ధనత్రయోదశి - ధన్‌తేరస్


Fri,October 13, 2017 01:37 AM

దీపావళి ముందు రోజు నుంచే ధనత్రయోదశి తో పండగ మొదలవుతుంది. ఈ రోజు లక్ష్మీ దేవి ప్రతి ఇంటిలో కొలువుంటుందని నమ్ముతారు. ధనత్రయోదశి నాడు రకరకాల వస్తువులను, ధనధాన్యాలను కొనుగోలు చేస్తారు. ఇలా కొన్న వస్తువుల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో కొలువుండి పోతుందనేది నమ్మకం. ఈ రోజున బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. వీలైతే ఈ నాలుగు వస్తువుల్లో ఏదైనా కొనేందుకు ప్రయత్నించడం మంచిది.
Laxmi
-వెండి నాణెం - పెద్దగా ఖర్చు పెట్టడం కుదరదనుకుంటే వెండి నాణెంతో సరిపుచ్చుకోవచ్చు. దాన్ని పూజలో పెట్టి పూజించుకుంటే సరిపోతుంది. ఈ నాణెం మీద లక్ష్మి, గణపతి రూపాలు ఉంటే మరీ మంచిది.

-ధనియాలు - ధనియాలను లక్ష్మీ రూపాలుగా భావిస్తారు. ధనియాలు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటిని ధనానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు.

-బహుమతి - పళ్లైన వారు భార్యకు ఎర్రని వస్త్రంతో పాటు అలంకార సామగ్రి కొని ఇవ్వవచ్చు. పెళ్లి కాని వారు మరెవరైనా పుణ్యస్త్రీకి ఇవి బహుమతిగా ఇవ్వవచ్చు.

-వంటపాత్రలు - ఇంట్లోకి బీరువా లేదా ఏవైనా వంట పాత్రల వంటివి కొనవచ్చు. అయితే ఇవి ఇనుపవి అంటే స్టీలు పాత్రలు కాకుండా ఇత్తడి, అల్యూమినియం లేదా గాజు సామాగ్రి అయితే మరీ మంచిది.

1109
Tags

More News

VIRAL NEWS