ఎస్‌ఎల్‌బీసీ - ఎఎంఆర్ ప్రాజెక్టులు


Mon,February 6, 2012 12:40 AM

PROJECT talangana patrika telangana culture telangana politics telangana cinemaపోతిడ్డిపాడు, కెసీ కాలువకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు కడప, కర్నూలు జిల్లాలో సాగుకు ఉపయోగపడినప్పుడు, ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు తవ్వలేదు. సొరంగ మార్గం ఎంత తవ్వడం జరిగింది? ఎస్‌ఎల్‌బీసీ పూర్తవుతే తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఎన్ని లక్షల ఎకరాలు సాగవుతుంది?

-సి.హెచ్. శ్రీశైలం, మహబూబ్‌నగర్ఎస్‌ఎల్‌బీసీ, ఎఎంఆర్ ఎత్తిపోతల పథకం గురించి వివరంగా చెప్పండి?

- లక్ష్మినర్సింహాడ్డి, సికింవూదాబాద్191లో అఖిల పక్షం చేసిన తీర్మానానికి అనుగుణంగా శ్రీశైలంలోని కృష్ణా మిగులు జలాలను రాయలసీమకు తరలించేందుకు అనువుగా 29 టీఎంసీల సామర్థ్యంతో 2 లక్షల 75 వేల ఎకరాల సాగుకు తెలుగుగంగ కాలువ, 30 టీఎంసీల సామర్థ్యంతో నల్లగొండ జిల్లాకు ఉపయుక్తంగా ఉండేవిధంగా సొరంగాన్ని ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. శ్రీశైలం కుడిగట్టున పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా నీటిని శ్రీశైలం కుడిగట్టు కాలువ నిర్మించి, అక్కడనుంచి బనకచర్ల క్రాసుగ్యులేటర్‌కు నీటిని తరలించి, అక్కడినుంచి మూడు తూములలో ఒక దానిని తెలుగుగంగ, మరోదానిని శ్రీశైలంకుడి బ్రాంచ్ కాలువ, మూడోది నిప్పుల వాగులోకి వెళ్లేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రణాళికలు సిద్ధం చేయడమే తరువాయి నిర్మాణాలన్నీ చక చక జరిగాయి. తెలుగుగంగ కాలువ పైన వె లుగోడు (17టీఎంసీల సామర్థ్యం) బ్రహ్మంగారి మఠం (17టీఎంసీలు), సోమశిల (7 టీఎంసీ లు), కండలేరు (6 టీఎంసీలు)రిజర్వాయర్లు వెలిశాయి.
444 talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలుగుగంగ 29 టీఎంసీల మిగులు జలాలతోపాటు, చెన్నైకు తాగునీటి కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలు తలో 5టీఎంసీల నికర జలాలు వెరసి 15 టీఎంసీల నీళ్లను తీసుకుపోయేందుకు ఉద్దేశించబడింది. సుమారు 400 కిలోమీటర్ల పొడవున్న తెలుగుగంగ, దానిపైన వెలిసిన జలాశయం పనులు శరవేగంగా నడుస్తూ ఉంటే, తెలుగుగంగతోపాటు ప్రారంభమైన 137 కిలో మీటర్ల పొడవున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సొరంగంతో సహా నత్తనడకన సాగుతున్నాయి. 193లో ప్రారంభమయిన ఎస్‌ఎల్‌బీసీ శ్రీశైలం ఎడమ గట్టుకాలువ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందచేయడమే కాకుండా మార్గమధ్యంలో ఉన్న ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం మొత్తం 30 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు ఉద్దేశించపబడింది.

193లో ప్రారంభమయినప్పటికీ 1979 ఆగస్టు 7 న విడుదల అయిన జీవో 315 ప్రకారం శ్రీశైలం ఎడమ కాలువకు అంకురార్పణ జరిగినట్టే భావించవచ్చు. 191 ఆగస్టు 1 న విడుదలైన జీవో 342 లో ఎస్‌ఎల్‌బీసీ కోసం వివరంగా ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయవలసిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. 192, జూలై 29 నాటి జీవో 306లో 30టీఎంసీల కృష్ణా జలాలతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 212 గ్రామాలకు మంచినీరు అందించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో శ్రీశైలం నుంచి 9 మీటర్ల వ్యాసం గల ఒక సొరంగం (దాని పొడవు 4305 కిలోమీటర్లు) తవ్వుతారు. అది డిండి నదిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉపయోగించుకుంటుంది. దీన్నే దిగువ డిండి, నక్కల గండి రిజర్వాయర్ అని కూడా వ్యవహరిస్తారు. అక్కడ నుంచి మరో సొరంగం అదే వ్యాసంతో 7.25 కిలోమీటర్ల పొడవుతో తవ్వుతున్నారు. రెండు సొరంగాల ద్వారా పయనించిన నీరు పెండ్లి పాకల జలాశయం చేరుతుంది.

