గీతాంజలి- శ్లో. ఉత్తమే క్షణకోప స్స్యాత్...


Sun,August 13, 2017 01:01 AM

geethanjali
శ్లో. ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం,అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్.ఎలాంటివారికైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా ఉండదు. కాని ఉత్తములైనవారిలో ఆ కోపం కొద్దిసేపు మాత్రమే ఉండి తగ్గిపోతుంది. మధ్యములలో రెండు ఘటియల సేపు మాత్రం ఉంటుంది. అధమ ప్రకృతి కలిగిన మనుషులలో వచ్చిన కోపం ఆ రోజంతా ఉంటుంది. ఇక బతికి ఉన్నంతవరకు కోపాన్ని మనసులో పెట్టుకున్నవాళ్లు పాపిష్ఠులు. వాళ్లది రాక్షసత్వమే అవుతుంది.
- భోజచరితం

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles