ఆధునీకరణలోనూ పక్షపాతమే..


Mon,April 16, 2012 05:16 AM

సదర్మట్,అప్పర్ మానేరు,మూసీ,డిండీ ప్రాజెక్టుల గురించి వివరించండి.
-లక్ష్మినర్సింహాడ్డి, సికింవూదాబాద్
మీరు అడిగిన ప్రాజెక్టుల జాబితాలో ఇదే చివరి ఇన్‌స్టాల్‌మెంట్. సదర్మట్, అప్పర్ మానేరు ఈరెండూ గోదావరి బేసిన్‌కు చెందినవి. మూసీ, డిండీ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లోనివి.
సదర్మట్ ప్రాజెక్టు : వెంకటాపురం గ్రామం దగ్గర గోదావరి రెండు పాయలుగా విడిపోయి మళ్లీ బార్వాపురం గ్రామం వద్ద ఒక్కటవుతుంది. గోదావరి ఎడమపాయ మీద వెంకటాపురం గ్రామానికి మూడు కిలోమీటర్ల దిగువన, బార్వాపురానికి 10 కి.మీ. ఎగువన సదర్మట్ ఆనకట్టను 1891-92లో నిర్మించారు. ఇది ఖానాపూర్ మండలం మేడంపల్లి గ్రామ సమీపాన ఉన్నది. సదర్మట్ ఆనకట్ట కూడా మధ్యలో ఎత్తైన ప్రదేశం కారణంగా రెండు భాగాలుగా ఉన్నది. ఎడమకట్ట నుంచి బయల్దేరే ఖానాపూర్ కాలువ ఖానాపూర్, కడం మండలాలలోని 604 ఎకరాలకు, కుడికట్ట కాలువ ‘బాదన్‌కుర్తి’ పేరుతో పిలువబడుతూ ఖానాపూర్ మండలంలోని బా దన్‌కుర్తి గ్రామంలోని 800 ఎకరాలకు వెరసి 6,848 ఎకరాల కు సేద్యపు నీరు అందించేట్టుగా నిర్మాణం జరిగింది. అయితే కా లక్షికమేణ 1963-2004 ప్రాం తంలో సదర్మట్‌కు 50 కి.మీ. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రథమ దశ పూర్తి చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నీరు విడుదల కావడంతో సదర్మట్‌కు వచ్చే ప్రవాహం తగ్గి సదర్మట్ నిర్ధారిత ఆయకట్టు దెబ్బతినడం ప్రారంభించింది. శాసనసభకు సమర్పించిన (2005-06 సంవత్సరపు భారీ, మధ్యతరహా సాగునీటిపై వివరణ) డాక్యుమెంటులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పిందేమంటే..‘1891 సంవత్సరంలో నిర్మించిన అతి పురాతనమైన ఆనకట్ట (సదర్మట్)కింద గల ఆయకట్టు 6848 ఎకరాలు. కుడి,ఎడమ కాలువలను ఆధునీకరించడం ద్వారా అదనంగా 5618 ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని అందించడంమవుతుంది. అందుచేత ఈ ప్రాజెక్టు కింద గల మొత్తం ఆయకట్టు 12,466 ఎకరాలు. సదర్మట్ కాలువ ఆధునీకరణకు 6.57 కోట్లకు పరిపాలన ఆమోదాన్ని ఇవ్వడమైనది. పనులు జరుగుతున్నవి. ఈ పనులు 2005-06 సంవత్సరంలో కొనసాగించబడుతాయి. ఇదే డాక్యుమెంటు చివరలో 2005-06 సంవత్సర బడ్జెట్ అంచనాలో చేర్చిన, కొనసాగుతున్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ఆర్థిక వివరాల పట్టిక ఇవ్వడం జరిగింది. అందులో సదర్మట్(ఆధునీకరణ, విస్తరణ)(ఎస్‌ఆర్‌ఎస్‌పీ-1 బడ్జెట్ కింద) అనే అంశాన్ని ముఖ్యమైన నిర్మాణంలో ఉన్న మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల జాబితా (నెంబర్-4)లో 27వ క్రమసంఖ్య ఎదుట చూపించి తాజా అంచనా క్రింద 6.57 కోట్లుగా చెప్పారు. కానీ బడ్జెట్ అంచనాలో మాత్రం సున్నాగా చూపించారు.