అక్కడనుంచి ఓ కాలువద్వారా నీరు అక్కంపల్లి జలాశయానికి ఎగువన ఉమ్మడి కేంద్రం (25 కిలోమీటర్లు)కు చేరి అక్కడనుంచి మూసీ జలాశయానికి చేరుతుంది. సొరంగం పనులు సాంకేతిక రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల వెనుకబడిపోయాయి. సొరంగ పనులు ఆలస్యం అవుతున్న కారణంగా 19 లోనే ఎస్‌ఎల్‌బీసీకి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ తీర ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేసి లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సాగు నీరు, అదనంగా హైదరాబాద్‌కు మంచినీరు ఇచ్చేందుకు వీలుగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే 1995లో విడుదలయిన జీవో 55 లో ‘ సొరంగ పథకాలకు ఎలాంటి ఢోకా లేకుండా ఎత్తిపోతలుంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు తాగునీరు, నాగార్జునసాగర్ నుంచి సుంకిశాల వద్ద ప్రత్యేకంగా ‘ఇం ఏర్పాటు చేసి తద్వారా సాగు నీటి వ్యవస్థతో లింకు లేకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించటం జరిగింది.

1994లో సొరంగం పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. నాగార్జునసాగర్ నుంచి ఎత్తిపోతల పథకాలు ప్రారంభమయినా తొలుత ఆ పథకాన్ని ఎస్‌ఎల్‌బీసీ అనే వ్యవహరించారు. కాలక్షికమేణ దానిపేరు ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు (ఎఎంఆర్ ప్రాజెక్టు) అయింది. సొరంగ పథకం కోసం ప్రభుత్వం 213 కోట్ల రూపాయాలకు పరిపాలక ఆమోదాన్ని ఇచ్చింది. 1995లో ప్రారంభమైన సొరంగపథకం పూర్తికావడానికి 7, ఏళ్లు పట్టవచ్చునని, శీఘ్రం గా ప్రయోజనాలు పొందడానికే ఎఎంఆర్ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన.

ఎఎంఆర్ ఎత్తిపోతల పథకం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ తీర ప్రాంతం నుంచి రెండు చోట్ల నీటిని తోడిపోయడం జరుగుతుంది. (2 లక్షల 70 వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడంతోపాటు 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మంచి నీటిని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీని కోసం ఎగువస్థాయి కాలువ +233 మీటర్ల స్థాయిలో,దిగువ స్థాయి కాలువ, +177,70 మీటర్ల ఎత్తులో కొనసాగుతాయి. ఎగువస్థాయి కాలువ 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీటి అందించగా, దిగువ స్థాయి కాలువ 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. పంపింగ్‌కు అవసరమయ్యే 4 పంపులు ఒక్కొక్కటి 25 వేల హార్స్‌పవర్ 1 మెగావాట్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఇక దిగువ కాలువ విషయానికి వస్తే వరదల సమయంలో గ్రావిటీ ద్వారా వరదలు లేని సమయంలో 4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంపులనుపయోగించి సాగర్ నీటిని తోడి పోసే విధంగా ఏర్పాటు చేశారు.

సాగర్ పూర్తి జలస్థాయి +179 మీటర్లు (590 అడుగులు) సొరంగ పథకంలో భాగంగా మొదటి సొరంగాన్ని టన్నల్ బోరింగ్ మెషీన్ ఉపయోగించి తవ్వుతున్నారు. 43.5 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 14 కిలోమీటర్ల తవ్వకం పూర్తయినట్టు సమాచారం. డిండి ఆవల ఉన్న చిన్న సొరంగం 7,25 కిలోమీటర్లు పొడవు ఉంది. దీన్ని సాంప్రదాయక డ్రిల్ ఆండ్ బ్లాస్ట్ పద్ధతినుపయోగించి తవ్వడం పూర్తి చేశారు. డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ చాలా మందకొడిగా సాగటానికి కారణం వరద పరిమాణం ముందు ఊహించిన దానికంటే గణనీయంగా పెరగటం. సొరంగ పథకంలో అంతర్భాగమైన లింకు కాలువలు, పెండ్లి పాకల జలాశయం సామర్థ్యం పెంపు, ప్రధాన కాలువ లైనింగ్ పనులకు టెండర్లు పిలువవలసి ఉంది.

