయే పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే!
ఆలినిలైయాయ్! అరుళేలో రెమ్బావాయ్.


భావం

మాలయా, మణివర్ణమా.. మార్గళి స్నానం చేసి సిరినోము నోచడానికి ఏమేమి కావాలి స్వామీ! పాల వలె తెల్లన్ని పాంచజన్యాన్ని పోలిన శంఖాలు లోకాలను కంపింపగా మ్రోగగా వింటావా! కృపసేయుమా! మా వటపత్రశాయీ! జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

27వ పాశురం

కూడారై వెల్లుమ్ శీర్‌గోవిన్దా! ఉన్దన్నై
ప్పాడిప్పఱైకొణ్డు యాంపెఱుశమ్మానమ్
నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ
శూడగమే తోళ్వళైయేతోడే శెవిప్పూవే
పాడగమే యెన్ఱనైయ పల్ కలనుం యామణివోమ్
ఆడై యుడుప్పోమ్ అదన్పిన్నేపాల్ శోఱు
మూడ నెయ్ పెయ్‌దు ముళంగై వళివార
కూడి యిరున్దు కుళిర్‌న్దేలో రెమ్బావాయ్.


భావం

కూడని వారిని కూడించే గోవిందా! నిన్ను కీర్తించి పరను పొందుతాము. అపురూపమైన కంకణాలు, భుజకీర్తులు, చెవిదుద్దులు, జుమికీలు, మెట్టెలు, పట్టీల వంటి ఆభరణాలు, ఉడుపులు ధరించి, ఆపై క్షీరాన్నం మునిగేట్టుగా నేయి పోసి, నీతో కలిసి హాయిగా ఆరగింతుము గాక! జగతికే మంగళం చేకూర్చు మన శ్రీవ్రతం.

386
Tags

More News

VIRAL NEWS