అయితే విచివూతంగా ఆ తదుపరి విడుదలైన డాక్యుమెంట్లలో అంటే.. 2006-07 గానీ ఆతర్వాత సంవత్సరం డాక్యుమెంట్లలోగానీ సదర్మట్ ఆధునీకరణ ప్రసక్తి ఎక్కడా కనిపించదు. అసలు ఆధునీకరణ ప్రక్రియ కొనసాగిందా లేదా అన్న విషయం ఎక్కడా ప్రభుత్వం తన పుస్తకాలలో బహిర్గతం చేయలేదు.
2005-06లో ప్రకటించినట్లుగా సదర్మట్ ఆధునీకరణ పనులు చేపట్టాలన్న ఆలోచన అర్థాంతరంగా నిలిచిపోయినట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే సేకరించిన తాజా సమాచారం ప్రకారం సదర్మట్ ఆనకట్టకు 7.5 కి.మీ. ఎగువన గోదావరి నదిపైన సదర్మట్ బ్యారేజీ నిర్మాణం ప్రభుత్వం తలపెట్టిందని తద్వారా నిర్ధారిత 6850 ఎకరాల ఆయకట్టుకు తోడు మరో 5600 ఎకరాల ఆదనపు ఆయకట్టుకు ఈ ప్రతిపాదిత బ్యారేజీ సాగునీరు అందివ్వగలదని తెలిసింది.17-10-2008 నాడు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ బ్యారేజీ సవివర క్షేత్ర అధ్యయన నివేదిక (డీపీఆర్)ను తయారు చేసే బాధ్యతను ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పచెప్పినట్లు తెలిసింది. డీపీఆర్ తయారైందని, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, నేడో రేపో ప్రభుత్వం సదర్మట్ బ్యారేజీ నిర్మాణానికి టెండర్లు కూడా పిలువనుందని ప్రభుత్వవర్గాలు చెప్పుతున్నాయి. సదర్మట్ రైతుల అదృష్టం ఎలా ఉందో. ఈ లోగా ఆదిలాబాద్ ప్రజావూపతినిధులు ఆదిలాబాద్ నీటి కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి 12 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వదలాలని అందులో రెండు టీఎంసీల నీటిని సదర్మట్ ఆయకట్టు కోసం కేటాయించాలని పట్టుబట్టడం జరిగింది. సీఎం స్పందన తెలియరాలేదు. ఏదేమైనా 1.58 టీఎంసీల నీటి విలువ సామర్థ్యంతో సదర్మట్ బ్యారేజీ నిర్మాణం జరిగితే ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కష్టాలు కొంతమేరకు గట్టెక్కుతాయని ఆశించవచ్చు.
మానేరు గోదావరికి ఉపనది. కరీంనగర్ జిల్లా గంభీపూరావుపేట మండలం నర్మాల గ్రామ సమీపంలో కట్టిన ఈ ప్రాజెక్టును 1945లో ప్రారంభించి 1950 లో పూర్తిచేశారు. దీనిని నర్మాల ప్రాజెక్టు అని కూడా పిలుస్తుంటారు.
2.158 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 13086 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది ఉద్దేశం. అయితే చాలా కాలంగా వర్షాభావం వల్ల నైతేనేమీ, మానేరు ఎగువభాగంలో విరివిగా చెక్‌డ్యాంలు కట్ట డం వల్లనైతేనేం ఈ ప్రాజెక్టు ద్వారా అంటే ఎడమ కాలువ ద్వారా 740 ఎకరాలు, కుడికాలువ ద్వారా 12346 ఎకరాలు సాగుకావలసి ఉంది. అప్పర్ మానేరు కింద కరీంనగర్ సమీపంలో లోయర్ మానేరు డ్యాం ఉన్నది. ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశలో అంతర్భాగం. ఈ రెండు ఆనకట్టల మధ్య మరో డ్యాం నిర్మాణంలో ఉన్నది. అదే మిడ్‌మానేరు డ్యాం. శ్రీరాంసాగర్ వరదకాలువ ప్రాజెక్టు అంతర్భాగమైన మిడ్ మానేరు డ్యాం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో కూడా భాగమే. అంటే ప్రాణహిత- ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటిని మోసుకువచ్చే లింకు కాలువ నీటిని మిడ్ మానేరు డ్యాంలోకి కలిపితే అందులో కొంతనీటిని అప్పర్ మానేరుకు కూడా ఎత్తిపోతల ద్వారా అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మిడ్ మానేరు, అప్పర్ మానేరు మధ్య ఉన్న 0వేల ఎకరాల ఆయకట్టుకు ఆరు టీఎంసీల నీరందివ్వగల ప్రాణహిత -చే ప్యాకేజీ పూర్తయ్యి, పై ప్యాకేజీలన్నీ పూర్తయ్యి ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీరు మిడ్ మానేరులోకి ఎతిపోతల ద్వారా ప్రవహింప చేసి ఆ నీరు అంతిమంగా అప్పర్ మానే ఆయకట్టుకు చేరినప్పుడే నర్మాల ప్రాజెక్టు రైతుల కష్టాలు తీరుతాయి. అప్పటి వరకు అప్పర్ మానేరు రైతులు అరకొర నీటితో అవస్థలు పడక తప్పదు.
మూసీ ప్రాజెక్టు : నల్లగొండ జిల్లా సోలిపేట గ్రామం వద్ద మూసీ నదిపైన మూసీ ప్రాజెక్టును 1954 లో ప్రారంభించి 1963 లో పూర్తిచేయడం జరిగింది. మూసీ కృష్ణానదికి ఉపనది. సూర్యాపేట, కేతేపల్లి వేములపల్లి మండలాల్లోని 42 గ్రామాలకు నీరందించేందుకు రెండు కాలువల కింద 19,916 హెక్టార్ల ఖరీఫ్ మాగాణీ ఆయకట్టుకు సాగునీటి సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించిందని సాక్షాత్తు సుదర్శనడ్డి- భారీ, మధ్య తరహా సాగునీటిశాఖ మంత్రి- 2011-2012 సాగునీటి డిమాండ్ పై వివరణ పుస్తకంలో తెలిపారు. 19,916 హెక్టార్లంటే సుమారు 49790 ఎకరాలు. మూసీ డ్యాంలో 4.36 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంది.ఈ ప్రాజెక్టుకు 9.4 టీఎంసీల నీటి వినియోగాన్ని కృష్ణా ట్రిబ్యునల్ (బచావత్) ఆమోదించింది. జూలై, ఆగస్టు మాసాలలో రిజర్వాయర్‌లోకి వచ్చేనీరు స్థిరంగా లేకపోవడం వల్ల పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు వీలుకావడం లేదని, కనుక 1973 సంవత్సరంలో ఖరీప్ మాగాణి నుంచి రబీ ఆరుతడివరకు పంట విధానాన్ని మార్చడమయినదని ప్రభు త్వం తెలియచెప్పింది. అంతేకాక కాలువల కింద చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందని కారణంగా ఆయకట్టును తొలిగించి అంతిమంగా 33013 ఎకరాల ఆయకట్టును ఖరారు చేశారు. ఇందులో అత్యధికంగా రబీ పంటయే ఉంది. (సుమారు 31312 ఎకరాలు) 2005 నుంచి ప్రాజెక్టులోకి నీరు తగినంత వచ్చిచేరుతున్నదని ప్రాజెక్టు చరివూతలో మొట్టమొదటిసారిగా సాగునీటి కోసం ఖరీఫ్, రబీ సీజన్లలో నీటిని విడుదల చేయగలిగామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. 2005-2006 సంవత్సరంలో జేబీఐసీ పథకం కింద ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టామని, అయితే ఈ ప్రాజెక్టును భారీ సాగునీటి రంగానికి అప్పచెప్పినందున ఈ పనులను రద్దు చేయడం జరిగిందని ప్రభుత్వమే చెప్పడం వింతగా ఉన్నది. 2009 జూలైలో 26 లక్షల ఖర్చుతో, అలాగే 2011-12లో సుమారు ఒక కోటి రూపాయల ఖర్చుతో పను లు చేపట్టామని, మరమ్మత్తు పనుల వివరాలను ప్రభుత్వం ఏ కరువు పెట్టిం ది. 2010 డిసెంబర్ వరకు 7 కోట్ల 64 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుపైన వ్యయం చేసినట్టు ప్రభుత్వ సమాచారం. మరమ్మత్తుల సంగతి సరే, మరి ఆధునీకరణ విషయమేమైంది అన్న సంగతి అవగతం కావడం లేదు.

డిండీ ప్రాజెక్టు : కృష్ణానదికి ఉపనదియైన డిండీ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో దేవరకొండకు సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్టు1940లో మొదలుపెట్టి 1943 లో పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 1235 ఎకరాలు. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువ నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని 15 గ్రామాలకు చెందిన 9665 ఎకరాల ఆయకట్టుకు సేద్యపు నీరందిస్తున్నది. కుడికాలువ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని 3 గ్రామాలకు నీరందిస్తున్నది. 335 ఎకరాల ఆయకట్టుకే కాక 235 ఎకరాల సిస్టమ్ చెరువులకు నీరందిస్తున్నది. 2.441 టీఎంసీల నిలువ సామర్థ్యం కలిగిన డిండీ ప్రాజెక్టు 3.7 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే అర్హతను బచావత్ ట్రిబ్యునల్ కలిగించింది. ఈ ప్రాజెక్టులో కూడా నిర్ధారిత ఆయకట్టు సేద్యం కావడం లేదు- కనుక గ్రాప్ ఆయకట్టును పూర్తి చేయడానికి 19.7 కోట్ల ఖర్చుతో జేబీసీ మొదటి దశ కార్యక్షికమం కింద కాలువ వ్యవస్థ ఆధునీకరణ ప్రతిపాదన కుదుర్చుకోవడమయిందని, అగ్రిమెంటును కుదుర్చుకుని పనులను ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలియచేస్తున్నది. డిసెంబర్ 2010 చివరి వరకు సంచిత వ్యయం 17.5 కోట్లు అని ప్రభుత్వం 2011-2012 డిమాండ్ నోట్‌లో స్పష్టం చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టులు పురాతనమయినవే. సదర్మట్ అత్యంత పురాతన కట్టడం. 120 ఏళ్ల వయసు.నాలుగింట్లో చిన్నది మూసీ. 50 ఏళ్ల వయసు. ఈ నాలుగు ప్రాజెక్టులను హైదరాబాద్ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక్క మూసీ తప్ప మిగిలిన మూడింటినీ హైదరాబాద్ ప్రభుత్వమే పూర్తిచేసింది. ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా పాతవి కావడం చేత నిర్ధారిత ఆయకట్టుకు నీరందివ్వడం లేదు. నిర్ధారిత ఆయకట్టే కాక ఆదనపు ఆయకట్టుకు నీరందివ్వాలని రైతులు ఎంతో కాలంగానో ఆర్జీలు పెట్టుకుంటున్నారు. అంటే నాలుగువూపాజెక్టులకు ఎపుడో ఆధునీకరణ ప్రక్రియ చేపట్టవలసి ఉండే.

కానీ ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టు తెలంగాణలో ఆధునీకరణకు నోచుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆధునీకరణ కొనసాగిస్తున్నట్టు డ్రామాలాడుతున్నారు. రాజోలిబండ, సదర్మట్‌కు బ్యారేజీలు కట్టుతున్నామని హామీలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు చేస్తారో, అసలు సమైక్య రాష్ట్రంలో పూర్తిచేస్తారో లేదో కూడా అనుమానమే. అదే సీమాంధ్ర విషయంలో తీసుకోండి- కృష్ణా ఆనకట్టకు మారుగా ప్రకాశం బ్యారేజీ, గోదావరి ఆనకట్టకు మారుగా ధవళేశ్వరం బ్యారేజీ, సంగం ఆనకట్ట ఆధునీకరణ, ఎగువన సోమశీల ప్రాజెక్టు, కేసీకాలువ ఆధునీకణ, సుంకేశుల ఆనకట్టకు బదులు బ్యారేజీ వెలిశాయి. మరి తెలంగాణకు ఈ ఆధునీకరణ కానీ, పురాతన ఆనకట్టలకు బదులు బ్యారేజీల నిర్మాణం ఆలోచనేరాదు. ఆలోచనే రానపుడు ఆచరణ ఎక్కడిది. మన తెలంగాణ నాయకులు మొద్దు నిద్రపోతున్నారు. మీ ప్రాంతంలో ఆధునీకరణ పనులు, బ్యారేజీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మా ప్రాంతంలో ఎందుకు తలపెట్టరని అడుగరు. ఇప్పటికైయినా నిద్ర మేల్కొని తెలంగాణ పురాతన నీటిపారుదల కట్టడాలను పరిరక్షించుకుంటారని, పునరుద్ధరించుకుంటారని ఆశిద్దాం.

- ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Featured Articles