ఇక ఎలిమినేటి మాధవడ్డి కాలువ పరిస్థితికి వస్తే ఎగువ స్థాయి కాలువకు సంబంధించిన అప్రోచ్ చానల్, సిస్టమ్స్, లింకు కాలువ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ జలాశయం, మూసీ వరకు ప్రధాన కాలువలను పూర్తి చేయ టం జరిగింది. కాని పంపిణీ కాలువ వ్యవస్థ అసంపూర్తిగానే ఉంది. ప్రభు త్వం ఎఎంఆర్ ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2 లక్షల 7 వేల 525 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించామని ప్రచారం ఆర్భాటంగా చేసుకుంటున్న ది. ప్రయోగాత్మకంగా 16,17 డిస్ట్రిబ్యూటరీలలో 5400 ఎకరాలకు సూక్ష్మ సేద్యం ద్వారా నీటివసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. సూక్ష్మసేద్యానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఎస్‌ఎల్‌బీసీ పట్ల దారుణ వివక్ష
మొదట్నుంచి ఈ ప్రాజెక్టు పట్ల దారుణ వివక్ష. 40 కిలోమీటర్ల తెలుగుగంగ కాలువకు సమానంగా ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ పథకానికి విడుదల చేసిన నిధులను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపైన ఖర్చు ఎక్కువపెట్టి, బడ్జెటులో సగభాగంలో తెలంగాణకే పెడుతున్నామంటున్నది. మరి అంతకుముందు 50 ఏళ్లు చేసిన అన్యాయం మాటేమిటి? తొలుత ప్రతిపాదనలలో 3500 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలనుకుంటే దాన్ని 1200 క్యూసెక్కులకు కుదించి, అతి కష్టం మీద 2400 క్యూసెక్కులకు రాజీపడటం, అదేవిధంగా సాగర్ జలాశయం 540 అడుగుల పైన ఉన్నప్పుడే నీరు తీసుకోవాలని పట్టుపట్టడం, అంతిమంగా జలాశయం స్థాయి 5106 అడుగుల పైన ఉండేట్టు అంగీకరించడం, అక్కంపల్లి జలాశయం అవసరం లేదని వాదిస్తూ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటం కాలు కల్పిస్తున్నారు.

ఇప్పుడు అమలులో ఉన్నట్టు ఒకే దశలో ఎత్తిపోతలకు బదులు 5 దశలలో ఎత్తాలని అంటూ అవరోధాలు సృష్టించారు. ఈ రోజున ఎస్‌ఎల్‌బీసీ పథకం విజయవంతంగా అమలు కావడంతో ధైర్యం వచ్చి మహబూబ్‌నగర్‌లో భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి పథకాలకు రూపకల్పన జరిగి అమలులోకి వచ్చాయి. అలాగే దేవాదుల ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడానికి ఎఎంఆర్ విజయమే ప్రధాన కారణం. ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపే వివక్ష అంతటితో ఆగలేదు. మొత్తం ఎత్తిపోతల పథకాలకు సూక్ష్మ సేద్యం అమలు చేయాలని జీవో 34 తీసుకువచ్చింది. అదే జీవోలో ఎఎంఆర్‌వూపాజెక్టులో 5400 ఎకరాల సూక్ష్మసేద్యం చేపట్టాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఇప్పుడా ప్రయత్నం విరమించింది. సూక్ష్మసేద్యం అమలుకు పట్టుబట్టడానికి కారణం కృష్ణాజలాలతో తెలంగాణ వాటా తగ్గించి ఆ మిగులును రాయలసీమకు తరలించాలని భావించడం ఒక టీఎంసీ 10 వేల ఎకరాలకు బదులుగా 15 వేల ఎకరాల అని నిర్ధారించడం ఈ కుట్రలో భాగమే.

జాతీయ ప్రాజెక్టులు
జాతీయ ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తిస్తే వాటికి 90 శాతం నిధులు కేంద్రంనుంచి గ్రాంటులుగా వస్తాయి. కనుక ప్రతి రాష్ట్రానికి తమ ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని తహతహ. మన రాష్ట్రంలో రెండు ప్రాజెక్టులు 1) పోలవరం రూ. 16,200 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల రూ. 40300 కోట్లు వీటిని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని తీవ్రంగా ప్రయత్నాలు జరగుతున్నాయి. జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలంటే ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు ఇవ్వాలి. అంటే విడిగా సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు తప్పని సరిగా పొందాలి. ప్రస్తుతం పోలవరం సుప్రీంకోర్టు పరిధిలో, ప్రాణహిత- చేవెళ్ల కేంద్ర జలసంఘం ప్రాంగణంలో ఉన్నాయి. కనుక జాతీయ హోదా కల్పించడం ఇప్పట్లో సాధ్యం కాదు.

తొలుత జాతీయ పథకంగా గుర్తించాలంటే ప్రాజెక్టు అర్హతలు కఠినంగా ఉండేవి. రాజకీయ వత్తిళ్ల మూలంగా అర్హతలను సడలిస్తూ వచ్చారు. ఉత్తరవూపదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడం జరిగింది. అంతకు ముందు కేంద్రం దేశంలోని 14 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించింది. పంజాబ్, జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో రెండేసీ ప్రాజెక్టులు, పశ్చిమబెంగాల్, అస్సోం,ఉత్తరాంచల్, మహారాష్ట్ర మధ్యవూపదేశ్‌లో ఒక్కోటి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ సరిహద్దుల్లో మరొకటి మొత్తం 14 ప్రాజెక్టులు, యూపీలో రెండు కలిపి 16 ప్రాజెక్టులు జాతీయ హోదాను దక్కించుకున్నాయి. ఒక రాష్ట్రానికి ఒకే ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నది నిజం కాదు. వడ్డించేవాడు మనవాడే ఉంటే ఎన్ని ప్రాజెక్టులైనా జాతీయ ప్రాజెక్టులుగా అవతరిస్తాయి. తెలంగాణ ఉద్యమం, జగన్ యాత్రలు, ఉప ఎన్నికల నేపథ్యంలో పోలవరం ప్రాణహిత రెండు ప్రాజెక్టులకు కూడా కేంద్రం జాతీయ హోదా కల్పించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం, మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర