గీతాంజలి - జన్మ కర్మ చ మే దివ్యమేవం..


Sat,July 29, 2017 11:49 PM

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్తతః
త్యక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో‚ర్జున

Geetha
భగవద్గీత జ్ఞానయోగంలో శ్రీకృష్నుడు అర్జునుడితో ముక్తిమార్గం గురించి ఇలా వివరిస్తాడు. ఓ అర్జునా! నా అవతారం, కర్మల దివ్యమైన స్వభావం గురించి ఎవరైతే తెలుసుకుంటాడో అతడు దేమాన్ని విడిచిన తరువాత మళ్లీ ఈ లౌకిక ప్రపంచంలో జన్మించక నా శాశ్వత ధామమున నన్నే పొందును.

ఆది దేవుడైన భగవంతుని తెలుసుకోవడం చేతనే మానవుడు జనన మరణముల నుండి ముక్తి పొందుట అనే సంపూర్ణ స్థితిని పొందగలుగుతాడు. ఈ సంపూర్ణత్వాన్ని పొందడానికి మరొక మార్గం లేదు అంటూ ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. అయితే భగవద్గీతను తన లౌకికమైన పాండిత్యముతో వివరించి చెప్పినంత మాత్రాన అతడు మోక్షాన్ని పొందలేడు. లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో అతి ప్రధానమైన పాత్ర వహింపవచ్చు. కాని వారు ముక్తికి అర్హులు అవుతారనడానికి వీలు లేదు. లోక ప్రశంసలు పొందిన అలాంటి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజమైన కరుణ కొరకు వేచివుండాల్సిందే. అందువల్ల మానవుడు జ్ఞాన, విశ్వాసములతో కృష్ణ చైతన్యాన్ని అలవరచుకొని ఆ మార్గంలో మోక్షాన్ని పొందవలెనని భావము.

1059
Tags

More News

VIRAL NEWS